పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము - 3 కొండవీడు


రావు వధింపబడగా, అతని స్త్రీలు సహగమనము చేసి మానమును కాపాడుకొనిన గుండములట ఇవి! ఈ గుండ ములకు దక్షిణమున రెడ్డి రాజుల గృహములు లుండెనని చెప్పుదురు. 'గృహరాజ మేడ' దిబ్బల యొద్ద జడ్డిగల బావి యొకటి కలదు. ఇది 'గృహారాజ మేడ' యందు ప్రతిష్ఠింపబడిన శ్రీ ఆదిలక్ష్మి కామేశ్వరి అమ్మవారి జల క్రీడార్థము నిర్మింపబడినదని తెలియుచున్నది. దీనికి దక్షిణమున కొండ అడుగు భాగము నంటి ఒక చెరువు గలదు. దీనిలోతట్టు కొండల మధ్య భాగమున పెదదాసర య్య', 'చినదాసరయ్య' అను వారలు రెండు తోటలు నాటించిరి. కొండల క్రింది భాగమున 'తిరుమల లక్ష్మీనృసింహస్వామి' గుడియు, దీనికి పశ్చిమమున శ్రీ రామేశ్వరస్వామి గుడియు కలవు. ఇందలి శాసనము వలన ఈ రామేశ్వరస్వామి గుడిని కొలచలమల అచ్చన్న ప్రతిష్ఠించారని తెలియుచున్నది. దీనికి పడమట 'సీతాపతి' యను రాతి తూము గల చెరువొకటి కలదు. ఇప్పటి కొండవీటికి ఉత్తర భాగమున శ్రీ వీరభద్రా లయమును, దీనికి ఉత్తరమున 'బొదిలెరహణా సాహెబు దరగా' యను మూడు గోరీ మండపములును గలవు. వీటికి ఉత్తరమున 'ఫ త్తేఖాను మసీదు'ను, 'భోజరా' ఆను అత్తారు చౌదరీ మసీదును, దీనికి దాపున 'సురు ఖానా' అను మసీదును, దీనికి దక్షిణమున 'నల్లమసీదును దీనికి పడమరగా 'గుమ్మల్ మసీదు', 'జమతానా మసీదు' లును గలవు. వీటికి దక్షిణమున 'చిన్న మసీదు'ను రెండు దరగాలును కలవు. ఇప్పటి కొండవీటికి దక్షిణమున రెండు మైళ్ళ దూర ములో “శిఖవస్ ఖాను పేట" (శింగిస్కాను పేట) యను గ్రామము కలదు. ఇందు వెన్నముద్ద కృష్ణస్వామి గుడి కలదు. ఇందు గల కృష్ణ విగ్రహము పూర్వము కొండ వీటి రాజులచే ప్రతిష్ఠింపబడినది. కాలక్రమమున గుడి శిథిలము కాగా, కృష్ణ విగ్రహము మట్టిలో పూడిపోయి వది. ఇప్పటికి దాదాపు 100 సంవత్సరముల క్రిందట గోపీ వాథపురముదగ్గర త్రవ్వుచుండగా, ఈ విగ్రహము బయట పడినది. దానిని చిలకలూరి పేటలో ప్రతిష్ఠించుటకు తీసి కొనిపోవుచుండగా, శింగిస్కాను పేటకు చేరగానే బండి విరిగిపోయినది. ఆ రాత్రి కలలో వారలకు స్వామి దర్శన

మిచ్చి తా నందే యుండెదనని చెప్పగా, వారు ఆయనకు అచ్చటనే గుడి కట్టించి, పూజా పురస్కారములకొరకు పెక్కు భూదానములు చేసిరట. ఎన్ని యో ఆలయములు శిథిలములై రూపుమాసిపోయినవి. సుందర లతాపుష్ప చిత్రితములగు రాళ్ళు పెక్కులు అన్యగ్రామములకు కొంపోబడినవి. కొండపై ఎటు చూచినను గొప్ప కోటగోడలు శిథిల ములై కన్పించుచుండును. కొండవీటి దండకవిలెయందు ప్రప్రథమున 800 సంవత్సరముల క్రిందట “విశ్వంభర దేవుడ" ను రాజు కట్టించెనని కలదు. కొండపై ఉత్తర దిశయందు ఒక చోట ఐదు కోటలు కలిసియున్నవి. ఈ కోటలకు పెక్కు రహస్య ద్వారములు కలవు. క్రింది నుండి ఈ కోటలగుండా పైకి పోవు మార్గమున "ఖిల్లే దర్వాజా" యను మందిర మొకటి కలదు. కొండక్రింద పడమటి దిశగా ఒకటిన్నర మైలు చుట్టు కొలత గల ఒక కోట కలదు. దీని చుట్టు 50 గజముల వెడల్పు 10 గజముల లోతు గల అగడ్తయు, కోటకు నాలుగు కోణములయందు, మధ్య మధ్య బురుజులును గలవు. ఈ కోటను రామయ భాస్కరుడు కట్టించే ననియు, అందొక పురమును, గోపీనాథుని గుడిని నిర్మించి, ఆ పురమునకు గోపీనాథపుర మను పేరు పెట్టె ననియు చెప్పుదురు. దీనికి ఉత్తర భాగమున నున్న సింహద్వారము చెడక, ఇప్పటికిని కన్పించుచున్నది. దీనికి పడమర భాగమున ఒక రాతిమీద రామయ భాస్కరుని గూర్చిన పద్య మొకటి కలదు. ఈ గవనుకు కొండపల్లి గవను అని పేరు. దక్షిణ ద్వారము శిథిల మైనది. దీనికి నా దెండ్ల గవను అని పేరు. కొండకు ఉత్తర దిశలో కొండల మధ్యభాగమునందు పుట్టకోట గలదు. దీనిని ప్రోలయ వేమా రెడ్డి కట్టించెను. కొండపై నుండు బురు జులు శిథిలము లై నవి. బురుజుల సంఖ్య దాదాపు 23 వరకు ఉండును.

కొండవీటిపురము రమారమి 4, 5 మైళ్ళ వైశ్యాల మును, ఏడు వాడలును కలదై యుండినట్లు తెలియు చున్నది. శాసనములనుబట్టి కొండవీటి రాష్ట్రము 24 దుర్గ ములను, పదునాలుగు సీమలను, 2048 గ్రామములను కలిగి యున్నట్లు గూడ తెలియుచున్నది. మహమ్మదీయ 53.