Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/824

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

చైనాదేశము (చ)

క్రమముగా, మావ్ టుంగ్, చౌ-ఎన్-లై, చూపే, సే యేటింగ్ మున్నగువారు కమ్యూనిస్టులకు నాయకత్వము వహించి, చియాంగ్ దౌర్జన్యములను ప్రతిఘటించుటకు నిశ్చయించిరి. వీరు కియాంగ్సే, హూనాన్ రాష్ట్రముల సరిహద్దులలో నున్న చింగ్ కాంగ్ షాన్ పర్వతశ్రేణులలో స్థావరములేర్పరచుకొని, ఫూకిన్, హునాన్, హు పే, క్వాంగ్సీ, షెన్సీ రాష్ట్రములలో బలపడిరి. గొరిల్లా యుద్ధ పద్ధతులలో శిక్షణ పొందిన 60,000 సైనికులతో చైనా రెడ్ ఆర్మీ (Red Army) తయారైనది. దేశ ఐక్యము నశించి, అంతర్యుద్ధ మారంభ మైనది.

కమ్యూనిస్టుల నడచుటకై, చియాంగ్ మూడు మార్లు (1980-1981) ప్రయత్నించెను. మావ్సే టుంగ్ నాయక త్వమున కమ్యూనిస్టు లాదండయాత్రలను విఫలమొనర్చిరి. చివరకు 1984 లో కియాంగ్సీ రాష్ట్రమును వీడి, కమ్యూ నిస్టులు, ఉత్తర చైనాలోనున్న షెన్సీ రాష్ట్రమును చేరి స్థావరము లేర్పరచుకొనిరి. మార్గ మధ్యమున వేలకొలది రై తులు కమ్యూనిస్టులతో చేరి వారికి మరింత బలము చేకూర్చిరి.

జపాను దండయాత్ర: మంచూరియాను ఆక్రమించు టకు, చైనా అంతర్యుద్ధము కంటె మంచి అవకాశము లేదని భావించి 1931 లో జపాను చైనాపై దండెత్తెను. అచిరకాలములో మంచూరియా జపాను హ స్తగతమై నది. మంచూరియాకు "మంచుకో" అని పేరు పెట్టి, పదభ్రష్టుడైన మంచూ చక్రవర్తి “పూయీ"ని జపాను వారు మంచూకో సింహాసన మెక్కించిరి. జీహాల్, షాం మైలు కూడా జపాను వశమయ్యెను.

కమ్యూనిస్టులతో పోరాటములో మునిగి యున్న చియాంగ్, జపాను దండయాత్రలను ప్రతిఘటించుటకు బదులు, 1933 లో 'టాంగ్ క్కు' ఒడంబడిక చేసికొని జపాను వారి ఆక్రమణలను గుర్తించెను. దేశద్రోహక ర మైన చియాంగ్ విధానమును మధ్యతరగతి ప్రజలు, విద్యా ర్థులు గర్హించిరి.

చియాంగ్ పలుకుబడి నశించుట కమ్యూనిస్టులకు మంచి అవకాశమైనది. అంతర్యుద్ధమును మాని సమైక్య ముగా జపానును ప్రతిఘటింప వలెనని కమ్యూనిస్టులు మొదటి నుండియు వాదించిరి. కాని చియాంగ్ తో పోరా 756 సంగ్రహ ఆంధ్ర టమును మాత్రము కమ్యూనిస్టులు మానలేదు. ఈ పరి ణామములను చై నాలోని జాతీయవాదులు, దేశభ క్తులు గర్హించిరి. చివరకు, 1936 లో కమ్యూనిస్టులపై దండె తిన చాంగ్ సూలియాంగ్ అను కూమిన్ టాంగ్ నేనాని చియాంగ్ కే షేక్ ను సియాన్ అనుచోట నిర్బంధించి, అంతర్యుద్ధము నాపి, జపాను వారిపై బలమును కేంద్రీక రింప వలసినదిగా ఆతనిని కోరెను. చియాంగ్ అంగీక రించెను. కూమిన్ టాంగ్-కమ్యూనిస్టు సంయుక్త సైన్య మేర్పాటు చేయబడెను. చైనా ప్రయత్నము లిట్లుండగా 1937 లో జపాను విజృంభించి పీకింగ్, టీన్ట్సిన్ (జులై), షాంఘై (నవం బరు). నాని కింగ్ (డిసెంబరు) నగరములను సులభముగ నాక్రమించెను. చియాంగ్ తన రాజధానిని హాంకా నగరమునకును, తరువాత జెకువాన్ రాష్ట్రములోని చుంగ్ కియాంగ్ నగరమునకును మార్చెను. జయించిన చైనా భూభాగమునకు నాన్కింగ్ రాజధా నిగా, జపానువారు వాంగ్ చింగ్ ్వని పరిపాలకుడుగా నియమించిరి. సన్యట్ సేన్ శిష్యులలో అగ్రగణ్యుడైన వాంగ్ చింగ్ పై దేశభక్తి తుదకు అధికారవ్యామోహ ముగా, అవకాశవాదముగా పరిణమించినది! తాము రెండవ ప్రపంచ యుద్ధము: సెప్టెంబర్ 1939 లో రెండవ ప్రపంచ యుద్ధ మారంభమైనది. జర్మనీ, ఇటలీలు అక్ష రాజ్యములను (Axis Powers) పేర నొక పక్షముగను, మిత్రమండలి యైన బ్రిటను, ఫ్రాన్సు లొక పక్షముగను పోరాడిరి. జపాను అక్షరాజ్య కూటమి లోనిది. జర్మనీ, జపానులతో సోవియట్ రష్యా సంధిచేసికొని మైత్రి వహించి యుండెను. అందుచేత 1939-41 మధ్య చైనా కమ్యూనిస్టులు జపానుతో పోరాడుటకు బదులు కూమిన్ టాంగ్ సేనలతో తలపడి తమ ప్రాబల్యమును పెంపుచేసి కొనిరి, జపాను ఆక్రమిత ప్రాంతములలో కూడ ప్రవేశించి రహస్యముగ గొరిల్లా దళములను తయారుచేసిరి. 1941 జూన్ నెలలో జర్మనీ రష్యాపై దండెత్తెను. డిసెంబరులో అమెరికా నౌకాశ్రయమైన పెరల్ హార్బరుపై, జపాను ఆకస్మిక విమానదాడి చేసెను. ఇంతటితో యుద్ధ స్వభా వము మారినది. రష్యా, అమెరికాలు మిత్రమండలితో చేరి అక్షరాజ్య కూటమితో అన్ని రంగము లందును యుద్ధము