చిలీదేశము
సంగ్రహ ఆంధ్ర
సమ శీతోష్ణస్థితి గలిగిన కేంద్ర ప్రాంతము నందలి లోయలలో జరుపబడుచున్నది. దేశములో ఫలవంతమగు భూమి అతి స్వల్పముగ నున్నది. దానిలో అధిక భాగము నీటి పారుదలను అపేక్షించును. 1951 లో గోధుమ 9,88,000 మెట్రిక్ టన్నులు పండెను. ఇదియే అచ్చటి ప్రధానమైన పంట. తరువాత పేర్కొన దగినవి ఉర్లగడ్డలు, ఓట్సు, బార్లీ, ధాన్యము, తీగెచిక్కుడు, పండ్లు, గోధుమ తర్వాత అధిక విస్తీర్ణములో ద్రాక్ష పండింపబడుచున్నది. ద్రాక్ష ఫలముల నుండి 1952 సం. లో 56,500,000 గ్యాలనుల ద్రాక్ష సారాయి తయారయ్యెను. సగటున 2500 ఎకరముల విస్తీర్ణము గల ఫ్యూడల్ (జమీందారీ) భూకమతములు (estates) ఆ దేశములో ఎక్కువగా నున్నవి. 1951 సం. న పశుసంపద యొక్క మొత్తము సంఖ్య 2,160,000; 1949 సం.న గొఱ్ఱెల సంఖ్య 6,345,000; 1951 సం.న ఉన్ని ఉత్పత్తి 12,000 మెట్రిక్ టన్నులు. పశు పరిశ్రమ స్థానికావసరములకు చాలినంతగా లేదు. చిలీలో తయారగు ఉన్నిలో కొంతభాగము అచ్చటి బట్టల మిల్లులకు ఉపయోగపడుచున్నది. కాగా మిగిలిన ఉన్ని, చర్మములతో పాటుగా విదేశములకు ఎగుమతిచేయబడుచున్నది.
విదేశీ వ్యాపారము : (అమెరికన్ డాలర్లలో-మిలియనులలో). మిలియన్ అనగా 10 లక్షలు :
1950 | 1951 | 1952 | |
ఎగుమతులు | 282 | 371 | 456 |
దిగుమతులు | 240 | 329 | 371 |
1952 సం. లో అమెరికా 57 శాతమును, అర్జెంటినా 8 శాతమును, బ్రిటన్ 5 శాతమును, జర్మనీ 5 శాతమును చిలీ నుండి సరకులను దిగుమతిచేసికొనెను. చిలీ దేశము అమెరికా నుండి 52 శాతమును, బ్రిటను నుండి 9 శాతమును, అర్జెంటినా నుండి 8 శాతమును సరకులను దిగుమతి చేసికొనెను. 1952 సం.న చిలీ ఈ క్రింది ముఖ్యమైన ఎగుమతులు చేసెను : రాగి (49 శాతము) ; సత్రితము (నైట్రేట్ : 13 శాతము). ప్రధానమైన దిగుమతులు యంత్రములు, వాహనములు, నేతవస్తువులు, పంచదార, ఇనుము, ఉక్కు, చేతిపని సామానులు.
గొప్ప పారిశ్రామికాభివృద్ధిని గూర్చి చిలీ కలలు కను చున్నను, ఉత్తమ తరగతికి చెందిన బొగ్గు, తగరము తప్ప, శేషించిన అవసరమగు ముడిసరకులన్నియు చిలీ యందు లభ్యమయినను, అందు ప్రగతి మందముగ సాగుచున్నది. ఖనిజ పరిశ్రమయందు తప్ప, దైనందిన జీవితములో ప్రజలు వాడుకొను వస్తువులు - ముఖ్యముగా వస్త్రములు- ఇతర పరిశ్రమలలో చౌకగా తయారగుచున్నవి. 1946 సంవత్సరములో ఉక్కు పరిశ్రమ స్థాపింపబడినది. ఉక్కు ఉత్పత్తి 1952 వ సంవత్సరములో మొత్తము 243,000 మెట్రిక్ టన్నులు జరిగెను.
1947 వ సంవత్సరము నాటికి మొత్తము సుమారు 31,250 మైళ్ళ పొడవున రోడ్డు రహదారీ నిర్మింపబడి యుండెను. ఇందులో మూడవ వంతు చక్కపరుపబడినది. రైల్వే మార్గము పొడవు 5,434 మైళ్ళు. ఇందులో కొంత విద్యుదీకరణము చేయబడినది. చిలీ అంతర్భాగములో ప్రజోపయోగమునకై విమానయాన సౌకర్యము గొప్పగా అభివృద్ధి నొందియున్నది. అనేకములైన అంతర్జాతీయ విమానయాన మార్గములు దేశమందు ఏర్పరుప బడినవి. 'లాయ. రిజిస్టర్' ను బట్టి, 1952 వ సంవత్సరము జూన్ 30 వ తేదీనాటికి చిలీలో మొత్తము 1,87,618 టన్నుల శక్తిగల 92 వాణిజ్య నౌక లున్నట్లు తెలియుచున్నది.
ఇటీవల తయారు కాబడిన ఆదాయ వ్యయములు (బిలియనులలో) ఈ క్రింది విధముగా నున్నవి :
(బిలియను పీసో నాణెమునకు)
1 బిలియను అనగా లక్ష కోట్లు.
1951 | 1952 | 1953 | |
ఆదాయము | 26.0 | 3- | 47.5 |
వ్యయము | 27.6 | 42.0 | 47.5 |
బడ్జెట్ అంచనా : 1951 సంవత్సరము డిసెంబరు 31 వ తేదీనాటికి చిలీ ప్రభుత్వము 7,524,100,000 పీసోలు జాతీయ ఋణము చెల్లించవలసి యుండెను. ఇందులో 5,461,100,000 పీసోలు చిలి ప్రభుత్వము స్వదేశీయులకే ఋణపడి యుండెను. చిలీ దేశముయొక్క ఆర్థిక సంపత్తికి పునాది అందలి ఖనిజసంపదయైయన్నది. ఈ ఖనిజములు 'అట కామా' (Atacama). 'అంటిఫా గస్టా' (Antofa gasta), 'టారాపకా' (Tarapa) అను రాష్ట్రము
712