విజ్ఞానకోశము చిరుధాన్యములు
ఇంగ్లీషు భాషలో ఈ ధాన్యము 'లిటిల్ మిల్లెట్' అనియు, లాటిన్ భాషలో 'పానికమ్ మిలియేర్'
(panicum miliare) అనియు పిలవబడుచున్నది. దీనికి 'గంగచామ' అనియు నామాంతరము కలదు. ఇది శరీరమునకు పుష్టిని, నరములకు ఉద్రేకమును ఇచ్చును.
7. వరిగ : ఇది చామగణములో చేరినది. వరిగ కూడ భారతదేశమున చాల పురాతన సస్యముగ నెంచబడు
చిత్రము - 200
పటము - 7
చున్నది. దీనికి చీనాదేశము ఆదిమస్థాన మనియు, ఈజిప్టు నుండి గాని, అరేబియానుండి గాని భారతదేశమునకు వచ్చి యుండవచ్చుననియు కొందరు శాస్త్రజ్ఞుల అభిప్రాయము. భారతదేశమందును ఆఫ్రికాలో మధ్యధరా సముద్ర ప్రాంతములందును, యూరపులో కొన్ని భాగములందును, రష్యా, చైనా, ఉత్తర అమెరికా, జపానులయందును వరిగ సాగుచేయబడుచున్నది. వరిగ మొక్క చామ మొక్కను పోలి యుండును. ఇది సుమారు 2-3 అడుగుల ఎత్తు పెరుగును. దీని కాండము చామకాండముకంటే సన్నముగను ఉండును. ఈ మొక్కకు పెక్కు భాగముల యందు నూగు కనిపించును. దీని ఆకు వెడల్పు ¼ - ¾ అంగుళము; పొడవు సామాన్యముగ 6 మొ. 15 అంగుళము లుండును. ఆకుతొడిమ కాండముయొక్క ఖండమును పూర్తిగ కప్పియుంచును. వరిగ వెన్ను సుమారు 6 మొ. 10 అంగుళముల పొడవుండును. చామ వెన్నులో కంటె వరిగ వెన్నులో రెల్లలు ఎక్కువగ నుండును. వరిగ గింజలు కొంచెము పెద్దవిగ నుండును. మొక్కకు కొన్ని భాగములయందు ఊదారంగు ఉండును. ఊదారంగు భేదమును బట్టియు, నూగుయొక్క సాంద్రతను బట్టియు, గింజరంగును బట్టియు, శాస్త్రజ్ఞులు వరిగలో రకముల భేదములను గుర్తించుచుందురు. వరిగ సామాన్యముగ శీతకాలపు పైరుగ నెన్న బడుచున్నది. కొన్ని చోట్ల దీనిని మెటట్ట సస్యముగను, మరికొన్నిచోట్ల పల్లపు సస్యముగను సాగుచేయబడుచున్నది.
ఇంగ్లీషు భాషలో దీనిని 'కామన్ మిల్లెట్' (Common millet) అనియు, లాటిను భాషలో 'పానికమ్ మిలియక్కమ్' (Panicum miliaccum) అనియు పిలుచుచున్నారు. 'బరిగ' అనియు తెలుగులో దీనికి నామాంతరము కలదు. గనేరియా వ్యాధులకు ఇది బాగుగా పనిచేయును.
8. ఊద : 'ఊద' వరిచేలలో కలుపుగా పెరుగు గడ్డిజాతి లోనిది. ఇది భారతదేశమున చాల పురాతనకాలము నుండియు సాగులోనున్నట్లు శాస్త్రవేత్తల అభిప్రాయము. చైనాలోను, జపానులోను, కొంతవరకు ఆఫ్రికాలోను ఈ పైరు ప్రస్తుతము సాగులో నున్నది. ఊద మొక్క దుబ్బుగా సుమారు 2 మొ. 3½ అడుగుల ఎత్తువరకు పెరుగును. దీనికాండము కొంచెము బల్ల పరుపుగను, లావుగను ఉండును. ఒక్కొక్క మొక్కలో 2-5 పిలక లుండును. దీని ఆకులు సన్నముగ నుండును. తొడిమ పొడవు సుమారు 3-4½ అంగుళములును, రేకుపొడవు 9-15 అంగుళములును ఉండును. ఊద వెన్ను సాధారణముగ 4.6 అంగుళముల పొడవుండును. అది ఇంచుమించు గుర్రపుతోకవలె నుండును. ఊదగింజలు చాల తేలికగా