చెకోస్లోవేకియాదేశము (భూ)
సంగ్రహ ఆంధ్ర
నది, మధ్యగా నున్న నిమ్నప్రాంతము గుండా ప్రవహించి డాన్యూబులో కలియును.
స్లోవక్ - కార్పేథియన్‌ప్రాంతము : స్లోవేకియాప్రాంతము మొరేవియాకు తూర్పున నున్నది. ఇందు ఎక్కువ భాగము ఉన్నతముగా నుండును. నదీలోయలను వదలినచో, స్లోవేకియాలోని విశేషభాగము కార్పేథియన్ పర్వతముల పశ్చిమ భాగముచే ఆక్రమింపబడి యున్నది. కొంత వైశాల్యముగల నిమ్న ప్రాంతము దక్షిణమున కలదు. వియన్నా నగరమునకు తూర్పున బ్రటిస్లేవియా యొద్ద ఆల్పైన్ పర్వతశ్రేణులు డాన్యూబునదిని అడ్డగించును. 'లిటిల్ కార్పేధియన్స్' అను స్వల్పాకృతిగల కార్పేథియను కొండలు ఉత్తరముగా వ్యాపించుచు, మొరేవియాకును, స్లోవేకియాకును నడుమ సరిహద్దును బోలు నొక అడ్డంకిగా నేర్పడియున్నవి.
శీతోష్ణస్థితి : చెకోస్లోవేకియా దేశముయొక్క శీతోష్ణస్థితి ద్వివిధము. పశ్చిమ భాగమున మహాసముద్ర వాతావరణ పరిస్థితియు (oceanic), తూర్పుభాగమున మహాఖండ వాతావరణ పరిస్థితియు (continental) గోచరించును. ఇది భౌతిక, భౌగోళిక పరిస్థితులను బట్టి విశేషముగా మారుచుండును. బొహీమియను పీఠభూమికి సరిహద్దున గల పర్వతములు చల్లనై, ఘన వర్షపాతముతో నొప్పుచుండును. ఈ పర్వతములు పీఠభూమి చుట్టుననే శీతోష్ణ ప్రతిరోధకముగా వర్తించుచుండును. అచట మహాఖండ శీతోష్ణవాతావరణములు అధికముగ లేకున్నను, సుస్పష్టమగుచుండును. రాజధాని యగు ప్రేగ్ నగరము వద్ద శీతాకాలమునందు శీతోష్ణస్థితి చల్లగనుండును. వేసవిలో ఎండలు తీవ్రముగ నుండును. జులై నెలలో వాతావరణము సగటున 67° ఫా. ఉండును. కనీస వర్ష పాతము తారతమ్యముచే 20 అంగుళములు గాని, అంతకంటె తక్కువ గాని ఉండును. ఏటవాలుగనుండు పశ్చిమ పర్వతప్రాంతములు సౌమ్యములై, వర్షోపేతములై యుండును. పరీవాహప్రదేశములు (basins) శీతకాలమున చల్లనై, వేసవియందు వెచ్చనై యుండును. మిట్ట ప్రదేశము (uplands) లన్నియు అట్లాంటిక్ మహాసముద్రమునుండి వీచు పశ్చిమవాతప్రభావమును ప్రకటించును. తత్ఫలితముగ ఇచ్చట గాఢమైన వర్షముపడును.
మొరేవియన్ నిమ్న ప్రదేశమందు శీతాకాలపు శీతోష్ణస్థితి సౌమ్యముగ నుండును. ఇచ్చట వేసవియందు ఉష్ణ మధికముగ నుండును; వర్షపాతము గూడ హెచ్చుగ నుండును. కార్పేథియను పర్వతముల ఔన్నత్యమే పర్వత సంబంధమైన శీతోష్ణస్థితికి కారణము. మహాఖండ శీతోష్ణ స్థితికిలక్షణములైన శీతాకాలపుచలియు, వేసవికాలపు వేడిమియు తూర్పు ప్రాంతమందు గోచరించుచున్నవి. ఆల్ ఫోల్డు పర్వతములపైన, బ్రటిస్లేవియా సమీపమున, జులై నెలయందు శీతోష్ణస్థితి సగటున 70° ఫా. ఉండును. వేసవి యందు వర్షపాతము అత్యంత గాఢముగ నుండును. పర్వతములు సమీపమున నుండుటచే, వర్షపాతము 28 అంగుళముల వరకు పెరుగును.
అడవులు : ఈ దేశముయొక్క వైశాల్యమును బట్టి చూడగా, అటవీ సంపద విషయములో, అత్యంత భాగ్యోపేతములైన ఐరోపాఖండ దేశములలో చెకోస్లొవేకియా ఒకటిగా పరిగణింప బడుచున్నది. దేశము మొత్తములో గల చెట్లుచేమ లన్నిటిలో అడవులు ప్రాధాన్యము వహించు చున్నవి. దేశపు మొత్తము వైశాల్యములో అరణ్యములు 31 వ శాతము నాక్రమించి యున్నవి. పర్వత పంక్తులన్నియు 'కోనిపెరస్' (Coneferous) అను జాతి వనములతో ఆవరింపబడి యున్నవి. వాటిలో 'స్ప్రూస్', 'ఫిర్' జాతి వృక్షములు అధికముగ నుండును. 'బీచ్', 'ఓకు', 'ఫిర్', జాతుల చెట్లతో మిశ్రమారణ్యములు 2500 అడుగుల క్రిందున నున్న ఏటవాలు ప్రాంతములందు పెరుగును.
పంటలు : చెకోస్లావేకియాలో మొత్తము వైశాల్యము నందు 40 వ శాతము పంటలకై వినియోగింపబడు చున్నది. అచ్చటి వ్యవసాయ విధానము గుణాత్మకముగా ప్రసిద్ధిచెంది యుండుట ఒక ముఖ్య విశేషము. సస్య క్షేత్రములలో సగము భాగమునకు మించి ఆహార ధాన్యములు పండించబడును. అన్ని ఆహార ధాన్యములకు తుల్య ప్రాధాన్య మియ్యబడినది. రై, ఓట్లు, గోధుమలు, బార్లీ ధాన్యములు పండించుటకు నిర్ణయించబడిన ప్రదేశములలో మాత్రము కొంచెము వ్యత్యాసములుండును. పశుగ్రాసమున కుపయోగపడు పైరులుకూడ అచ్చట పెంచబడు చున్నవి. సుగర్ బీట్సు (Sugar beats) విశేషముగా
720