Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆవనములు ఉపయోగములు : రసమును తాటి రసమును బట్టీ పట్టుటవలన రమ్, అరక్ అను బెల్లపు సారాయిలు వచ్చును. ఆల్కహాలు యొక్క గుణములు, ఆల్కహాలు కల పానీయములను త్రాగుటవలన శరీరము నకు బలకరమగు ఉల్లాసము స్వాస్థ్యము కలిగినట్లు తోచినను ఆల్కహాలు వాస్తవమునకు నాడీమండలమును బలహీన పరచును. బాధను తెలియనీయకుండ చేయుట, మత్తును కలిగించుట ఆల్కహాలు యొక్క గుణములగుటచే దానిని త్రాగిన తరువాత ఉద్రేకము, ఉల్లాసము కలిగినట్లు కనిపించును, ఆల్కహాలును 'హెచ్చు మోతాదులలో తీసికొన్నచో రక్తపు ఒత్తిడి (Blood Pressure) ను అధికముచేయును. కావున బ్రాందిని బలవర్ధకమైన ఔషధముగానే ఉపయో గీంతురు. స్వల్పముగా ఆల్కహాలు కలిగిన పానీయములను సేవించినచో అది ఆహారము జీర్ణమగుటకు తోడ్పడును. అల్కహాలు త్వరితముగా శరీరగత మగుటవలనను ఆమ్లజనీ కరణము చెందుటవలనను అధికముగా ఆహారపు విలువను కలిగియున్నది. కాని నిరంతరము దీనిని ఉపయోగించుట శరీరమునకు హానికరము. రక్తమునందు ఆల్కహాలు 0.15% వరకు చేరినపుడు నిషాచిహ్నములు కనిపించును. 0. 4% - 0. 5% వరకు చేరినపుడు మరణము సంభవించ వచ్చును. ఆసనములు : యస్.రా. రా. వూ. 5000 సం. నుంచి ఆసనములు భారత దేశ మున అభ్యసింపబడుచున్నట్లు తార్కాణములు కలవు. శాండిల్య, దర్శన, ధ్యానబిందు, మైత్రి మొదలయిన ఉపనిషత్తులలో ఆసనములను గురించి విస్తరముగా బోధింపబడెను. పూ. 4000 సం. సమయములో వర్ధిల్లిన సింధు నదీ లోయ యందలి నాగరకతను వర్ణించిన సర్ జాన్ మార్షల్ గారి అభిప్రాయము ప్రకారము అనాడు ఆసనములు ఆచరణములో నున్నట్లు తెలియుచున్నది. శ్రీమత్స్యేంద్ర నాథుడు పరమశివునివద్ద ఆసనముల వివరములను తెలిసి కొని తన శిష్యుడైన గోరక్షనాథునకు నేర్పినట్లు నాథ సంప్రదాయద్వారమున తెలియుచున్నది. క్రీ. పూ. 200 సం. ల క్రిందట పతంజలి యోగిపుంగవుడు తాను కూర్చిన 20 రుడు సంగ్రహ ఆంధ్ర n సూత్రములలో అసనముల విషయమై పేర్కొ నేను. ఎల్లోరా, అజంతా గుహలలోని కళాఖండముల ద్వారమున బౌద్ధయుగములో ఆసనములు చారములో నున్నట్లు తెలియుచున్నది. క్రీ. శ. 1212 సం. నాటివారైన జ్ఞానేశ్వ నాథ సంప్రదాయములోనివాడు. ఆయన తన భగవద్గీతాభాష్యములో ఆసనములను వివరించెను. ఆసనము లభ్యసించినవారు ఆరోగ్యసౌభాగ్యములు కల్గి వర్ధిల్లుదురు. ఆసనములను శ్రద్ధాభక్తులతో నాచరించిన యెడల శరీరము స్వాధీనములో నుండును. శరీరము స్వాధీన మైనమనస్సు స్వాధీనమగును. మనస్సు స్వాధీనమయిని మోక్షము సాధించుట సులభము. ఆసనముల సభ్యసించుట కెట్టి ఉపకరణములును అక్కరలేదు. ధనవ్యయము లేదు. ఎంకటి బీదవారైనను ఆసనముల సభ్యసించి వయస్సునకు తగిన ఆరోగ్యమును, బలమును పొందవచ్చును. 7 సం. ల మొదలు 90 సం. ల ప్రాయమువరకు పురుషులు నిరభ్యంతరముగా ఆసనముల నభ్యసించడవచ్చును. ఆసనా భ్యాసకుల యొక్క జీర్ణశక్తి వృద్ధిపొందుచు భుజించిన పదార్థములు చక్కగా జీర్ణమై బలము చేకూర్చును. నాళ ములలో రక్తము ధారాళముగా ప్రవహించును. సోమరి కనుక తనముపోయి చురుకుతన మలవడును. సకాలమునకు . మూత్రపురీషములు విసర్జింతురు. శరీరము వ్యాధి గ్రస్తముకాదు. ముదిమి త్వరగా ప్రవేశించదు. క్రమశః వార్ధక్యము ప్రాప్తించినను శరీరమనస్సుల పాటవము క్షీణించదు. ప్రపంచములో బలము సాధించుటను అనేక పద్ధతు లున్నవి. వానివలన నరములకును, కండరముల కును ఒత్తిడిగల్గి హృదయ దౌర్బల్య మేర్పడుటకు అవ కాశమున్నది. ఆసనము అభ్యసించువారల కట్టి కీడు కలు గదు. మీదు మిక్కిలి శరీరమునందుండు ఎముక లన్నియు స్నిగ్ధముగా నుండును. మెదడు, ఊపిరితిత్తులు, ప్రేగులు, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు సమపాళ్ళలో వృద్ధిపొంది బలిష్ఠము అగును. ఆసనముల సభ్యనించువారు మిత, సాత్త్విక, శాకాహారులుగా నుండవలెను. పాశ్చ్యా దేశములలో పెక్కుమంది శాస్త్రవేత్తలు, గృహిణులు, నర్తకులు మన ఆసనాభ్యాసముచే ఆకర్షింపబడి దానిని అనుష్ఠించుచున్నట్లు సచిత్ర వార, మాస పత్రికల ద్వార మున విదితము.