విజ్ఞానకోశము - రము నవయౌవనము ద్వారా అభివ్యక్తమైనది (1-82), ఈ సౌందర్య చిత్రణలో భౌతిక లక్షణములను ప్రధానముగా భావించక, ఆసవాది శబ్దములను ప్రయోగించి, పార్వతిని భావించినాడు. పుష్పమునగాక, అందలి ఆసనమున సౌందర్యమున్నదట (కు. సం. 1.81, 82). ఇంతేకాదు. తన మహాకావ్యమున శివుని నైష్ఠికసుందరునిగా భావిం చిన కాళిదాస మహాకవి శాకుంతలమున ఆశ్రమములలోని యజ్ఞ ములలో రమ్యతగలదనీనాడు. వైదికదృక్పథము : వై దిక క్రియలపై, ఆశ్రమములపై కాళిదాస మహాకవికి గొప్ప ఆదరము, భక్తి కలదు. శ్రమ ప్రధానులగు తపోధనులలో తేజస్సు అంతర్లీనమని చెప్పి, వార్థకమున ఆశ్రమమునకు రావలసినదిగా శకుంత లకు కణ్వునిచే చెప్పించినాడు. భూలోకమున ఆశ్రమము లలో ప్రారంభమైన శాకుంతల నాటకము ద్యులోక మందలి ఆశ్రమమున పూర్ణమైనది. రఘు మహారాజు కౌత్సుని గౌరవించిన ఘట్టముకూడ కవియొక్క దృక్ప థమును చాటుచున్నది. ఇట్టి మహాకవి, శ్రుతులలో ప్రసిద్ధిచెందిన సరస్వతి వర్ధిల్లుగాక యని ప్రార్థించుటయే గాక, పునర్జన్మ లేకుండ చేయుమని ఆత్మభువిని వేడుట ఆశ్చర్యకరముకాదు. సౌజన్యము ; సత్పురుషులు అను అగ్ని చేత తన కావ్య సువర్ణమునకు వన్నె రాగలదని, విద్వాంసులు మెచ్చనంత వరకు తన కావ్యసృష్టిపై తన కాత్మవిశ్వాసము లేదని పల్కిన మహాకవి కాళిదాసు రచనలలో అహంకారము కన్పించదు. విశేషమగు వినయము, వేదవాఙ్మయముపై భక్తి శ్రద్ధలు. అద్వైత వేదాంతమున గాఢమగు నమ్మ కము ఈ మహాకవికి గలవని ఈ కావ్యములు వ్యక్తము చేయుచున్నవి. కాళేశ్వరము: పో. సు. కాళేశ్వరము కరీంనగరము మండలమునందలి మంథెన తాలూకాయందు మంథెనకు తూర్పుగా 28 మైళ్ళ దూర మున గోదావరీ నదియొక్క దక్షిణ తీరమునందున్నది. ఇక్కడనే "ప్రణీత" యను ఉపనది గోదావరియందు కలిసినది. కాళేశ్వరము ప్రాచీన కాలమునుండి చాల ప్రసిద్ధమయిన శైవక్షేత్రము, నేడిది చాలా కుగ్రామముగా 725' కాళేశ్వరము నున్నది. ఇక్కడికి చేరుటకు సరియయిన సౌకర్యములు లేవు. ఇచ్చటి దేవాలయములు చాల జీర్ణావస్థయం చున్నవి. అయినను యాత్రికులు దూరదూర దేశముల నుండి వచ్చుచునే యుందురు. కాళేశ్వరమునకు, మంకెన, మహాదేవ పురముల మీదుగా వెళ్ళుటకన్న సిరివంచనుండి గోదావరిని దాటి వచ్చుటయే చాల సులభము. కాళే శ్వరమును దర్శించు యాత్రికులలోగూడ బొంబాయి బస్తరు రాజ్య నివాసులే అధిక సంఖ్యాకులుగా నుందురు. ఈ ప్రాంతము చాళుక్య, కాకతీయ సామ్రాజ్యముల వైభవ విశేషములను జూపుచుండును. కాళేశ్వరమును “దక్షిణకాశి" అని వ్యవహరించుటయు గలదు. ఈ వ్యవహారము దీని ప్రత్యేక మహిమకు చిహ్నము కాకపోయినను, ముఖ్యములయిన శైవ క్షేత్రములలో నీదికూడ నొక్కటి అని తెలియుచున్నది. భౌగోళికముగా నేటి ఆంధ్రదేశమునకు కాళేశ్వర మొకవైపు సరిహద్దుగా నున్నది. ఇది చాల ప్రాచీన కాలమునుండియు నీచే కలదని కొందరి యూహ, ఇందుకు మన దేశమునకుగల “తెలుగు” అను "పేరును వా రాధారముగా జూపుచున్నారు, ఈ తెలుగు పదము "త్రిలింగ" శబ్ద భవమనియు, ఆ త్రిలింగములు శ్రీశైల, దాక్షారామ, కాళేశ్వరములందలి వనియు, అహోబలపతి, అప్పకవి, విన్నకోట పెద్దన స్పష్టముగా చెప్పియున్నారు. త్రిలింగములను గూర్చియు, తత్సంబంధమున కాళేశ్వర మును గూర్చియు మన మెరిగినంతవరకు మొట్టమొదట చెప్పినవాడు ప్రతాపరుద్ర మహారాజుకడ ఆస్థానవిద్వాంసు డయిన విద్యానాథ మహాకవి. ఆతడు 'ప్రతాపరుద్ర యశోభూషణ మను తన అలంకార గ్రంథమున ప్రతాప రుద్రుని సంబోధించినట్లుగా దేశ స్త్రిభి రేషయాతి మహతీం ఖ్యాతిం త్రిలింగాఖ్యయా యేషాం కాకతి రాజకీర్తి విభవైః కైలాస శైలాః కృతాః తే దేవాః ప్రసర త్ప్రసాద మధురా శ్రీ శైల కాళేశ్వర చాజారామ నివాసినః ప్రతిదినం త్వచ్ఛేయసే జాగ్రతు.”
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/778
Appearance