Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/823

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము = 3

వదలుకొని బ్రిటిషువారు షాంఘైకి మరలిరి. చైనా భూభాగమునుండి పాశ్చాత్య సామ్రాజ్యవాదులు తర లుట కిదియే నాంది ! సన్

క్యూమిన్ టాంగ్ లో చీలికలు, కమ్యూనిస్టులు : యట్ నేను మరణించి నప్పటినుండియు, కూమిన్ టాంగ్ లో చీలికలు ప్రారంభమైనవి. ధనిక భూస్వామ్య వర్గములు ప్రజాస్వామ్యమును ప్రతిఘటింప పూనుకొనిరి. వీరికి సైనిక ప్రభువులు, విదేశ సామ్రాజ్యవాదులు మద్దత్తు నిచ్చిరి. మరొక వై పున కమ్యూనిస్టులు సమ్మెలను, విదేశ వస్తుబహిష్కరణమును ప్రోత్సహించుచుండిరి. 1925 లో కాన్ టన్, షాంఘైలలో కార్మికులు సమ్మె జరిపిరి. ఆంగ్ల సైనికులు సమ్మెదార్లపై కాల్పులు జరిపిరి. కమ్యూనిస్టు విధానము చైనా సమైక్యమునకు భంగము కలిగించు నను భయముతో చియాంగ్ ధనికవర్గము వైపునకు మ్రొగ్గెను. చివర కతడు, ఏప్రెల్ 1927 లో హాంగ్ కాంగ్ ప్రభుత్వమునకు పోటీగా నాన్ కింగ్ జాతీయ లో ప్రభుత్వమును స్థాపించి కమ్యూనిస్టుల నణచసా గెను. స్థానిక ధనికవర్గము, విదేశ వర్తకులు చియాంగ్ ప్రభుత్వ మునకు ధనసహాయ మొసగిరి. ఆగస్టు 1927 లో సమ్మెను చియాంగ్ అతి దారుణ ముగ షాంఘైలో జరిగిన అణచివేసెను.

ఈ సమయమున కమ్యూనిస్టు ఉద్యమములో చీలిక లేర్పడినవి. 1924 లో రష్యా నియంత యైన స్టాలిన్, చైనాలో గూడ సత్వరము కమ్యూనిస్టు విప్లవమును సాధించు నాశయముతో బోరోడిన్కు సహాయముగ, ప్రముఖ భారతీయ విప్లవకారుడైన యం.యన్. రాయ్న కై నాకు పంపెను. అంతకుపూర్వమే చైనాలో కమ్యూ నిస్టు విధానమును గూర్చి రాయ్ చేసిన సూచనలను లెనిన, అంతర్జాతీయ కమ్యూనిస్టు సంఘమువారును, ఆమోదించియుండిరి. కాని చై నాలో బొరొడిన్, రాయ్లా మధ్య అభిప్రాయభేద మేర్పడెను. కూమిన్ టాంగ్ తో సర్వదా సహక రింపవ లెనని బొరొడిన్ నిర్ణయము. కూమిన్ టాంగ్ ప్రతీపగామిశ క్తుల అదుపులో నుండుటచేత దాని ద్వారా సామ్యవాద మేర్పడుట అసంభవము కావున, రైతు కూలీ వర్గములలో విప్లవాత్మక చైతన్యమును ప్రబోధించి, వారి నాయకత్వమున, రష్యా సహాయముతో 755 చైనాదేశము (చ) సామ్యవాదమును స్థాపించుట రాయ్ కార్యవిధానము. కాని, నాడు చైనా అతివాద వర్గ నాయకులు సామ్య వాదము నాదరించినను, వారిలో జాతీయ భావము, సామ్రాజ్యవాద వ్యతిరేకత బలముగా నుండెను. అందుచే, సామ్యవాద స్థాపనతో తమ దేశమున రష్యా ఆధిపత్యము నెలకొన గలదని వారు భయ పడిగి. ఈ కారణమున వాంగ్ చింగ్ పై కమ్యూనిష్టు ఉద్యమమునకు విద్రోహియై అధికారమును చియాంగ్ పరమొనర్చి దేశమును విడిచి పారిపోయెను. (17_12-1927). చియాంగ్ సర్వాధి కారియై దౌర్జన్యముగ కమ్యూనిస్టులు నణచి వే సెను. రాయ్, బొరొడిన్ మున్నగువారు చైనా నుండి బహిష్క రింప బడిరి. ప్రజావి ప్లవ మడుగంటెను.

పీపింగ్ ఆక్రమణ 1928: మే 1928 నాటికి చియాంగ్ సేనలు పీపింగ్ నగరమును ముట్టడించెను ; చాంగ్ సోలిన్ మంచూరియాకు పారిపోయెను. పీపింగ్ చియాంగ్ వళ మైనది; దానికి పీకింగ్ (ఉత్తరశాంతి) అని పేరు పెట్ట బడెను. కొలదికాలములో మంచూరియా, తూర్పుమంగో లియాలు కూడ చియాంగ్ స్వాధీనమైనవి ; చైనా సమైక్యము పూర్తి యైనది. బ్రిటన్, అమెరికా, ఫ్రాన్సు, జపానులు చైనాను గుర్తించినవి.

చియాంగ్ కేషేక్ అక్టోబరు 1928 లో కూమిన్ టాం గ్ ను సమావేశపరచి క్రొత్త రాజ్యాంగమును తయారు చేయించెను. దాని ప్రకార మేర్పడిన ప్రభుత్వము పేరు నకు మాత్రమే ప్రజాస్వామ్యము; వాస్తవమున కది సైనిక, ధనిక వర్గముల నియంతృత్వము. చైనాలో రై తు కార్మిక ఉద్యమములు పూర్తిగా అణచి వేయబడినవి. ముఖ్యముగ ఉత్తర రాష్ట్రములలో సైనిక పాలన సాగి నది. 1932 లో జరిగిన ఎన్నికలలో లిన్షెన్ అధ్యక్షుడు గాను, వాంగ్ చింగ్ పై ప్రధానిగాను, చియాంగ్ సేనాని గాను ఎన్నికై రి.

అంతర్యుద్ధము, 1927_1949: వాంగ్ చింగ్ యొక్క విద్రోహచర్య వలన చైనా కమ్యూనిస్టు ఉద్యమము 1927 లో భగ్నమైనది. నాటి వరకును, చైనా కమ్యూనిస్టు లకు సరియైన నాయకత్వము కూడ లేదు. వారు తమ దృష్టిని పాశ్చాత్య సామ్రాజ్య వాదులపై కేంద్రీకరించిరే గాని ప్రజలను సాంఘిక విప్లవమునకై తర్ఫీదు చేయ లేదు.