Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/789

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కీస్సు. జె. యం. గ్రఫీ (Essays in Biography)" అను గ్రంథములను కీన్సు ప్రకటించెను. మొదటి పుస్తకమునందు కీన్సు తనకు గల రాజకీయ సిద్ధాంతములను వెల్లడించెను. రెండవ పుస్తకమున మాల్టస్, ఎడ్జివర్తు, జెవన్సు, మార్షలు మున్నగు అర్థశాస్త్రవేత్తల యొక్క సంగ్రహ జీవితములు, భావములు విశదీకరింపబడెను. చర్చిలువంటి రాజనీతిజ్ఞుల ప్రశంసయు ఈ రెండవ పుస్తకమునందు కలదు. కాని సాంప్రదాయక ఆర్థిక విధానముపై కీన్సు విప్లవ ధ్వజమెత్తినది 1996 వ సంవత్సరములోనే. ది జనరల్ థీరీ ఆఫ్ ఎంప్లాయ్ మెంట్ (The General Theory of Employment), ఇంట రెస్ట్ అండ్ మనీ (Interest and Money), అను మహాగ్రంథములను అతడు ప్రకటించెను. ఇవి ఆర్థిక శాస్త్రవేత్తెలను ఉఱ్ఱూతలూగించిన విప్లవాత్మక రచనలు. మారుచున్న సమాజ వ్యవస్థకు అనుగుణముగా ఆర్థిక సిద్ధాంతమునుకూడ పెంపొందించుటయే కీన్సు చేసిన పని, విజ్ఞానశాస్త్రమునందలి అభివృద్ధితో ప్రభుత్వ యంత్రాంగ ములో వచ్చు మార్పులతో, అంతర్జాతీయ స్థాయిలో విస్తృతమగుచున్న విపణితో, వర్గళక్తుల సమైక్యముతో, క్లుప్తముగా చెప్పవలెననిన సమాజ వ్యవస్థలో శరవేగ ముతో వచ్చుచున్న మార్పులను ప్రతిఫలించునట్టి తుల్య ప్రాబల్యముతో A.Murali (చర్చ) అర్థశాస్త్రము పెరుగలేక పోయినది. సంప్రదాయవాదుల ఊహాలోక మునందు మాత్రమే కల ఆర్థిక స్వేచ్ఛావిధానము పాతబడిన విధానము. పెట్టుబడి దారీ వ్యవస్థయందలి విషభాగములను ఛేదించక తప్పదు. ద్రవ్యపరిమితి, ధనము యొక్క నిల్వలు, పరిశ్రమలలో పెట్టుబడి, వడ్డీ రేటు, అపేడను హెచ్చుచేయుట మున్నగు విషయములలో ప్రభుత్వ ప్రమేయము ఎంతేని అవసరము. ఆర్థిక సమస్యల విషయములో తెలివితేటలతో వ్యవహ రించుటకు ఏకైక మార్గము వాటి జోలికి పోకుండుటయే అను పాతపాటకు స్వస్తి చెప్పి ఆర్థిక సుస్థిరతను కాపాడు ' టకు ప్రభుత్వమువద్ద గల ఆయుధాగారము అజేయమైనది అను సిద్ధాంతమునకు నాందిని పలికినవాడు కీన్సు. కీన్సు రచించిన తుదిపుస్తకము 1940 లో ప్రకటింప బడినది. అది యుద్ధవ్యయములను భరించు చెట్లు? (How to pay for war?) అనునది. కీన్సు లక్ష్యము పెట్టుబడి దారీ విధానమును పునరుద్ధరించుట కాని, దానిని నిర్మూ 736 సంగ్రహ ఆంధ్ర లించుట కాదు. సర్వదా స్వేచ్ఛాయుత సమాజము సమష్టి విధానముకంటె, వర్గవిధానముకంటే ఉత్తమో త్తమ మైనదని ఆతనియొక్క దృఢమైన నమ్మకము. 1942 లో బ్రిటిష్ ప్రభుత్వము ఉత్తమ పౌరుడగు జాన్ మేవార్డు కీన్సును 'ప్రభువు' ను చేసి, గౌరవించెను, బ్రిటిష్ పార్ల మెంట్ లో ప్రభువుల సభయందు అప్పటినుండి ఆతడు L చట్టనిర్మాణమున ఆర్థికాంశములు చర్చలకు ఎంత యో దోహదము చేసెను. B అంతర్జాతీయ ద్రవ్యనిధిని ద్రవ్యనిధిని ఏర్పాటు చేయుటకు, ప్రాతిపదిక చర్చనీయాంశముగా 1943 లో ప్రపంచ ఆర్థికశాస్త్రవేత్తలు సూత్రప్రాయముగా అంగీక రించిన నమూనా కీన్సుచే తయారుచేయబడి కీన్సు ప్రణాళికగా చలామణి యైనది. బ్రెట్టనువుడు' మహాసభలలో ప్రాముఖ్యమును వహించిన వ్యక్తి కిన్సే. తుది దినముల యందును అంతర్జాతీయ ద్రవ్యనిధికిని, ప్రపంచ బ్యాంకు నకును ఆతడు గవర్నరుగా ఉద్యోగ బాధ్యతలను నిర్వ హించెను. సమకాలిక ఆర్థిక సంఘటనలపై అతని పలుకుబడి అట్టిది. కీన్సుకు గల కళాభిమానము తక్కువదిగారు. నేషనల్ గ్యాలరీ ట్రస్టీగా, లలితకళలను ప్రోత్సహించుటకు ఏర్పాటు చేయబడిన కౌన్సిలునకు అధ్యక్షుడుగా ఆతడు చాలా కాలము కళారంగమున ప్రాముఖ్యమును వహించెను. కెమార్గో బ్యాలెట్ నృత్యమండలిని స్థాపించి నిర్వహించెను. కేంబ్రిడ్జిలో కళాప్రదర్శనశాల నొకదానిని నిర్మించి ఆవిష్య రించెను. " న్యూ స్టేట్స్మన్ అండ్ ది నేషన్ " ది పత్రిక యొక్క పొలకవర్గములో ముఖ్యుడై ఆ పత్రికను విజయ వంతముగా నడపేను. వ్యవహారవేత్తగా, కళాభిమానిగా ఆతడు మరియొక ప్రముఖ అర్థశాస్త్రవేత్త యగు " డేవిడ్ రికార్డ్" ను జ్ఞప్తికి తెచ్చును. కీన్సు జీవితమును గూర్చి ప్రస్తావించునపుడు అతని వ్యక్తి గళాదర్శములను, సద్గుణములను పేర్కొనక తప్పదు. విధేయుడైన కుమారుడుగా, తాను పనిచేయు కళాశాల యొక్క పాలక వర్గములోని సభ్యులలో కళాశాలను ప్రేమించువాడుగా, ఆప్తమిత్రుడుగా, భవిష్యత్తుగల యువకుల నాదరించి పోషించుటలో చానపరుడుగా, కీన్సు మన హృదయముల నాకర్షించి తీరును.