విజ్ఞానకోశము - 3
చెకోస్లోవేకియాదేశము (భూ)
ఉత్పత్తి చేయబడుచున్నది. చెరకుపంట విషయములో యూరపునందు జర్మనీ తర్వాత, చెకోస్లావేకియా రెండవస్థాన మాక్ర మించుచున్నది. గోధుమలు, ఇతర ధాన్యములు ముఖ్యముగా దక్షిణప్రాంత మందును, బార్లీ ఉత్తర మొరేవియా యందును సుగర్ బీట్సు దక్షిణ బొహీమియా, మొరేవియా పల్లపు భూము లందును పండించ బడును.
డాన్యూబు నదీమైదానపు సరిహద్దులందు ద్రాక్ష పండించ బడును. ఆపిల్ పండ్లు, బేరిపండ్లు (pears), చెర్రీపండ్లు (cherries), రేగుపండ్లు (plums) మున్నగు ఇతర ఫలములు బొహీమియా పీఠభూమియందు సాధారణముగా పండును. మొరేవియను నిమ్న భూభాగము సారవంతము, వ్యవసాయోపయోగకరమునై యున్నది. వ్యవసాయాభివృద్ధి మిగుల విశేషముగా జరుగుటచే ఈ దేశము ఆహారధాన్యముల విషయములో దాదాపు స్వయంపోషక మనదగి యున్నది.
ఇచ్చట వస్తూత్పత్తిని పెంపుచేయు పరిశ్రమలు (stock raising) అంతగా అభివృద్ధి చెందలేదు. ముఖ్యముగా పాడి పరిశ్రమ వెనుకబడి యున్నది. మాంసోత్పత్తి దేశావసరములకు చాలినంతగా జరుగుచున్నది.
పరిశ్రమలు : వివిధములైన ఖనిజములు లభించుటవలన జనసాంద్రత అధికముగా నుండుటవలన, చెకోస్లావేకియా ప్రముఖమైన పారిశ్రామిక దేశముగా గణుతి కెక్కినది. దేశ ప్రజలలో మూడవ వంతు పరిశ్రమల వలన జీవించు చున్నారు. ఈ దేశము యొక్క పారిశ్రామిక పాటవమునకు బొగ్గు ముఖ్యమైన ఆధారముగ నున్నది. ఇతర పారిశ్రామిక దేశములతో పోల్చిచూచినచో ఈ దేశమున జలవిద్యుచ్ఛక్తి ఎక్కువగా అభివృద్ధి నొందలేదు. ఆస్ట్రియా సరిహద్దునగల ప్రాంతములలో పెట్రోలియము ఉత్పత్తి స్వల్పముగా జరుగుచున్నది. బొగ్గు ఉత్పత్తి స్థానము లన్నియు దాదాపు ఆస్ట్రేలియా - కార్విన్నా ప్రాంతములందు కేంద్రీకృతములైనవి. ఇవి బెల్జియము, ఫ్రాన్సుదేశము లందలి ఉత్పత్తిస్థానములకంటె మిగుల గొప్పవి. 1949 వ సంవత్సరములో అన్ని ఉత్పత్తి క్షేత్రములు కలిసి 1 కోటి 70 లక్షల టన్నులు గట్టిబొగ్గును, 2 కోట్ల 60 లక్షల టన్నులు లిగ్నైటును ఉత్పత్తి గావించెను. ఇనుము స్వల్పముగ మాత్రమే ఉత్పత్తియగు చున్నది; సాలీనా ఉత్పత్తి 500,000 టన్నులు. ముఖ్యముగా బొహీమియను పరీవాహప్రదేశ మందును, ఎర్జ్ గెబెర్గ్ యందును అనేకవిధములైన ఖనిజములు సామాన్యమైన పరిమాణములో ఉత్పత్తి యగుచున్నవి. స్లోవేకియా పర్వతప్రాంతమందు వివిధములైన ఖనిజములు లభించుచున్నవి. బొగ్గు, ఇతరములైన ఖనిజములు ఇచ్చట పుష్కలముగా లభించుటవలన, ఇంజనీరింగు, వస్త్రపరిశ్రమలు, గాజు, తోలు, రసాయన పరిశ్రమలు భారీ యెత్తున అభివృద్ధినొందుటకు దోహదము చేకూరుచున్నది. అరణ్యములు గూడ దేశ సంపదాభివృద్ధికి ముఖ్యాధారములుగా నున్నవి. ఆటవిక పదార్ధములు కాగితములు తయారు చేయుటకు, ఇండ్లసామానులు తయారు చేయుటకు, గృహోపకరణములు నిర్మించుటకు ఉపయోగపడుచున్నవి.
చెకోస్లోవేకియా రాజధాని 'ప్రేగ్' నగరవాసులు పెక్కువిధములైన పరిశ్రమలందు వ్యాషృతులై యున్నారు. ఆస్ట్రవా నగరమందు భారీ యంత్రములు ఉత్పత్తియగు చున్నవి. ప్రథమ, ద్వితీయ ప్రపంచ మహా సంగ్రామా వసరములకును, 1948 వ సంవత్సర కాలమున కమ్యూనిస్టు సైన్యములకొరకును ఆయుధములు సమకూర్చిన పారిశ్రామిక క్షేత్రములలో 'స్కోడా' ప్రధానమైనది. ఇచ్చట వ్యవసాయోపకరణములు, యంత్రసామగ్రి, రైలు ఇంజనులు, వాగనులు తయారగును. ఎర్ట్ గెబెర్గ్, సుడేటను ప్రాంతములవెంబడి అవిచ్ఛిన్నమగు పారిశ్రామిక మండల మొకటి విస్తరించియున్నది. అందు యంత్రసామగ్రి, నేతవస్తువులు ఉత్పత్తియగుచున్నవి. లిబెరక్, బ్రూనో ప్రాంతీయులు నేత పరిశ్రమలో నిమగ్నులై యున్నారు. బొహీమియను పీఠభూమియందలి వాయవ్య మండలమునందు పెక్కు గాజు పరిశ్రమ కేంద్రములు గలవు. 'బ్రూనో' సమీపమున నున్న జ్లిన్ (zlin) అను తావునందు గల 'బాటా' షూ ఫ్యాక్టరీ (పాదరక్షల కర్మాగారము) ప్రపంచ విఖ్యాతమైనది. పెక్కు దేశములందు దానికి చెందిన కర్మాగారములు గలవు. 'బీర్' అను సారాయము ముఖ్యముగా 'ప్లాజన్' (Plazan) అను చోట ఉత్పత్తియగు చున్నది.
721