Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము = ౨ గ్రహణపాత్రలోనికి ప్రవహించును. ఈ స్వేదనద్రవము 40.50% ఆల్కహాలును కలిగియుండును. శుద్ధమైన 90-95% పారిశ్రామిక ఆల్కహాలును తయారు చేయుటకు ఇంకను పెద్దవియు వివిధరకములకు చెందినవియు అగు విభాజిక స్వేదన యంత్రములు (Fractional distillation units) కావలయును. కాఫీ (Coffee) స్వేదనయంత్రము అట్టి వాటిలో నొకటి. ఈ స్వేదనపాత్రలో మామ్ (Mash) తొలుగ స్వేదనము చేయబడును. అప్పుడు వచ్చిన సజల జల్కహాలు వేశ్వర ఉష్ణోగ్రతల వద్ద స్వేదనము పొందు వివిధ ద్రవపదార్థములు వేరుచేయబడి 95% ఆల్కహాలు లభించును. ఆల్కహాలుకన్న ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద ఆవిరి యగు, ఫ్యూసెలూసె అనబడు చిక్కనైన ద్రవము స్వేదనపాత్రలో మిగిలిపోవును. ఈ స్వేదనక్రియవలకు 95-8% ఆల్కహాలును 4.4% నీరును కల స్వచ్ఛమైన ఆల్క హాలు లభించును. ఈ సమ్మిశ్రమమును ఎజియోట్రోపు (azeotrope) అందురు. స్వచ్ఛమైన సంయోగపదార్థము వలె (compound) ఇది 78.4° C వద్ద స్వేదనము చెందును. దీనిలో నుండి నీటిని ఇంకను తీసివేయవలెననిన పొడిసున్నము మొదలగు నీటిని తీసివేయు పదార్థములను కలుపవలెను. ఒక ఫ్రెంచి వ్యాపారసంస్థచే కనిపెట్టబడిన "మెల్లిస్ ఫోర్తు టెక్నిక్" (Melle's fourth technique) ప్రకారము స్వచ్ఛమగు 100% ఆల్కహాలు ఎజిమోట్రాఫిక్ స్వేదన క్రియద్వారా తయారు చేయవచ్చును. ఈ విధానములో 95.8% ఆల్కహాలుకు బెంజీనును కలిపి ఈ సమ్మిశ్రమమును స్వేదన పరచుటవలన బెంజీను, నీరు కొంచెము అల్కహాలు కల సమ్మిశ్రమము. 65°C వద్ద ఆవిరిపొంది స్వచ్ఛమైన ఆల్కహాలు పాత్రలో మిగులును. నవీన విధానములలో ఈ పద్ధతిని మాష్ ద్రవమునుండి ఒకే మెట్టులో ఆల్క హాలును తయారుచేయుటకు ఉపయోగించుచున్నారు. ఇట్టి సిద్ధాంతమునే ఆధారముగా కొని డ్రావినాల్ పద్ధతిలో బెంజీనుకు బదులుగా “ట్రైక్లోరో ఎతిలీన్" ను ఉపయోగించి ఆల్కహాలును తయారు చేయుచున్నారు. ఈపరిశ్రమలో ముఖ్యముగా కార్బన్ డై ఆక్సైడు, పూసె లనూనె ఉపపదార్థములుగా వచ్చుచున్నవి. కార్బను డై ఆక్సైడు పులియునపుడు తొట్టెలనుండి గ్రహించి నిలువ చేయుదురు. ఇదిమన కార్భను డై ఆక్సైడు, డ్రై ఐస్, సోడా 19 ఆల్కహాలు - మద్యసారము పానీయములు చేయుటకు ఉపయోగించుచున్నారు. ఫ్యూసెల్ నూనెలో అమైల్, ప్రొఫైల్, బ్యుటైల్ అను ఆల్కహాలులు ఉండుటచే వాటిని తయారుచేయుటకై ఈ నూనెను ముడిపదార్థముగా ఉపయోగించుచున్నారు. త్రాగుటకు అర్హమగు ద్రవములు: పులియుట ఆధార ముగా గల పరిశ్రమలలో ఆల్కహాలు పరిశ్రమ తరువాత త్రాగుటకు అర్హమగు పానీయములను తయారుచేయు పరిశ్రమలు ముఖ్యమైనవి. ద్రాక్ష సారా, బీరు సారా మొదలగునవి, చక్కె రపదార్థములు కల రసములను పులియబెట్టినపుడు తయారగుచున్నవి. విస్కీ, బ్రాంది మొదలగునవి పులియబెట్టబడిన ద్రవములు స్వేదనక్రియ వలన తయారగుచున్నవి. ద్రాక్షా రసమును స్వాభావికముగా ద్రా. చెక్కులపై నుండు ఈస్టుచేర గాని, లేక ప్రత్యేకముగా చేయబడిన వైన్ ఈస్టుచేత గాని పులియబెట్టుటవలన ద్రాక్ష సారాయి పట్టును. (Wine) తయారగును. పులియుటకు 1, 2 వారములు పట్టును. 6-12% ఆల్కహాలు పరినూణముగల గాఢత (concentration) వచ్చువరకు, పులియుట పూర్తియై పిమ్మట ఆగిపోవును. సాధారణముగా తయారుచేయు దేశములనుబట్టి ద్రాక్ష సారాయములకు పేర్లు పెట్టు చున్నారు. ఫ్రాన్సు దేశములో తయారగుదానికి ఫ్రెంచి బర్గండి అనియు, స్పెయిను దేశములో తయారగుడానికి స్పెయిన్ వైన్ అనియు, జర్మనీలో సుత్పత్తి యగుదానికి “జర్మను మోసలు" అనియు పేర్లు పెట్టిరి. బార్లి, బియ్యము మున్నగువానిని పులియబెట్టుట చే తయారగు పానీయమును బీరు అందురు. ఇందు 8.5.8% ఆల్కహాలుండును. 'హాప్ ' అను పుష్పములను సారాయిలో చేర్చుటవలన ఒక విధ మైన పరిమళమును, చిరుచేమ రుచియు కలుగుచున్నవి. తాటిచెట్టునుండి తీసిన రసమును పులియ బెట్టుటవలన తాటికల్లు ఏర్పడును. బీరునందును, తాటి కల్లునందును శరీరపోషకములైన 'బి' విటమినులు ఎక్కువగా నుండును. పులిసిన బియ్యపు గింజల ద్రవమును బట్టీ పట్టుటవలన విస్కీ అను సారాయి లభించుచున్నది. విస్కీలో 40.50% వరకు ఆల్కహాలు ఉండును. ద్రాక్ష సారామ బట్టి పట్టుటవలన బ్రాందీ తయారగును. బ్రాందీలో 42% ఆల్కహాలుండును. పులిసిన చేరకు