Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/793

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము - 8 731 చెవి-ముక్కు-గొంతుక

వారు 1200 పగోడాలు అద్దెగా చెల్లించునట్లు చెన్న పట్టణపు కరణం రాఘవబత్తుడు (నాగబత్తుడు) కట్టడిచేసెను. అప్పటినుండియే చెన్నపట్టణమునకు మద్రాసు అను పేరు రాజకీయముగా వ్యవహారములోనికి వచ్చి స్థిరపడిపోయినది. అప్పటినుండి మద్రాసు నౌకాశ్రయమై వాణిజ్య కేంద్రమై, రాజధానియై, మహానగరముగా పెంపొంది ఎన్ని యో రాజకీయ పరిణామములను పొందినది. ఆ విషయములన్నియు 'మద్రాసు నగర' శీర్షిక క్రింద వర్ణితమగును.

వి. సూ.

చెవి-ముక్కు-గొంతుక :

చెవి

చెవి మూడు భాగములుగ విభజింపబడినది. (1) బయటి చెవి, (2) మధ్య చెవి, (8) లోపలి చెవి. బయటి చెవిలో మన కందరకు గోచరించు భాగము “పిన్నా", మరియు మధ్యచెవిలోనికి దారితీయు మార్గము కలవు. ఈ దారి కొనను ఉల్లిపొర వంటి తెర గలదు. మధ్యచెవియు, లోపలి చెవియు ఎముకలో కలవు. మధ్యచెవి పెట్టెవంటి ఖాళీప్రదేశము. దానిచుట్టును ఒక పై పొర యుండును. ముఖమునకు కండరములను సరఫరాచేయు 7 వ నాడి ఈ మధ్య చెవి గుండా పోవును. 'ఇట్టేసియన్' అను గొట్ట అది మధ్య చెవిని గొంతు యొక్క

చిత్రము - 210 మొకటి కలదు. 2 పటము - 1 చెవి 3 చెవిని నిలువుగా కోసినచో గోచరించు భాగములు: 1. బయటి చెవి. 2. మధ్య చెవి. 3. లోపలి చెవి.

పై భాగముతో కలుపును. చెవి వెనుక ఒక హృదయపు ఎముక వంటి పదార్థమున్నట్లు మనకు గోచరించును. దానినే 'మేస్టాయిడ్' అందురు. ఇందు వాయు రంధ్ర ములు గలవు. అవి మధ్య చెవితో అనుబంధింపబడి యున్నవి. ఆసికిల్సు అను పేరుగల చిన్న ఎముక ముక్త్ర లు మూడు కలవు. సుత్తి యెముక చెవి గూబ పొరకు అను బంధింపబడినది. 'స్టేపీస్' అను భాగము యెముక లోపలి చెవికి (labyrinth) అనుబంధింపబడినది.

చిత్రము - 211 పటము - 2 లోపలి చెవి 1. శంఖాకృతి గల కాలువ (కాక్లియా)- ఇది శబ్దగ్రహణము నకు తోడ్పడును. 2. అర్ధ చంద్రాకారపు కాలువలు; ఇది తల యొక్క ఉనికిని తెలిసికొనుటకు తోడ్పడును.

లోపలి చెవిలో రెండు భాగములు కలవు. అవి (1) కుహరిక గానున్న భాగము (వెస్టిబ్యులర్ పార్టు) ; (2) కర్ణరంధ్రభాగము. రెంటికి కూడ 8వ కర్ణరంధ్రనాడి ద్వారా సరఫరా జరుగును. ఈ కుహరికయందు అర్ధ చంద్రాకారముగల కాలువలు మూడు గలవు. అవి వివిధ ప్రదేశములలో నుండును. అందు ద్రవము, స్పర్శ జ్ఞానముగల జీవకణము లుండును. ఈ భాగమువలన మనము మన తలయొక్క ఉనికిని తెలిసికొనుచున్నాము. కర్ణనాడి ప్రాంతములో, అనగా చిక్కు మార్గముగల ప్రదేశములో శంఖాకృతి గల కాలువ యుండును. ఆ కాలువ యందు స్పర్శజ్ఞానము గల జీవకణము లుండును. అవి ఇక్కడ నుండి కర్ణనాడిగుండా, మెదడు లోని కర్ణ వృత్తములోని మెదడు యొక్క కేంద్రములకు శబ్దమును