Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/808

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

చైనాదేశము (చ) సంగ్రహ ఆంధ్ర

యాంగ్, టిబెట్ పై గూడ చైనా అధికారము విస్తరించి నది. ఈ ప్రాంతముల జాతు లన్నియు కలిసి చైనా ప్రజలైరి. చైనా విస్తీర్ణము పది లక్షల, ఏబది వేల చతురపు మైళ్లు. జనాభా సుమారు 60 కోట్లు ఇది ప్రపంచ జనాభాలో ఐదవ వంతు.

భౌతికస్వరూపము - చరిత్ర: సారవంతమైన లోయలు, మైదానములు, తగుమాత్రము వర్ష పాతము, సమశీతోష్ణ పరిస్థితులు, అపారమగు ఖనిజసంపద - చైనాలో ప్రశస్త నాగరికతా నిర్మాణమునకు అనుకూలించినవి. ఎత్తైన పర్వతములు గాని, పెక్కు నదులు గాని లేకపోవుటచేత చైనా రాజకీయ సమైక్యతను సాధింప గలిగినది ; కాని సోవియట్ దేశము పెద్ద దగుటచేత, కేంద్రాధికారము బలహీనమై, రాష్ట్రీయ దురభిమానములు ప్రబలి, తరచు స్వతంత్ర రాజ్యము లేర్పడు చుండెడివి. చైనాను చుట్టి ఎడారులు (మధ్య ఆసియా), పీఠభూములు (పామీరు), పర్వత L శ్రేణులు (హిమాలయములు) ఉన్నవి. ఇందు నివసించిన క్రూర, అనాగరిక జాతులవారు తరచు దండయాత్రలు సాగించి, చై నాశాంతికి భంగము కలిగించిరి. నాగరిక తా కేంద్రములైన పర్షియా, ఇండియాలతో చైనా అవి చ్ఛిన్నమైన సంబంధ మేర్పరచుకొనలేకపోవుట కీ భౌతిక ఆటంకము కారణములు. చిత్రము - 216

శిలాయుగములు: జే. జి. ఆండర్సన్ నిర్ణయము యూనియన్ 43 Y2 三 T- 25 A కాశ్మీర్ సింకియాంగ్ • ఉరుమ్చి ఔటర్ మంగోలియా కాన్ సు సింగాయ్ నే పా ఇండియా కిరిన్ హీలంగ్ కియాన్ ఇ న్నర్ మంగోలియా !' హెపీ పెకింగ్ కొరియా గసినాన్ దక్షిణ కొరియా జపాన్ లాసా మాలయా పర్వతములు తూరు బర్మా జెన్ మహూపె • చెంగ్డు పూచాంగ్ చాంగ్ షా క్వెయాంగ్: హూనాన్ కున్మెంగ్ క్వైయి చో 'యూనాన్ ఉత్త వియత్నామ్ పటము - 1 కాంగ్ షాంఘే తూర్పు హాంగీూ చైనా సముద్రము చేకియాంగ్ పూచౌ. పూకేన్, నా నింగ్ క్యాంగ్ ంగ్ దక్షిణ చైనా సముద్ర ము ఫిలిపైన్స హై నాన్ పసిఫిక్ సముద్రము. చైనా దేశ సరిహద్దు రాష్ట్ర సరిహద్దు 200 63. 744 DE VI వ 3 ra fa fa