Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/780

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము - ౨ మందిరము, బాలరాజేశ్వరాలయము, వీరభద్రేశ్వరాల యము, రామాలయము, చంద్రశేఖరాలయము మున్నగు ఆలయములు మిక్కిలి శిథిలావస్థయందున్నవి. కాళేశ్వర దేవాలయములోని శిల్పకళాఖండములు కొన్ని బహు రమ ణీయములుగా నున్నవి. పై ఆలయములన్నియు నొకేకాలమున వర్ధిల్లినవని చెప్పలేము. మన దేశమునందు అతి ప్రాచీనకాలము నుండియు శైవము అధికముగా వ్యాప్తియందుండి వ్యాప్తియందుండి యున్నట్లు అనేక చారిత్రకాధారములు చెప్పుచున్నవి. కిరణప్రసరణము తరువాత జైన బౌద్ధమతములు మరల శైవము, వైది కము, వీరశైవము, వైష్ణవము, మహమ్మదీయ మతము ఒక ధాని యనంతరమింకొకటి క్రమముగా వృద్ధిపొందినవి. ఏమత మేక్కువ ప్రచారమునందున్నప్పు డా యా మతము లకు చెందిన ఆలయములు వెలసినవి. ఇన్ని ఆలయము లొకే స్థలమునందున్న కాళేశ్వరము అన్ని కాలములందు అన్ని మతములవారికి పవిత్రమయిన యాత్రాస్థలముగా విరా జిల్లెనని చెప్పవలసి యున్నది. కాళేశ్వరము పూర్వము మహావైభవము ననుభవించిన గొప్ప పుణ్య క్షేత్రము. ఆ. రా. ళ. కిరణ ప్రసరణము (Radiation) : ఒక కేంద్ర బిందువునుండి ఏదేని యొక శక్తి నలు దిక్కులకు వ్యాపించుటయే 'కిరణప్రసరణ' మనబడును. దీనినే ఇంగ్లీషులో 'రేడియేషన్' అందురు. భౌతిక శాస్త్ర ములో, ఉష్ణధారణ కిరణ ప్రసరణము (Thermal (Thermal radiation), బ్రహ్మాండ, కిరణప్రసరణము (Cosmic radiation), రేడియో ఆక్టివ్ కిరణప్రసరణము (Radio active radiation) మున్నగు పలురకములై నవి శేషఘట నల (Phenomena) ను కిరణ ప్రసరణము (Radiation) వివరించును. వీటిలో మొదటిది, అనగా ఉష్ణకిరణ ప్రసర ణము సంక్షిప్తముగ ఈ వ్యాసమునందు వివరింపబడినది. 3 ఉపోద్ఘాతము : ఎండలో నిలబడినపుడు మనము పొందు ఉష్ణత, మంచుగడ్డకు (Ice Block) సమీపములో నిలబడి నవుడు మనము పొందు శీతలత్వము, ఉష్ణధారణ కిరణ ప్రసరణమును విశేషఘటనను గూర్చి మనము అత్యంత సామాన్యముగ గడించు ప్రయోగానుభవము. ఉష్ణపదార్థ ములనుండి బయలు వెడలు ఒక విధమైన కిరణ ప్రసర ణము, మన శరీరములో ప్రవేశించి శోషణము (absor- ption) చెందుటవలననే 'ఉష్ణము' అను భావము మనకు గోచరించుచున్నది. శీతలత్వము అను భావము శీతల పదా ర్దముల నుండి ఉత్పన్నమగు వేరొక విధమగు కిరణ ప్రసరణము వలన కలుగునని ఇంతకు పూర్వము శాస్త్ర 727 జ్ఞులు ఊహించిరి. కాని 1782 లో 'ప్రివోస్ట్' (Privost) అనునతడు తన 'వినిమయ సిద్ధాంతము' (Theory of exchanges) లో పైన ఉదాహరించిన రెండు విధము లయిన అనుభవముల యొక్క ఐక్య చిత్రము (Unified picture) ను ప్రతిపాదించెను. ఇతని సిద్ధాంతము ననుస రించి, పరిమితమయిన ఉష్ణోగ్రత గల ప్రతి పదార్థము నిర్విరామముగ ఉష్ణధారణ కిరణప్రసరణమును బహిర్గ తము చేయును. ఈ ప్రసరణము యొక్క తీవ్రత (Intensity) ఆ పదార్థము యొక్క ఉష్ణోగ్రతపై ఆధార పడి యుండును. ఉష్ణోగ్రత అధిక మైన కొలది, ప్రసరణము యొక్క తీవ్రత అధికమగును. మానవ శరీరములు ఈ సిద్ధాంతమునకు అపవాదములు (exception) కావు. అగ్నికి దగ్గరగా కూర్చున్నప్పుడు మనము బహిర్గతము చేయు కిరణ ప్రసరణముకంటె ఎక్కువ కిరణ ప్రసరణ మును మనము గ్రహింతుము. దీని ఫలితాంశము ఉష్ణ తాలాభము, తదనుభవము. తదనుభవము. మంచుగడ్డ సమీపమున కూర్చున్నచో, పై అనుభవమునకు భిన్నముగా, మనము పొందగలుగు శక్తికంటే ఎక్కువ శక్తిని బహిర్గత మొనర్చు టయు, తత్ఫలితముగా ఉష్ణత్వమును కోల్పోయి, శీతలత్వ మును అనుభవించుటయు జరుగును. విద్యుదయస్కాంత వర్ణమాల (Electromagnetic Spectrum) : క్రీ.శ.1798 నుండి 1900 వరకు, కిరణ