Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/801

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము - 8 చైతన్య మహాప్రభువు


మహా పిచ్చి కేకలు వేయుచు, తరుచుగా మూర్ఛితు డయ్యెడి వాడు. ఇతని చుట్టు అనుచరులు పెక్కురు చేరిరి. వీరిలో అద్వైతాచార్యులు, నిత్యానందుడు అను వారిద్దరు వ భక్తులు. వీరి సహకారముతో ఇతడు ప్రజల ధార్మిక జీవనమునందు ప్రస్ఫుట మైన నూతన విధానములను కల్పిం చెను. అద్వైతాచార్యులు మొట్టమొదట విశ్వంభరునకు గురువుగానుండి తదుపరి అతని శిష్యుడయ్యెను. పూర్వాశ్రమములో విశ్వరూపుడను పేరుగల నిత్యా నందుడు విశ్వంభరుని అన్న. నిత్యానందుడు శ్రీ బల రామావతార మనియు, విశ్వంభరుడు శ్రీకృష్ణుని అవతార మనియు భక్తుల విశ్వాసము.

చైతన్యుని ధర్మ ప్రబోధమునందు భ క్తి భావ ప్రకోవ నములగు కీర్తన గాన విధానము నూతన ఆరాధనా విధాన మయ్యెను. ఈ కీర్తనలో 'హరి - కృష్ణ' అను నామోచ్చారణ నినాదము మాత్రమే యుండును. ఈ సంకీర్తన సందర్భమున జంత్ర వాద్యముల సమ్మేళన ముతో, మహా ధ్వనితో భక్తులు బృందగానము చేయు చుండెడివారు. ఇదియే వారి ప్రతి దిన చారుచర్యగా నుండెను. ఈ కీర్తన సంఘముల వారు గొప్ప సమూహముతో నవద్వీప నగర వీధులందు ఊరేగుచుండెడివారు. విశ్వంభరుడును, ఆతని ముఖ్యానుచరులును ఈ ఊరేగింపున ముందు నడచుచుండెడివారు. వారందరు బ్రహ్మా నంద భరితులై ఆడుచు, పాడుచు, గంతులు వేయుచు పోవుచుండిరి. భ క్తి సత్సంగములు ప్రతి దినము శ్రీని వాసుడను భక్తునియింట జరుగుచుండెను. ఈ సత్సంగము అందు ప్రధాన విశేషము కీర్తన పరాయణత్వమే.

'సంకీర్తన పద్ధతి' యనునది ఒక క్రొత్త విధమగు ఆరాధన. ఆ కాలమున నామగాన పద్ధతి యెచ్చటను లేదు. ఎవరికిని తెలియదు. దీనికి సంగీత సాధనములు "భోల్" అను పొడుగుపాటి మృదంగమును, కరతాళ ము లును మాత్రమే. కీర్తనలు భగవంతుని నామావళిని మాత్రమే గూడుకొని యుండెను. ఇవి చిన్నవియు, అంద రును ఉచ్చరింప దగినవై యుండెను. కొంచెము సేపు మృదంగము మ్రోయించిన తరువాత ఆ నామములపయి మనస్సులు లగ్నము చేసి, నామావళిని పాడుటకు భ క్తులు ఉపక్రమించెదరు. అపుడు మహాప్రభువు నృత్యము చేయు మాటికి టకు లేచును. అందరును లేచి, చిందులు త్రొకుచుందురు. మహాప్రభువు చేతులు పైకెత్తి ఊర్ధ్వ దృష్టితో మాటి "హరిబోల్ - హరిబోల్" అనుచు కేకలు పెట్టుచుండును. అనుచరులందరును అట్లే నామోచ్చారణ ముతో, కేకలతో పరవశు లగుచుందురు. అందరు ఉన్మాదోద్రేకములతో వికార చేష్టలు చేయుచు, ప్రబలముగ నృత్యము చేయుచు తమ్ము తాము మరచి ఆనందమగ్ను లగుచుందురు. వీరు ఒండొరులను కౌగిలించు కొను చుందురు. వణకుచు ఏడ్చుచుందురు. అరచుచుందురు. ఇట్లు గంటలకొలది నృత్యము చేయుచుండుటచే వీరుల శరీరములనుండి చెమటలు కారుచుండును. కొందరు అలసి, వళముతప్పి, పడిపోయి, సమాధిగతులయ్యెదరు. ఈ విధాన మును గూర్చి మన మేమనుకొన్నను, కేవలము 'హరి బోలో, కృష్ణ బోలో' అను నామద్వయోచ్చారణ గాన కలాపముతో కూడిన అట్టి భావోద్రేక పూరితమగు ఆరాధన పద్ధతి, వైష్ణవ మతములో నూతన సంప్రదాయ విధానమై ప్రజలకు అధికముగ ప్రీతిపాత్ర మయ్యెను.

నడి బజారులలో జరుగు వీరి వికట తాండవ దృశ్యము కొందరకు ఏవగింపు కలిగించెను. రాష్ట్ర పాలకుడయిన ముస్లిం అధికారి ఈ కీర్తన విధానమును నిషేధించెను. కాని విశ్వంభరుడు సత్యాగ్రహ పద్ధతి నవలంబించెను. ఆతడు ప్రభుత్వపు టాజ్ఞను బహిరంగముగ ధిక్కరించెను. చివరకా ఆజ్ఞ రద్దు చేయబడెను. భగవంతు డడ్డుపడి, స్వప్న సం దేశ మిచ్చి ని షేధాజ్ఞను మాన్పించెనని చెప్పుదురు.

క్రీ. శ. 1510 జనవరి నెలలో కేశవభారతీస్వామి వారు విశ్వంభరునకు సన్యాస దీక్ష నొసగిరి. అప్పుడు కృష్ణచైతన్య భారతి అను పేరు పెట్టబడెను. కృష్ణచై తన్య పదమే సంగ్రహోచ్చారణలో చైతన్యుడను పదముగా మారెను.

భాగవత పురాణమునందు వర్ణితమైన శ్రీకృష్ణుని బాల్య క్రీడలకు తావలమైన బృందావనమునందు స్థిర నివాస మేర్పరచుకొనుటకు చైతన్యుడు నిశ్చయించు కొనెను. కాని మాతృదేవి ఆదేశానుసారము ఆమెకు దూరముగా కాక, దగ్గరగా పురి క్షేత్రమునందు నివసించుటకు ఆతడు ఒప్పుకొనెను. పురీ క్షేత్రములో ఓడ్ర దేశ ప్రభువగు ప్రతాపరుద్ర గజపతి, సుప్రసిద్ధ వేదాంతియైన