చెన్నపట్టణము
సంగ్రహ ఆంధ్ర
తెలుగువారగు ముత్యాల వర్తకులపేర నిర్మింపబడిన పేటకు ముత్యాలపేట యనియు, పగడాల వర్తకులుండిన వీధికి పగడాల వర్తక వీధి (Coral Merchants Steet) అనియు పేర్లు వచ్చినవి. ఈస్టిండియా కంపెనీ ఉద్యోగి యైన పెదనాయకుడు నివసించియున్న ప్రదేశము పెద్దినాయనిపేట యని పిలువబడుచు వచ్చెను. 'బ్రాడ్వే' అనువీధి ఒక కాలువగానున్న కాలమున తూర్పు పడమరల యందుండిన ముత్యాలపేట, పెదనాయకుని పేట నడుమ, మార్గమేర్పరచుటకై ఈ కాలువయందు మన్నుపోసి మరమ్మతు చేయబడినందున దానికి 'మన్నడి' యను పేరు కల్గినదందురు. రాయపురము రాయలపేర ఏర్పడి యుండవచ్చును.
వాషర్‌మన్‌పేట : మొట్టమొదట ఇంగ్లీషు వారితో బాటు, చాకలివారు రంగులు వేసెడివారు బందరునుండి చెన్నపట్టణమునకు వచ్చియుండిరి. వారు నూలును తడిపి ఉతికి, ఎండవేసి, రంగులతో అద్దకముచేయుట కుపయోగించిన ప్రాంతము చాకలిపేటయని (వాషర్ మన్ పేట) పిలువబడుచు వచ్చెను. అచ్చట నివసించిన చాకలివారందరు తెలుగువారు. బందరువారు కలంకారి అద్దకమునకు ప్రసిద్ధులుగదా !
జనసంఖ్య : 1639 లో చెన్న పట్టణమునందు 7,000 మంది జనులుమాత్ర ముండిరి. వీరందరు తెలుగువారే. కొలదిమంది ఇంగ్లీషువారుండిరి. 1640 లో కోట పరిసరము లందు వసతిగృహము లేర్పరుప బడి యుండెను. ఈ గృహనిర్మాణముల కనేకులగు పనివారు అవసరమయిరి. ఇందువలన జనసంఖ్య క్రమముగా పెరిగెను. 1646 నాటికి దాదాపు 17,000 వరకు హెచ్చెను. అప్పటికిని అందరు తెలుగువారే కాని తమిళు లున్నట్లు కనిపించదు. దానితో జనాభా 1681 నాటికి రెండులక్షలును, 1685 నాటికి మూడు లక్షలును, 1691 నాటికి నాల్గు లక్షలు కాజొచ్చెను. 1774 నాటికి చెన్నపట్టణములో పట్టణ పరిసరములందుగాని ఎక్కడా తమిళులులేకుండిరి. గాని, 1891 నాటికి జనాభా 5 లక్షలు. వీరు తెలుగువారే యని విశ్వసింపవలెను.
17, 18 శతాబ్దులలో తెలుగువారు విశేషమైన పలుకుబడి కలిగియుండిరి. 1687 లో చెన్నపట్టణమందు ప్రప్రథమముగా మ్యునిసిపాలిటీ ఏర్పడినపుడు, వెంకటాద్రి, ముద్దు వీరన్న, రంగనాథము అను మువ్వురాంధ్రులు అందు సభ్యులుగా నుండిరి. 1690 లో న్యాయస్థాన మేర్పడినప్పుడు గూడ న్యాయాధిపతిగా ఆంధ్రుడే నియమింపబడెను. అతని పేరు రంగనాథము. ఆకాలపు ఇంగ్లీషువారి 'సీలు' (అధికారముద్ర) ఇంగ్లీషు, తెలుగు భాషలయం దుండెడిది. తెలుగుభాష రాజభాషగా నుండెను.
18 వ శతాబ్దాంతమునకు బందరు పట్టణమందుండిన ఈస్టిండియా కంపెనీ ప్రాంతీయ కార్యాలయము ఎత్తి వేయబడినది. అప్పటినుండియు చెన్నపట్టణమునకు, తెలుగు దేశమునకు రాకపోకలు తగ్గినవి. దీనికితోడు, చెన్నపట్టణమునుండి దక్షిణదేశమునకు, 19 వ శతాబ్దిలో సౌత్ యిండియన్ రైలుమార్గము నిర్మింప బడుటచే దక్షిణ ప్రాంతమునకు చెన్నపట్టణమునకు సంబంధ బాంధవ్యములు హెచ్చెను. దక్షిణాదిని ఉన్న తమిళులకు చెన్నపట్టణ ద్వారములు తెరచినట్లయినది. క్రమముగా చెన్నపట్టణముననున్న తెలుగు వారికిని, తెలుగు దేశముననున్న తెలుగు వారికిని నడుమ సంబంధములు దూరమయ్యెను.
ఆకాలమున చెన్నపట్టణమునుండి తెలుగు దేశమునకు, తెలుగుదేశమునుండి చెన్నపట్టణమునకు రాకపోకలు చేయవలసి యున్నచో, సముద్రముపై ప్రయాణము చేయవలసి యుండెను. స్థానికముగా అరవల ప్రాబల్యము హెచ్చసాగెను.
చెన్నపట్టణమునకు ఆది పురుషులు ఆంధ్రులు. చెన్నపట్టణము ఆంధ్రదేశములోనిది, చెన్నపట్టణము ఆంధ్ర నాయకుల ఏలుబడిలోనిది. చెన్నపట్టణమున ఆంగ్లేయుల కాస్కార మిచ్చినవారు ఆంధ్రులు.
చంద్రగిరిరాజుల పక్షమున రాజ్యము చేయుచుండిన దామెర్ల వెంకటప్పనాయకుని (వెంకటాద్రి నాయకుని) యనుగ్రహమున ఇంగ్లీషువారి ప్రధానాధికారియగు సర్ ఫ్రాన్సిస్ డే యనువాడు 1639 లో చెన్నపట్టణములో వ్యాపారార్థము గిడ్డంగులు కట్టుకొనుటకు ఆజ్ఞను పొందెను. సముద్రతీరము వెంట 5 మైళ్ళ పొడవున, కొన్ని మైళ్ళ వెడల్పుగల ఒక చీలికను, సామంతుడగు పూనమల్లి నాయకరాజు సర్ ఫ్రాన్సిస్ డేకు మంజూరి చేసి సనదు ఇచ్చెను. ఆ ప్రదేశమునకు ఈస్టిండియా కంపెనీ
730