Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/790

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము .. అయితే కీన్సు - సారస్వతాభిమాని, కళాప్రియుడు, మహా మేధావి, గొప్ప ఆర్థికశాస్త్రవేత్త, మహావ్యక్తి అని అనుకొనినంత మాత్రమున చాలదు. మీదు మిక్కిలి ఆతడు మానవత్వవాది (Humanist). మానవుని అవధిలేని పురోభివృద్ధిలో, అభ్యుదయగామి యగు మానవుని మను గడలో, అచంచలమైన విశ్వాసము గల మానిసి అతడు. ఆర్థికశాస్త్రమున ఒక తీవ్ర సంచలనము కలిగించి, ఒకానొక క్రొత్తవాదమునకు మూలపురుషుడైన కీన్సు, వ్యక్తిగా మహనీయుడైన కీన్సు 1948 వ సంవత్సరము, ఏప్రిల్ 21 వ తేదీన, ససెక్సు రాష్ట్రములో ఫిల్లీ టిల్టను నందు హృద్రోగమువలన మరణించెను. (i) ఆర్థిక వ్యవస్థ: కీన్సు తన మహా గ్రంథమగు సామాన్య సిద్ధాంతము (The General Theory) ను చాల చాకచక్యముతో గూడిన ఉపోద్ఘాతముతో ప్రారం భించెను. సాంప్రదాయిక ఆర్థిక వాదులు- క్లాసికల్, నియోక్లాసికల్ అర్థశాస్త్రవేత్తలు తమ గ్రంథములలో వర్ణించిన ఆర్థిక వ్యవస్థ వారి ఊహాలోక మునందు మాత్రమే గల వ్యవస్థయనియు, వాస్తవ పరిస్థితులకును, ఆకాళ హర్మ్యమునకును ఎంతేని వ్యత్యాసము గలదనియు ఆతని ఉపోద్ఘాతము. ఆర్థిక స్వేచ్ఛా విధానమున ఉత్పత్తి, సప్లయి, అ పేతల సూత్రానువ ర్తినియై ప్రవర్తిల్లుననియు అట్లు సప్లయి, అపేక్షల శక్తుల బిగివలన ఏర్పడిన నైశ్చ ల్యములో (equilibrium) కాయకష్టము చేయగల ప్రతి వానికిని తప్పక దొరకుననియు సంప్రదాయ వాదుల సిద్ధాంతము. అనగా స్వచ్ఛందము కాని నిరుద్యోగ సమస్య కలుగనే కలుగదని వారి మతము (involuntary unemployment). డేవిడ్ రికార్డోను అతని ప్రత్యణాను యాయులను, మిల్లును, మార్షల్ను పిగూను కూడ క్లాసికల్ వేదాంతులనుగా కిన్సు నిర్వచించెను. ఉత్పత్తి సాధనములుగా వ్యక్తిగతమైన ఆస్తులు, వ్యష్టి సాహ సము పునాదులుగా గల స్వేచ్ఛాయుత ఆర్థిక విధాన ములో సంపూర్ణోద్యోగావకాశములు బిందువువద్ద నున్న ఆర్థికశక్తులు, స్వయముగా నిశ్చలత నొందును అనువారి వాదము, ఒకానొక ప్రత్యేక ఆర్థిక సంఘటననుమాత్రమే వర్ణించుననియు, పెట్టుబడి దారీ విధానము యొక్క పరిణా మమున ప్రకృతదళయందు సాధారణముగ ప్రవ ర్తిల్లు స్థితి 93 737 కీన్సు. జె. యం. బహుళ వ్యాప్తమైన నిరుద్యోగమునుండి అసమగ్రమైన ఉద్యోగము (under employment) వరకు ఏదైన కావచ్చుననియు ఆతడు సమాధానించేను. సాంప్రదాయిక ఆర్థికవాదులు వర్ణనలు ప్రత్యేక సంఘటనను మాత్రమే వర్ణించునవియై యుండగా తన రచనలయందే సర్వ సామాన్యమైన సిద్ధాంతము (General Theory) పొదగ బడి యుం డెనని ఆతని సవాలు. 5 వాస్తవ మేమన క్లాసికల్ నియోక్లాసికల్ అర్థశాస్త్ర వేత్తలు నిరుద్యోగ సమస్యను గూర్చి ప్రస్తావించలేదు. వాస్తవ పరిస్థితులకును, వారి రచనలయందు గల పెట్టు బడిదారీ విధానమునకును నడుమ పెద్ద అఖాతము గలదు. "అనుభవమున గల నేటి వాస్తవ పరిస్థితులను అర్ధముచేసి కొనుటకు క్లాసికలు ఆర్థిక సిద్ధాంతములను ఉపయోగించి నచో అది ఎంతయు అనర్థదాయకమే యగును. ఏలియన అది మనలను తప్పుత్రోవ పట్టించును." అని కీన్సు వక్కా ణించెను. ఆర్థిక సంక్షోభములను గూర్చియును 'క్లాసికలు వేదాంతులు ప్రస్తావించి యుండలేదు. జె. బి. సే యొక్క విపణుల సూత్రమును ఈ సందర్భమున ఉదాహరింప వచ్చును. ఉత్పత్తి తన గిరాకీని తానే సృష్టించుకొనును అనునది ఈ సూత్రము. ఈ సూత్రముననుసరించి అధికో త్పత్తి ఉండజాలదు. తమ అర్హత ననుసరించి వేతనములు స్వీకరించుటకు కార్మికులు అభ్యంతరము చూపనిచో నీరు ద్యోగ సమస్యయు ఉద్భవించదు. అధిక వేతనములకై సమ్మెచేయు కార్మికులు స్వచ్ఛంద నిరుద్యోగమునకు మాత్రమే తార్కాణము. ఉత్పత్తి చేయబడినదంతయు అమ్ముడుపోవును. నిలువ చేయబడినదంతయు ఉత్పాదక వస్తువులను (Producer's Goods) ఉత్పత్తిచేయు పరిశ్రమ లలో మూలధనముగా వినియోగింపబడును. ఇట్లు రాబడి అను ప్రవాహము యొక్క గమనమున అడ్డంకు లుండుటకు అవకాశమే లేనందువలన సార్థక వస్తువుల ఉత్పత్తి తన గిరాకీని తానే సృష్టించుకొనునని క్లాసికలు అర్థశాస్త్ర వేత్తలు చెప్పుదురు. కాని ఇది అంతయు వా స్తవమునకు ఎండేని దూరము. ఏలయన గడచిన ఆర్థిక సంక్షోభ సందర్భ మున, అమెరికాలో, గిరాకీ పడిపోయిన వస్తువుల నమ్మలేని విక్రేతలు, ధరలపాటు నరికట్టుటకు గాను, వస్తురాశినే కొంత నాశనముచేయవలసి వచ్చినది. 1992 నాటి ఆర్థి ఆర్థిక