పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము - 3 కొండవీడు


కొండవీటిని పాలించిన ఆంధ్ర సామ్రాజ్యాధి పతు లలో చరిత్ర కందిన తొలి ప్రభువు ప్రోలయ వేముడు. వేదాధ్యయన సంపన్నులైన బ్రాహ్మణోత్తములతోను, పట్ఛాస్త్రవిదు లైన పండితసత్తములతోను, ఎఱ్ఱాప్రగడ మొదలగు గీర్వాణాంధ్ర భాషా ప్రవీణు లగు కవిపుంగవుల తోను అనాటి రాజధాని ఒప్పారుచుండెను. రాజ్యనిర్వహణమున అనపోతారెడ్డికి రాజనీతికోవి రులు, ప్రచండ సేనానులు తోడ్పాటు కావించిరి. సముద్ర వ్యాపారము విరివిగా జరుగుచుండెను. అనపోతా రెడ్డి దుర్గమునకు బలమైన ప్రాకారము నిర్మించెను. అనవేముని కాలమున కొండవీటినగరమున ధనధాన్య ములును, పాడిపంటలును హెచ్చెను. విదేశ బేహారము వలన ధనకనక వస్తు వాహన మాణిక్యములతో బొకసము సర్వసమృద్ధమయ్యెను. కస్తూరి, కుంకుమ ఘనసారసంకు మద హిమాంబు కాలాగరు గంధసారాది సుగంధ ద్రవ్య ములతో కొండవీడు ఘుమఘుమ లాడుచుండెను. రాజును 'వసంత రాయ'డని ప్రజలు పిలుచుచుండిరి. కొండవీడు వసంతోత్సవములకు రాజధాని. నానా దేశములనుండి రసికులు వసంతోత్సవమును వీక్షించుటకు వచ్చెడివారు. గొప్ప విద్వాంసు డగు బాల సరస్వతి విద్యాధి కారిగను, శారదా వల్లభుడను త్రిలోచనాచార్యుడు ఆస్థాన పండి తుడుగను ఉండిరి. కొమరగిరి రెడ్డికాలమున కొండవీడు మూడు పూవులు ఆరు కాయలు కాచినదని చెప్పవచ్చును. నౌకా వ్యాపారమున దిట్టయగు అవచ్చి తిప్పయ శెట్టి కొండ వీటిని సుగంధద్రవ్యములలో ముంచి తేల్చు చుండెను. ఆనాడు కొండవీడు నౌకా వ్యాపారస్థులకు ఆటపట్టు. కాటయ వేమా రెడ్డి కొండవీటికి పెట్టని కోటగా నుండెను. పెదకోమటి వేముని కాలము కొండవీటికి స్వర్ణయుగము. వామనభట్టబాణుడు, కవిసార్వభౌము డగు శ్రీనాథుడు మొదలగు విద్వత్కవులతోను, మామిడి సింగనా మాత్యుడు, వేమనామాత్యుడు, వేమనామాత్యుడు, ప్రగడామాత్యుడు మొదలగు అమాత్య శేఖరులతోను, సరససంగీత సాహిత్య గోష్ఠి వినోద ప్రసంగములతోను, కొండవీడు కళకళ లాడు చుండెను. కొండవీడును శ్రీనాథ కవిసార్వ భౌముడు ఈ క్రింది విధముగా వర్ణించెను.

సీ. పరరాజ పరదుర్గ పరవై భవ శ్రీల

గొనకొని విడనాడు కొండవీడు పరిపంధి రాజన్య బలముల బంధించు గురుతై న యురిత్రాడు కొండవీడు ముగురు రాజులకును మోహంబు బుట్టించు కొమరు మీరిన వీడు కొండవీడు చటుల విక్రమకళా సాహసం బొనరించు కుటిలాత్ములకు సూడు కొండవీడు తే. సాధు సైంధవ భామినీ సరసవీర భటరటానేక హాటక ప్రకట గంథ సింధురాద్భుత మోహన శ్రీలదనరు కూర్మి నమరావతికి జోడు కొండవీడు. శాసనములవలన 1515 జూను 23వ తేదీన కొండవీడు శ్రీకృష్ణ దేవరాయలచే జయింపబడినట్లు తెలియుచున్నది. సాళువ తిమ్మరుసుమంత్రి మేనల్లుడగు నా దెండ్ల గోపయ మంత్రి 1515 నుండి 1538 వరకు కొండవీటి పాలకుడుగా నుండెను. ఇతడు ఒక వైష్ణవాలయమును కట్టించి అందు సపరివార పట్టాభిరామ విగ్రహములను ప్రతిష్ఠించెను. రాయల అనంతరము అచ్యుతరాయల పరిపాలనములో రాయసం అయ్యపరుసయ్య, రామయ భాస్కరయ్య, బయకార రామప్పయ్య అనువారలు వరుసగా కొండ వీటికి పాలకులైరి. రామయ భాస్కరయ్య కొండక్రింద ఒక రాతికోటను కట్టించి, దానియందు గోపీనాథపుర మను పేర నొక పేటను కట్టించి, అందు గోపీనాథ స్వామి ఆలయమునుగూడ నిర్మించెను. రామయ మంత్రి 'కత్తుల బావి కథ' ఈనాటివరకు ప్రజలలో కథగానే మిగిలి పోయినది. దీనిని చరిత్రకారులు నమ్ముట లేదు. సదాశివరాయల అనంతరము కొండవీడు తురుష్కుల వశమయ్యెను. మురజాఖాను అనువాడు కొండవీటి పాలకు డయ్యెను. ఆత డచ్చట దేవాలయములను ధ్వంసము గావించి, విగ్రహములను ఛిన్నాభిన్నము చేసి, గోపీనాథపురమునకు 'ము ర్తజానగరము' అని పేరిడెను. ఇదియే ఆంధ్రదేశము గోల్కొండ రాజ్యమున కలిసిన కాలము. ఇంగ్లీషువారు నిజాముతో సంధి చేసికొని తీసి కొనువరకు ఆంధ్రదేశము గోల్కొండ రాజ్యపాలనము క్రింద నే యుండెను.