పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కొండవీడు సంగ్రహ ఆంధ్ర


ప్రభుత్వము ఏర్పడిన తరువాత అప్పటి పాలకులు తమ తమ పేర్లతో పేటలను కట్టించిరి. ఉదా : మహమ్మద్ షా పురము (కుతుబ్ షా పేట), నవాబ్ పేట, ముర్తజా నగర్ (గోపీనాథ పురము) మొదలగునవి. - పూర్వము కొండవీటికి కుండిననగరము అని పేరుండె ననియు, అది విదర్భ దేశమునకు ముఖ్యపట్టణముగా నుండె ననియు, ఇచటనే దమయంతి, రుక్మిణి జన్మించి రనియు, ఇప్పటి అమీనాబాదువద్ద గల కొండపై నున్న 'ముల్ల గూరమ్మ' యే రుక్మిణి పూజించిన పార్వతి యనియు, ఇచటివారు చెప్పుదురు. ఇదియే కుండిననగర మని 'దండకవిలె' యందు గూడ వ్రాయబడి యున్నది. దండకవిలె యందలి వ్రాతలను ఈ క్రింది శాసనములు సమర్థించుచున్నవి : 1. మంచాళ్ళ శాసనము : "శా. శ. ౧౨౬౨ (1262) విక్రమ సం. మార్గశిర శు. ౧౫ లు సోమవారమునందు వల్ల భశిష్ట నామధేయ ద్విజాయ కుండిన నామ నగర ప్రాద్దిగ్భాగే, భద్రానది పశ్చిమ తీరప్రాంత దేశ శ్రీకృష్ణానదీ పశ్చిమయామ్య దిక్సంధిస్థ జనపదేషు ప్రసిద్ధ మంచాళ్ళగ్రామ మతి ముఖ్యాగ్రహార దానం కర్తు మిచ్ఛన్" అని గలదు. 2. కొండవీటి గోపీనాథుని గుడివెనుక (పడమట) రెండవ ఆలయ స్తంభమున గల శాశ. ౧౩౨ విభవ సంవత్సర మాఘ శుద్ధ ౧౨ శాసనమున ఇట్లున్నది: "శ్రీ రామేశ్వరాయ నమః కుండిననామ ప్రసిద్ధేషుభవతి విభవ వత్సరే మాఘ శుద్ధ ద్వాదశ్యాం, జీవవాస రే సవితరి మకర సాహిని లగ్నే సిద్ధ శ్రీనామ భక్త్యా జగతి రఘునాధ్యా శ్రీమాఖ్యా పహ్యకల్పం కొండవీట్యామ దగిరి కృతవా నామ లింగ ప్రతిష్ఠా. ' 99 3. దండెకవిలెలోని రెడ్డిదత్త అగ్రహారములను గుఱిం చిన శోకములలో : తస్యపాద భవేద్రస్య కుండినజోణి శాసితః వేమాఖ్యశ్చతురః పుత్రాః నిత్యధర్మ పరాయణాః: కొండవీటి దండెకవిలెను బట్టి, కొండవీడు అనాదిగ భీమరాజు, భీష్మకుడు మొదలగువారి కాలములనుండి రాచనివాసమై యుండెననియు, గజపతివంశ క్షత్రియు డగు 'విశ్వంభర దేవుడు' అచట కోటలు కట్టించెననియు

తెలియుచున్నది. ఏదిఎటులున్నను, కొండవీడు రెడ్డి రాజుల నాటినుండియు రాజధానిగా నుండెననుటకు సందియము లేదు. ప్రోలయవేముని రాజధాని అద్దంకి యని బహు శాసన ములు వాకొనుచున్నవి. ప్రోలయవేముని తరువాత అతని కుమారుడగు అనపోతా రెడ్డి తన రాజధానిని అద్దంకి నుండి కొండవీటికి మార్పించినటులు శాసనములవలన తెలియు చున్నది. కొండవీటి రాష్ట్రము కృష్ణా, గోదావరి, గుంటూరు, నెల్లూరు, కర్నూలు మండలములకు వ్యాప్తమై యున్నట్లు రెడ్డి రాజులనాటి శాసనములవలన, బిరుదముల వలన తెలియుచున్నది. ఈ కొండవీడు రాజ్యము క్రింద వివరించిన పెక్కు మంది రాజుల పరిపాలనము క్రిందకు మారుచు వచ్చినది : ప్రోలయ వేమా రెడ్డి అనపోతా రెడ్డి అన వేమా రెడ్డి కొనురగిరి రెడ్డి పెదకోమటి వేమా రెడ్డి రాచ వేమా రెడ్డి కటకపురాధీశ్వరుల పాలన కర్ణాటక సామ్రాజ్యాధిపతులు కటకపురాధీశ్వరుల కాలము కర్ణాటక సామ్రాజ్యకాలము గోల్కొండవారు కొండవీటిని 1530లో జయించిరి. మరల కర్ణాట సామ్రాజ్యాధిపతులు 1530లో దీనిని జయించి 1579 వరకు తమ ఏలుబడిలో నుంచుకొనిరి. 1326-1350 1350-1370 1370 1385 1385-1407 1407-1420 చారాముత్సబీల ఏలుబడి గోల్కొండ నవాబు పరిపాలన ఫ్రెంచి పరిపాలన కాలము గోల్కొండ నవాబుల కాలము ఇంగ్లీషువారి పరిపాలన కాలము స్వతంత్ర భారత పరిపా లన ము 1420 1423 1423-1431 ad 1431-1454 1455-1496 1515-1530 తిరిగి ఈ కొండవీటి రాజ్యము 1579 లో గోల్కొండ రాజుల ఆక్రమణము క్రిందకు వచ్చెను. అనంతరము ఈ సామ్రాజ్యము ఈ క్రింది విధముగా మరల చేతులు మారెను : 1582-1590 1599-1749 1750-1757 1758-1786 1788-1947 1947 54