Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/809

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము = a 745 చైనాదేశము (చ)

ననుసరించి, హొయాంగ్ హో నదీలోయలో 50,000 సంవత్సరములకు పూర్వమే మానవుడు నివసించినాడు. పీకింగ్, చౌకుటీన్ చెంతను, యాంగ్సీ నదీలోయలో వాన్ సీన్ ప్రాంతమునను క్రీ.పూ. 5000 సం. లకు చెందిన ప్రాత రాతి యుగ శిథిలములు బయల్పడినవి. వీనికిని, ఇండియా వాయవ్య సరిహద్దులలో దొరికిన సోనులోయ నాగరికతా శిథిలములకును పోలికలు గలవు. జీహాల్, దిన్ హిసీ, ఉలన్ హోట మొదలైన తావులు చై నాలోని నవ శిలాయుగ కేంద్రములు. ఈ యుగము నందే చైనాలో వ్యవసాయ మారంభమయినది. ఎద్దు, గుఱ్ఱము మచ్చిక చేయ బడెను ఐరోపాలోని నార్డిక్ ఐరోపాలోని నార్డిక్ జాతులకు పూర్వమే మంగోలియా ప్రజలు గుఱ్ఱమును మచ్చిక చేసిరి.

పౌరాణిక యుగము, ప్రాచీన చరిత్రలు: చైనాలో పౌరాణిక యుగము క్రీ. పూ. 3000 సంవత్సరముల ప్రాంతమున ప్రారంభ మైనది. నాటి చరిత్రను తెలిసికొను టకు కొన్ని ప్రాచీన గ్రంథములు లభించినవి. వానిలో "చుషు చినీన్" (Annals of the Bamboo Books) ప్రధానమైనది. ఇది క్రీ. పూ. 300 సమీపమున వ్రాయ బడెను. క్రీ. శ. 280 లో ఒక సమాధిలో ఈ గ్రంథము లభించెనని చెప్పుదురు. దీని తరువాత పేర్కొన దగినది 'ఫాన్కు' ర చితమైన “చీన హాను" అను గ్రంథము. క్రీ. పూ. 1500 సం. లకు చెందిన దివ్య సందేశములు (Oracles) గల ఎముకలు గూడ చైనా పౌరాణిక యుగ చరిత్రకు ఆధారములు.

పౌరాణిక రాజవంశములు, సంస్కృతి: 'హిసియా' వంశ స్థాపకుడైన 'ఫాన్కు' అను నాతడు చైనా నేలిన మొదటి చక్రవర్తి యని తెలియుచున్నది. హిసియాలే చైనాలో నాగరికతను ప్రవేశ పెట్టిరి. నిప్పు, వ్యవసాయ ములేగాక, లిపి, వాద్య సంగీతములుకూడ వాడుక లోనికి వచ్చెను. వివాహ సంబంధములు క్రమబద్ధ మొనర్ప బడెను. హుయాంగ్ టి చక్రవర్తి పట్టమహిషి పట్టు వస్త్రములను సృష్టించెనట ! హిసియాల అనంతరము షాంగ్ వంశము క్రీ. పూ. (1523 - 1027) వారు పరి పాలనచేసిరి. వీరి రాజధాని అన్యాంగు అనునది.

1928 లో జరిగిన పురావస్తు ఖననములో ప్రాచీన అన్యాంగు నగర శిథిలములు బయల్పడినవి. మట్టి పునాదులపై దారు స్తంభములు నిల్పి, నిర్మించిన భవనములు నాటి ప్రజల వాస్తు విజ్ఞానమునకు నిదర్శనములు. ఒక మహా భవనము నందలి హాలు పొడవు 180 అడుగులు; వెడల్పు 30 అడుగులు. చక్కని పనితనము కలిగి, రంగు పూతలుగల కంచు పాత్రలు ఈ శిథిలములలో దొరకినవి. ప్రజలు గుఱ్ఱములు పూన్చిన రథములను, చంద్రకళలు ఆధారముగా తయారైన పంచాంగమును వాడిరి. పితృ దేవతలను, ప్రకృతి శక్తులను ఆరాధించిరి. ఆకాశము, దిశలు, నదులు, వాయువు, వారి దేవతలు. దేవతల తృప్తికై నరబలి కూడ అర్పించిరి. దివ్యవాణి యందును, ఆత్మ, పునర్జన్మలందును వారికి నమ్మక ముండెను. రాజుతో బాటు ఆతని బానిసలను కూడ సమాధి చేయుచుండిరి. ప్రాచీన యుగము : (క్రీ. పూ. 1027- క్రీ.శ.618).

ప్రాచీన రాజవంశములు : షాంగ్ వంశమును నిర్మూ లించిన చౌ వంశీయులు క్రీ.పూ. 1027 నుండి క్రీ.పూ. 256 వరకును చైనాను పరిపాలించిరి. వీరికి కొంతకాలము చావోకి నగరము (క్రీ.పూ. 1027771), తరువాత లోయాంగ్ నగరము రాజధానులై నవి. చౌ రాజులు దుర్బలు లైనందున చైనా అంతర్యుద్ధములకును, విదేశ దండయాత్రలకును గురియైనది. ఈ అరాజకతను తుదముట్టించి, చిన్ వంశస్థుడైన షిహు యాంగ్ టి అనునాతడు చైనా నుద్ధరించెను. (క్రీ. పూ. 221 - 207). చిన్న చిన్న రాజ్యములను జయించి, ఇతడు ప్రథమ చై నా సామ్రాజ్యమును స్థాపించెను. చైనా పై బడుచున్న హూణుల దౌర్జన్యముల నరికట్టు టకై ఉత్తర సరిహద్దులలో గొప్ప కోటగోడను ఇతడు నిర్మించెను. దీని పొడవు 1800 మైళ్లు; ఎత్తు 22 అడుగులు; మంద ము 20 అడుగులు. ఈ గోడకు నూరు గజముల కొకటి చొప్పున 31680 బురుజులు కలవు. ఒక్కొక్క బురుజు ఎత్తు 40 అడుగులు. ఈ గోడ ప్రపంచమందలి వింతలలో నొకటిగా ప్రసిద్ధి చెందినది. షిహుయాంగ్ టి, చైనాలో భూస్వామ్యమును రద్దు పరచి రాజ నిరంకుశత్వమును నెలకొల్పెను. నిరంకుశత్వ మును సుస్థిర మొనర్చుటకై 'లిన్సు' అను మంత్రి సలహాపై ప్రాచీన గ్రంథములను పరశురామప్రీతి చేసి, కవులను