Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆల్కహాలు - మద్యసారము

సంగ్రహ ఆంధ్ర


మద్యసారము పైనను, ఆల్కహాలు కల మద్యపానీయముల పైనను విధించబడిన పన్ను ప్రభుత్వములకు ముఖ్యా దాయమైయున్నది. పానీయమందుండు ఆల్కహాలు శాతముపై ఆధారపడిన" ప్రూఫ్ స్పిరిట్ " (Proof Spirit) అను పరిమాణము, పన్ను విధించుటయందు సౌలభ్యమునకై ప్రవేశ పెట్టబడినది. 49.2 గ్రాములు శుద్ధ ఆల్కహాలు, 50.8 గ్రాముల నీరు కలిసిన మిశ్రమము శతఫ్రూఫ్ స్పిరిట్ (100 ఫ్రూఫ్ పరిమాణములు కలది) అని చెప్పబడుచున్నది.

తయారుచేయు విధానము : పండ్ల యొక్కయు, పుష్పముల యొక్కయు, మొక్కల యొక్కయు రసములు గాలిలో నిలువ చేసినపుడు, వాని యందుండు గ్లూకోజు, ప్రుక్టోజు అనబడు చక్కెర పదార్థములు పులిసి ఆల్కహాలు, కార్బన్ డై ఆక్సైడు, ఈ క్రింది సూత్రము ననుసరించి తయారగును.

C6 H12, 06 ~→ 2 C3, H5, OH + 2 CO2

గ్లూకోజు → ఆల్కహాలు + కార్బన్ డై ఆక్సైడ్

గాలిలోను, వృక్షోపరితలమునను విరివిగా నుండు యీస్టు (Yeast). అనబడెడి సూక్ష్మజీవులు ఈ ప్రక్రియ కాధార భూతములై యున్నవి. చక్కెర పదార్థములను ఆహారముగా ఈ సూక్ష్మజీవులు తీసికొని ఆల్కహాలు కార్బను డై ఆక్సైడులను వెలువరించును. పిండి పదార్థములను, మాల్ట్ (Malt) తో గాని, ఆమ్లములతో గాని, సెల్యులోజు కల వృక్ష సంబంధమగు పదార్థములను ఆమ్లములతో గాని హైడ్రొలైజు చేసినపుడు తయారైన చక్కెర పదార్థములను కూడా ఈ పై విధముగా పులియ బెట్టిన ఆల్కహాలు తయారగును. అమెరికా మున్నగు అభివృద్ధిపొందిన దేశములలో ఎథిలీసు నుండియు, వాటర్' గ్యాస్ (కార్బన్ మోనాక్సైడ్, హైడ్రొజనుల మిశ్రమము) నుండియు సంకలిత రాసాయనిక విధానముల వలన అధిక పరిమాణములో ఆల్కహాలు తయారు చేయబడుచున్నది.

జొన్న, గోధుమ, బార్లీ, బియ్యము మొదలగు కాయ ధాన్యములు, బంగాళాదుంపలు మున్నగునవి ఆల్క హాలును ఉత్పత్తిచేయుట కవసరమగు ముఖ్యమైన పిండి పదార్థము కల ముడి పదార్థములు. వ్యవసాయమునుండి లభించు సెల్యులోజు కల పదార్థములు, కాగితపు పరిశ్రమ యందలి వ్యర్థమగు కాగితపు ముక్కలు కూడ సారాయమును ఉత్పత్తిచేయుటకు ఉపయోగింపబడుచున్నవి.

తొలుత పిండిపదార్థములను మాల్టుచేత హైడ్రొలైజు చేయుదురు. ఎండి మొలకలెత్తిన కాయధాన్యపు గింజలను ముఖ్యముగా బార్లీ గింజలను మాల్టు అందురు. దీనిలో పిండిపదార్థములను చక్కెర పదార్థములుగా మార్చగల అమైలేసెస్ అనబడు సూక్ష్మజీవులు (ఎంజైములు) ఉండును. తర్వాత క్రింద నుదహరింపబడిన పద్ధతిని ఆల్కహాలును తయారు చేయుదురు.

సెల్యులోజుకల పదార్థములను తొలుత ఆమ్లములతో 'హైడ్రొలైజు చేసి తరువాత ఆల్కహాలు తయారు చేయుదురు. చెరకు రసమునుండి చక్కెరను స్పటికీకరించిన తర్వాత మిగిలిన మొలాసిస్ అనబడు ద్రవము ఆల్కహాలును తయారుచేయుటకు ఉపయోగపడు ముఖ్యమైన ముడిపదార్థము. ఇది పంచదార పరిశ్రమయొక్క ఉప పదార్థము. దీనిలో 50% చక్కెర పదార్థము లుండును. దీనిలోని చక్కెర పదార్థములను 10% వరకు తగ్గునట్లు నీటిని కలుపుదురు. యీస్టు అభివృద్ధిపొందుటకొరకు అమ్మోనియమ్ సల్ఫేటును, కొంచెము ఆమ్లమును, 5% ప్రత్యేకమైన యీస్టును (Saccharomyces cerrisae) కలుపుదురు. 30–50 గంటలలో పులియుటపూర్తియై 6-8% ఆల్కహాలుకల మాష్ (Mash) అనబడు ద్రవము తయారగును. ఈ ద్రవమునుండి స్వేదనక్రియచే ఆల్కహాలు విడదీయబడుచున్నది. భారతదేశమంగు ఏటేట నాలుగు లక్షల టన్నుల మోలాసిస్ ద్రవము ఉత్పత్తి యగుచున్నది. ఒక టన్ను మోలాసిస్ నుండి 60 గ్యాలనుల ఆల్కహాలును తయారుచేయ వచ్చును. 55% చక్కెర పదార్థములు కల ఎండిన ఇప్పపువ్వులు కూడా ఆల్కహాలు చేయుటకు విస్తారముగా ఉపయోగింపబడుచున్నవి.

స్వేదనక్రియ  : మద్యములను తయారుచేయుటకు చిన్న.చిన్న యంత్రశాలలలో చాలవరకు కుండలవంటి రాగి స్వేదన పాత్రలు ఉపయోగింపబడుచున్నవి. ఈ పాత్ర పై భాగమున ఒక పొడవైన ద్రవీకరణ సాధనము ఉండును. ఈ సాధనము ఒక గ్రహణపాత్రకు కలుపబడి ఉండును. స్వేదన పాత్రలో ఆల్కహాలుకల మావ్. వేడిచేయబడును. అప్పుడు పైకి లేచిన ఆల్కహాలు ఆవిరి ద్రవీకరణసాధనములో ద్రవీభవించి