కాళేశ్వరము అను శ్లోకమున కాళేశ్వరమును పేర్కొనెను. ఆంధ్రదేశము సందలి కాళేశ్వరగ్రామమును బేర్కొన్న మొదటి చారిశ్రా కాధారము విద్యానాథుని శ్లోక మే యని తెలియుచున్నది. ad విద్యానాథుని పై శ్లోకమునుబట్టి కాకతీయ యుగము నందు కాళేశ్వరము మిగుల ప్రసిద్ధమయిన శైవ క్షేత్ర మయి, శ్రీశైల రాజారాను క్షేత్రములతో సమాన మయిన మహత్త్వముకలదిగా నెంచబడెననుట నిశ్చయము. “అభినవదండి” కేతనరచితమైన దశకుమార చరిత్రము" నకు పీఠిక వ్రాయుచు శ్రీ శేషాద్రిరమణ కవులు దశకుమార చరిత్రయందు ఆంధ్ర నగరములు కొన్ని పేర్కొనబడినట్లు వచించి వాటియందు "కాళేశ్వరము" కూడ నున్నట్లు చెప్పిరి. ఇది సత్యమయినచో విద్యానాథు నకు ముందుకూడ దండికాలమునందే ఆంధ్రదేశస్థమయిన కాళేశ్వరము ప్రసిద్ధమయి యుండెనని తెలియగలదు. దశకుమార చరిత్రమునందలి మంత్రగుప్త వృత్తాంతము నందు ఆంధ్ర నగరమును, ఆంధ్రరాజును బేర్కొనబడుట యథార్థమేకాని, యందు కాళేశ్వర ప్రశంస కానరాదు. మరియొక చోట దానియందే పుష్పోద్భవ చరితమునందు రాజవాహనుడు “సోమదత్త ! మహా కాళేశ్వరారాధనా నంతరం భవద్వల్లభాం. నిజకటకం ప్రాపయ్య ఆగచ్ఛ " అనీ సోమదత్తునితో పలికినట్లు గలదు. ఇక్కడి మహా కాళేశ్వ రుడు ఉజ్జయినియందలి మహా కాళనాథుడేకాని కాళే శ్వరమునందలి శివుడుకాడని ఆకథా సందర్భమునుబట్టి తెలిసికొనవచ్చును. జీవితప్ప మరియొకచోట కాళేశ్వర ప్రసక్తి మన యాంధ్ర దేశ స్థమయిన దానినిగురించినది దశకుమార చరితమునందు తెనుగునగాని, సంస్కృతమున గాని ఉన్నట్లు కానరాదు. ఇదికాక నర్మదానదీతీరము నందు నొక కాళేశ్వర క్షేత్రమున్నట్లు పురాణములు చెప్పు చున్నవి. వీటినిబట్టి ఉత్తర దేశస్థమయిన కాళేశ్వర క్షేత్ర మునకు అనుకరణముగా ఆంధ్రదేశమునందు గోదావరి యొడ్డున నీకాళేశ్వర క్షేత్రము తరువాతికాలమున వెలసి పని యూహించుటయు నసమంజసముకాదు. అట్టి క్షేత్ర ములు కొన్ని దక్షిణ దేశమున నేర్పడెన మటకు మధురాది నగరణామములే సాక్షి, కాళేశ్వరములో జైన, బౌద్ధనిర్మాణముల అవశేష ములుకలవు. అందుచే ఈ క్షేత్రము రెండువేల సంవత్సర 726 సంగ్రహ ఆంధ్ర ములవాడే సుస్రసిద్ధ క్షేత్రముగా విలసిల్లినట్లూహింప వచ్చును. తరువాత క్రమముగా ఇది శైవ తీత్రముగా మారినట్లు చరిత్రకారులు భావించుచున్నారు. నిశుంభు తను రాక్షసుడు కాళేశ్వర ప్రాంతమును పరిపాలించు చుండగా, ఆంధ్రవిష్ణువు ఆ దానవుని జయించి, దానిని తన వేంగి రాజ్యమునందు గలు కొనే ననుటకు చారిత్రకాధా రములున్నట్లును, ఈ ఆంధ్రవిష్ణువు క్రీ. శ. 3వ శతాబ్ది వాడని ఊహించబడినట్లను నిశ్పబడినది. కాని కొందరు చారిత్రకు లియాంధ్ర విష్ణువు సాతవాహన రాజులకన్న ప్రాచీన కాలముననే ఆంధ్ర దేశము నేలినట్లు భావించు చున్నారు. "ఆంధ్రవిష్ణువు నిశుంభుని చంపి ఋష్యాశ్రమ ములకు వానినుండి భయమును మాన్పెను. మరియు మహేంద్ర సర్వతమును, భీమేశ్వరమును, కాళేశ్వరమును, శ్రీశైలమును కలిపి యాంధ్రవిష్ణువు తన రాజ్యమునకు ప్రాకారమును నిర్మించెను." 'ఆంధ్రుల చరిత్ర - సంస్కృతి' (101, 102 పుటలు) అను గ్రంథమునుబట్టి కాళేశ్వరము బ్రహ్మాండ పురాణ కాలమునుండియు సుప్రసిద్ధమయి యున్నట్లు చెప్పవచ్చును. శ్రీరాముడు వనవాసము చేయుచు కాళేశ్వర ప్రాంత మున చరించినట్లు అక్కడ స్థానిక కథనములున్నట్లును, స్కాంద పురాణాంతర్గతమయిన కాళేశ్వర ఖండమునందు కాళేశ్వరస్థలమాహాత్మ్య మనేక కథల మూలమున నిరూ పింపబడినట్లును తెలియుచున్నది. దీని యాథార్థ్యము విచారణీయము. కాళేశ్వరమునందలి లింగమునందొక ప్రత్యేకతకలదు. ఇక్కడ నొకే పొనపట్టముపై రెండులింగములు గలవు. అందొకటి కాళేశ్వరలింగము, రెండవది ముక్తీశ్వర లింగము. అందు మొదట కాళేశ్వరుని పూజించి తరువాత ముక్తీశ్వరుని పూజింపవలయుననియు, ఇట్లు పూజించిన వారు యమలోక బాధలను అనుభవింపక మోక్షమును బొందుదురనియు విధితనుగుచున్నది. ముక్తీశ్వర లింగ మునకున్న రెండు బిలములలో నెంత నీరుపోసినను అవి నిండవనియు, ఆరంధ్రములనుండి నీరు గోదావరిలోనికి చేరుననియు, భక్తుల విశ్వాసము. ఇచట బ్రహ్మాలయముతోపాటు వేంక టేశ్వరాలయము, సరస్వత్యాలయము, అన్నపూర్ణాలయము, బిందు మాధవ
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/779
Appearance