చిరుధాన్యములు
సంగ్రహ ఆంధ్ర
నుండును. ఊద కొంచెము తేమగా నుండు నేలలో త్వరగా నెదుగును. దీనిని మెట్ట సస్యముగను, నీరు పెట్టియు గూడ సాగుచేయవచ్చును.
చిత్రము - 201
పటము - 8
ఇంగ్లీషు భాషలో ఈ సస్యము 'సాన్వా మిల్లెట్' (Sanwa millet) లాటిను భాషలో 'ఎచినోక్లోవా కొలోనా' (Echinocloa colona) అనియు పిలువబడు చున్నది. ఈ ఆహారము రక్తస్రావము నాపును; ప్లీహ వ్యాధులకు పనిచేయును; విరేచన బద్ధము తొలగించును.
9. దిసక: దిసక కొన్ని చోటులయందు కలుపుమొక్కగా పెరుగు గడ్డి జాతికి చెందినది. ఆంధ్రరాష్ట్ర మందును, మైసూరురాష్ట్రము నందును కొన్ని తావులలో గింజల కొరకు దిసక సాగులో నున్నది. దిసక మొక్క ఆటవిక స్థితిలో గరిక వలె బయలు దేరి పెరుగు బహువార్షికము. విత్తులు చల్లి దీనిని సాగుచేయుచుందురు.
చిత్రము - 202
పటము - 9
దిసక దుబ్బు 1.3 అడుగుల ఎత్తు వరకు ఎదుగును. దీని ఆకు తొడిమ 2-3 అంగుళముల పొడవుండును. రేకు 5-6 అంగుళముల పొడవును, శ్రీ అంగుళము వరకు వెడల్పును కలిగి యుండును. బాగుగా ఎదిగిన దినిక వెన్ను 6 అంగుళముల పొడవును, చాల రెల్లలును కలిగియుండును. దిసక మెట్టపంటగా, ఇసుక, ఎర్ర, గరప నేలలలో సాగుచేయబడును. లాటిను భాషలో ఇది 'బ్రాచియారియా రామోసా' (Brachiaria ramosa) అని పిలువబడుచున్నది. తెలుగులో 'ఈదురు గడ్డి' యని నామాంతరము గలదు.
10. గొలుగు : గొలుగు వరిచేలలో కలుపు మొక్కలుగా పెరుగుచుండును. ఈ మొక్కల గింజలు కొన్ని చోట్ల బీద వారికి ఆహారముగా ఉపయోగపడును. ఈ సస్యమునకు భారతదేశమే ఆదిమ స్థానముగ భావింపబడుచున్నది. బర్మా, చైనా, జపాను, ఫిలిప్పైన్ దీవులు మొదలగు దేశములలో కూడ గొలుగు కాననగును.
గొలుగు మొక్క సుమారు 3 మొ. 8 అడుగుల ఎత్తువరకు పెరుగు. దీనికి కూడ 4-5 పిలకలు సాధారణముగా బయలుదేరును. పై భాగమందలి కనుపులనుండి శాఖలు, ఉపశాఖలు బయలు దేరును. గొలుగు కాండము గుండ్రముగ నుండి, లోపల బెండు కలిగియుండును. దీని ఆకులు వరి ఆకుల కంటె వెడల్పయినవి. దీని కాయ పెంకుకట్టి నిగ నిగ చుండును. గొలుగు ఉష్ణప్రదేశములందును, శీతల ప్రదేశము లందు గూడ పెరుగును. దీనికి వండలి నేలలు అనుకూలములుగా నుండును. గొలుగు గింజలను దండలుగ గ్రుచ్చి కంఠాభరణముగ ఉపయోగించుదురు.
చిత్రము - 203
పటము - 10
దీనిని ఇంగ్లీషు భాషలో 'జాబ్స్ టియర్స్' (Job's
706