Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/803

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము _ 8 739 చైతన్య మహాప్రభువు

నామోచ్చారణమునే పవిత్ర మహామంత్రముగా నొనర్చి, ఆధ్యాత్మిక లక్ష్యసాధనకు మార్గ మేర్పరచెను. భగవంతుని యందు ప్రేమభావమును జూపుటకు మొదటి సోపానము విశ్వ ప్రేమ అని అతడు బోధించెను.

చైతన్యతత్త్వము : చైతన్యస్వామి వైష్ణవమతాను యాయి. అయినను ఇతనికి ముందు వచ్చిన శ్రీ రామానుజాచార్యులు, శ్రీ విష్ణుస్వామి, శ్రీ వల్లభాచార్యులు ప్రవచించిన సంప్రదాయమునకు కొంతవరకు భిన్నమైన సంప్రదాయమును ఇతడు నెలకొల్పెను. చైతన్యస్వామి తత్త్వము ప్రకారము భాగవతము ప్రమాణగ్రంథము. శ్రీకృష్ణుడే దేవాధిదేవుడు. త్రి జగన్మోహనా కారుడు, వ న్నె లాడు, సర్వాంతర్యామి యగు పరబ్రహ్మము. ఆపర బ్రహ్మము తాను జగద్వికారాను గతుడయ్యును, తన అద్భుత మాయాశక్తి చే పెక్కు రూపధారియగును. శ్రీకృష్ణు నకు విలాసశక్తి కలదు. 'విలాసశక్తి' అనగా తనంతట తానే బహురూపములు పొందగల్గుట. ఈ విలాసశక్తి రెండు విధములు : మొదటిది ప్రభావ విలాసము. ఇది గోపికా విహార సంబంధమున కనబడును. ఈ వి సందర్భమున తన ప్రభావ విలాసశక్తి చే గోపికల సంఖ్యాను గుణముగ ఇద్దరిద్దరు గోపిక లమధ్య ఒక కృష్ణుడుండునట్లు, పెక్కు కృష్ణరూపములను ధరించి, వ్యవహరించినాడు. రెండవది 'వైభవ విలాసము'. ఈ వైభవ విలాసశక్తి చే కృష్ణుడు, వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ రూపములను తాల్చినాడు. ఈ నాలుగు విభవములను చతుర్ వ్యూహము లందురు. ప్రపంచోత్పత్తి నిమి త్తముగా పరాత్పరుడు ఈ నాలుగు వ్యూహ రూపములను ధరించును. చైతన్యుని తత్త్వము ప్రకారము వాసుదేవుడు విజ్ఞాన విభూతికిని, సంకర్షణుడు బలవిభూతికిని, ప్రద్యుమ్నుడు ప్రేమవిభూతికిని, అనిరుద్దుడు లీలావిభూతికిని ప్రతిబింబ గుణవిశిష్టులై యుందురు. ఈ వై భవవిలాసము ననుసరించియే ఏదేని ఒక వ్యూహమును పురస్కరించుకొని అవతారములు ఉద్భవిల్లును. సత్త్వ, రజస్తమో గుణముల ఆధిక్యము ననుసరించి కృష్ణుడే వరుసగా విష్ణుడుగనో, బ్రహ్మగనో, శివుడుగనో, భాసించును.

కృష్ణుని లీలలు సూర్యోదయ, సూర్యాస్తమానముల వలె సర్వకాలము సాగుచునే యుండును. ఆతని శాశ్వత లీలలు గోలోకమునందు విరాజమానము లగుచుండును. గోలోకము పై కుంఠలోకముపై నున్నది.

కృష్ణునకు మూడుశ క్తులు కలవు. మొదటిది అంతశ్శక్తి. ఇది విజ్ఞానాత్మకము. రెండవది బాహ్యశక్తి. ఇది భ్రమా త్మకము. మూడవది పై రెండింటికి అభేదముగా నుండు నది; ఇది జీవాత్మకము. కృష్ణుని ప్రధానశక్తి హృదయా నంద సంధాయకము. ఇదియే ప్రేమశక్తిగా కనబడు చున్నది. భక్తుని యొక్క హృదయములో ఈ రాగాత్మిక భక్తి స్థిరమైపోయినపుడు అది “మహానుభావత్వము" ను పొందును. ప్రేమ పరాకాష్ఠను చెందినప్పుడు అదియే 'రాధ' యనబడును. కృష్ణునకు ఈ రాధాదేవి అత్యంత ప్రేమపాత్రురాలు ; సకలసద్గుణ సంపన్న. కృష్ణుని గాఢ ప్రేమకు రాధయే లక్ష్యస్థానము. ప్రేమావతారముగా భావించుటచే హృదయ సంగతములగు సద్భావములు ఆమెకు భూషణములుగా భావితమగును. ఇదియే రాధాకృష్ణ భావము.

శ్రీ రామానుజాదులు లక్ష్మీనారాయణ భావమును ప్రతిపాదించిరి. విష్ణువే నారాయణుడు, ఆయన శక్తి యే లక్ష్మి. వీరు వై కుంఠ వాసులు, పాలనాధికారులు; కావున ఈ భావము భయభక్తి సమన్వితము. వారికి దూరము నుండియే నమస్కరింపవలయును. వైకుంఠ వాసులు విషయమున ప్రభుత భయముతో కూడిన భక్తిభావమది.

రాధాకృష్ణభావము అట్టిది కాదు. రాధాకృష్ణభావము స్నేహభావము, సామీప్యము. అనురాగమునకు సంబంధించినది. బృందావన లీలావిహారి శ్రీకృష్ణుడు. ఈ కృష్ణుడు మిత్రుడు, బాలుడు, ప్రియుడు. కావున లక్ష్మీనారాయణ భావముకంటే రాధాకృష్ణభావము మిన్న యైనదని చై తన్యులు సిద్ధాంతీకరించిరి. ఆత్మసమర్పణము తుది పరిణామముగలది రాధాకృష్ణభావము. విహారమునకు విశుద్ధ ప్రేమయే మూలభూతము. ఇట్టి ప్రేమ సాన్నిధ్యమును బొందుటకు ఉద్ధవాదులగు భక్తులు ప్రయత్నించిరి. గోపికా

కృష్ణపరమాత్ము డనంతుడు. పరిపూర్ణ విజ్ఞానవంతుడు. ఇక జీవాత్ముడో విజ్ఞాన విషయములో అణువు. వారిద్దరు యథావసరముగ పరస్పరాశ్రయులు. ఈ సంబంధమునకు ఎన్నడును భంగము కలుగ నేరదు. కృష్ణుడు ఆశ్రయుడు,