చైతన్య మహాప్రభువు
సంగ్రహ ఆంధ్ర
వాసుదేవ సార్వభౌమ భట్టాచార్యులు అనువార లిద్దరు చైతన్య స్వామి కనుయాయు లయినట్లు తెలియుచున్నది. ఈ విధముగా అచ్చట ఈ నూతన సంప్రదాయమునకు సుస్థిర స్థానము లభించెను.
తరువాత చైతన్యుడు దక్షిణ భారతము నందును, పశ్చిమభారతమునందును చాలవరకు సంచారము చేసెను (1509-1511). ఈ సంచారమునందు త్రోవపొడుగునను తన నూతన పవిత్ర సందేశమును ప్రబోధించుచు పోయెను.
ఈ సంచారమునుండి తిరిగి వచ్చిన తరువాత, కొద్దినాళ్ళకే అట్లే ఉత్తరభారతము నందును సంచారము చేయుచు బృందావనము వరకును వెడలెను. ఈ ప్రయాణ సందర్భమున ఒకసారి వారణాసియందు ప్రకాశానందుడను పండితునితో తత్త్వవిచారమున చైతన్యుడు వాదోపవాదములు సలిపెను. ప్రకాశానందస్వామి శ్రీ శంకరాచార్యులవారి అద్వైతవేదాంతవాదియగు పరివ్రాజకుడు. శంకరులవారు వేదాంత సూత్రములపై వ్రాసిన భాష్యమును చైతన్యుడు ఖండించి, శంకరులు వేదాంత సూత్రముల స్పష్టార్థమును క్లిష్ట పరచిరని చెప్పెను. శంకరాచార్యులవారు బాదరాయణుని సరళభావములను తెలుపక, తన భావములనే బలవంతముగ వాటియందు జొనిపినా రనియు, వేదాంత సూత్రకారుడు పరిణామ వాదమును అంగీకరించి యుండగా, శంకరులు దానిని తిరస్కరించి తన వివర్త (మాయా) వాదమును తెచ్చి పెట్టినారనియు, చైతన్యుడు విమర్శించెను. చైతన్యుని అభిప్రాయము ప్రకారము పరిణామవాదమే సత్యమైనది, సమంజన మయినది.
ఆ కాలములో బృందావనములోని పవిత్ర స్థలములన్నియు నిర్జనములై యుండెను. వాటిని జనులు మరచి పోయియే యుండిరి. చైతన్యస్వామి ఉపదేశానుసారము బెంగాలులోని వైష్ణవోత్తములు బృందావన క్షేత్రమును సుస్థితికి తెచ్చిరి. ఆ పుణ్యస్థలము ఒక ప్రముఖ ధర్మక్షేత్రముగా మారినదని చెప్పినచో అది వైష్ణవ మతచరిత్రలో ఘనమైన సంఘటనముగా ఎంచవలసి యున్నది. బెంగాలు ముస్లిం ప్రభువునొద్ద ఉన్నతాధికారు లగు నిద్దరు హిందువులు ఆ ఘనకార్యమును నిర్వహించిరి. చైతన్యప్రభువు బృందావనమునకు ప్రయాణము చేయు సందర్భమున ఆ యిద్దరకు చైతన్యస్వామి దర్శనము లభించెను. వీరిద్దరు చైతన్యస్వామికి పరమభక్తు లయిపోయిరి. వీ రిద్దరు రూప గోస్వామి, సనాతన గోస్వామి అను నామముల ప్రసిద్ధి చెందిరి. వీరు బృందావనములోనే నివసింప సాగిరి.
1515 నుండి 1533 లో పరమపదము చెందువరకు చైతన్యప్రభువు జగన్నాథపురీ క్షేత్రములోనే నివసించి యుండెను. అచ్చట నున్నంతకాలము చైతన్య మహాప్రభువు తన నూతన ధర్మోపదేశములను వివరించు వ్యాఖ్యాన ప్రసంగములను చేయుచుండెను. ఈ ప్రసంగముల మధ్య ఒక్కొక్కప్పుడు చైతన్య మహాప్రభువు నిర్వికల్ప సమాధి నిష్ఠుడై, దివ్యానుభూతులను పొందు చుండెను. అతని జీవిత మందలి తుది 12 సంవత్సరములలో భక్త్యావేశము అత్యంతముగ పెరుగ, ఆయన ఎల్లకాలము మతోద్రేకమునకు పరవశుడై యుండుచుండెను. ఈ పారవశ్యమును వైష్ణవ వాఙ్మయములో "దివ్యానందము” లేక “ప్రేమానందము” అనియెదరు.
భగవంతుడు మానుష వేషము తాల్చి మనుష్యులలో మెలగుటకే శ్రీకృష్ణ రూపమున అవతరించినాడు. అనన్య భక్తితో ఆ కృష్ణుని ధ్యానించుటయే, సేవించుటయే మోక్షసిద్ధికి హేతు వగును. కాని రాధాకృష్ణ సంబంధమయిన మధుర భక్తియెడ చైతన్యస్వామి భక్తిప్రపత్తులు ప్రగాఢములై వరలెను. ఈ మధురభక్తి భావమును ఇంక నే మతప్రవక్తయు ఇంత గాఢముగ ప్రవచనము చేసియుండలేదు. ఈ ప్రేమకు శారీరక సంబంధము లేదు. చైతన్యప్రభువు దానిని ప్రగాఢాధ్యాత్మిక తత్త్వముపై నిలిపెను. తన సంప్రదాయము శృంగారవిహార పథములో పడి భ్రష్టము కాకుండ చైతన్యప్రభువు తగు జాగరూకత తీసికొనెను. “ఈ సమాజములో స్త్రీలు చేరకూడదు ; తన సంప్రదాయ భక్తులు స్త్రీలతో ఎట్టి సంగతి కలిగి యుండకూడదు" అని మహాప్రభువు శాసించెను.
చైతన్య మహాప్రభువు ఉపదేశములనుండి ఘనమైన వేదాంత తత్త్వవాఙ్మయము వర్థమానమై యున్నను, ఆతడు విద్యా విజ్ఞాన సంప దావశ్యకతను గణించలేదు. తాను చెప్పి, చేసి, హృదయపూర్వక మయిన ఉత్సాహ భక్తి ప్రపత్తులను తన జీవితమునందే కనబరచి, హరి-కృష్ణ
738