విజ్ఞానకోశము - 3
చిలీదేశము
లలో లభ్యమగుచున్నవి. ఈ రాష్ట్రములు చిలీ దేశములో ఉత్తరముగా నున్న ఎడారి ప్రాంతమునందు కలవు. ప్రపంచములోకెల్ల సహజమైన నత్రితము (nitrate) లభించు దేశ మిదియే. ప్రపంచమందు ఉపయోగింపబడు అయొడిన్ (iodine) లో 60 వ శాతము నత్రితము యొక్క ప్రక్రియల (nitrate processes) ఉప ఫలితములుగా పొందబడు చున్నది.
అయినను చిలీకి నత్రితము విషయమున ప్రపంచమంతటిలో గల గుత్తవ్యాపార ప్రాబల్యము, సంకలన ఉత్పత్తి (synthetic product) యొక్క అభివృద్ధి కారణముగా తగ్గిపోయినది.
ప్రపంచములోకెల్ల అధికతమమైన రాగిసంపద చిలీ దేశములో కలదు. దీని విలువ 134 మిలియను పౌనులని అంచనా వేయబడినది. దీనికితోడుగా, ఉత్తమ తరగతికి చెందిన ముతక ఇనుముగూడ 900 మిలియను టన్నులకు పైగా అచట లభ్యమగును. చిలీ గనులలో లభ్యము కాగల బొగ్గు రెండు బిలియనుల టన్నులకు మించి యున్నది. అయితే ఆ బొగ్గుకు పరిమాణ విశేషమేగాని గుణవిశేషము లేదు.
1952 వ సంవత్సరమున ఖనిజోత్పత్తి ఇట్లున్నది :
బొగ్గు, లిగ్ నైట్ - 21,93,199 మెట్రిక్ టన్నులు.
రాగి (శుభ్రపరుపబడినది) 4,04,742 టన్నులు.
ముతక ఇనుము 23,10, 472 టన్నులు.
సోడా నైట్రేటు 14,27,817 టన్నులు.
బంగారము 1,76,021 ఔన్సులు.
వెండి 12,46, 327 ఔన్సులు.
పాదరసము, ముడిమాంగనము (manganese ore). మణిశిల (cobalt), తుత్తునాగము (zinc), తుంగనము (Tungsten), మోలదము (Molybdenam) అను లోహ ఖనిజములు కూడ అచ్చట ఉత్పత్తి చేయబడును. వరుణము (Uranium) యొక్క నిక్షేపములు గూడ చిలీయం దున్నట్లు తెలియుచున్నది. 1945 సం. డిసెంబరులో మొదటి సారిగా నూనె 'టై రాడెల్ ఫ్యూగో' (Tierradel Fuego) లో ఉత్పత్తి చేయబడినది. 1952 సం.లో ఉత్పత్తి అయిన నూనె పరిమాణము 800,000 పీపాలు.
చిలీ దక్షిణ భాగమునందు 35 మిలియను యకరముల విస్తీర్ణము గల అడవులు గలవు. అందు వర్తకమునకు ఉపయోగపడు కానిఫర్ (Conefer), లారెల్ (Laural) మగ్నోలియా (Magnolia) మున్నగు నానా విధములైన కలప ఆదేశములో ఉత్పత్తి యగుచున్నది. గండు చేపలు (Cod), పామువలె నుండు చేపలు (Eel), గుల్ల చేపలు (Oysters), సొరచేపలు (Sawfish), సార్డయిన్స్ (Sardines), ట్యునా (Tuna), తిమింగలపు నూనె (Whale oil) మున్నగునవి జాలరి వృత్తికి సంబంధించిన ఉత్పత్తులలో చెప్పదగినవి.
నై సర్గిక లక్షణము - శీతోష్ణస్థితి : చిలీదేశము ఇరుకైన, పర్వతమయమైన భూభాగము. దాని పొడవు 2661 మైళ్లు. 46 నుండి 250 మైళ్ల వరకు వెడల్పు గలది. మొత్తము విస్తీర్ణములో మూడవ వంతు అత్యున్నతమైన ఆండీస్ (Andes) పర్వత పంక్తులచే ఆక్రమింపబడియున్నది. ఉత్తర తీర పర్వతములకును, ఆండీస్ పర్వతములకును నడుమ ఖనిజ సంపత్తికి ప్రసిద్ధివడసిన 'అటకమా' ఎడారి కలదు. మధ్యభాగమున 700 మైళ్ల పొడవు గల లోయ యొకటి కలదు. అది ఆండీస్ పర్వతములకును, ఎత్తయిన తీర మైదానమునకును మధ్యగా నున్నది. ఆ లోయలో జనాభా క్రిక్కిరిసి ఉన్నారు. దక్షిణమున ఆండీస్ పర్వతములు సముద్రతీరమునకు సరసనే యున్నవి.
చిలీ ప్రధాన భూభాగములో దక్షిణకొన యందు ప్రపంచములోకెల్ల మిక్కిలి దక్షిణమున నున్న 'పుంటా అరీనాస్' (punta Arenas) అను పట్టణము కలదు. దానికి ఆవల 'మాగెల్లన్' అను జల సంధియు, 'టైరా-డెల్-ప్యూగో' అను ద్వీపమును కలవు. ఈ ద్వీపము చిలీ, అర్జెంటైనాల మధ్య విభక్తమై యున్నది. దక్షిణ పసిఫిక్ సముద్రములో, చిలీ ప్రధాన భూభాగమునకు పశ్చిమమున సుమారు 400 మైళ్ళ దూరమున నున్న 'జువాన్ ఫెర్‌నాన్‌డెజ్ (Juan Fernandez) అను దీవులును, పశ్చిమమున సుమారు 2000 మైళ్ల దూరమున నున్న 'ఈస్టర్' (Easter) ద్వీపమును చిలీ స్వాధీనమున నున్నవి.
చిలీలోని పొట్టినదులు నీటిపారుదలకును, విద్యుచ్ఛక్తి ఉత్పత్తికిని మాత్రమే ఉపయోగకరములుగా నున్నవి. దేశమున పెక్కు ఓడరేవు లున్నవి. మంచి నౌకాశ్రయములు మాత్రము తక్కువగా నున్నవి. సరకుల రవాణా
713