Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/762

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

చిరుధాన్యములు డ700 సంగ్రహ ఆంధ్ర

బేకన్ మహాశయుని రచనయందు చిన్నచిన్న వాక్య ములు కానవచ్చును. ఆ చిన్న వాక్యములందే ఎంతో లోకానుభవమును, జ్ఞానమును నిండియున్నవిగా గను పట్టును. అందులోని భాష ప్రాచీనతను బ్రకటించును. ఒక్కొక్క వాక్యమొక నీతివచనమయి, లోకో క్తిగా బ్రయోగింప దగియుండును. మధ్యమధ్య లాటిను వాక్యములు, లాటిను పదవిధులును పానకములోని మిరియములవలె వచ్చుచుండును. తెనుగున చిన్నయసూరి వచనరచనయు నిట్టిదే. చిన్న చిన్న వాక్యములు, ఒక్కొక్క వాక్య మొక్క లోకోక్తిగా నుండుట, మధ్యమధ్య క్తిగా నుండుట, మధ్యమధ్య సంస్కృత వాక్యములు, సంస్కృత పదముల పలుకు బడులు, భాషలో ప్రాచీనత - ఇవి యన్నియు కలిసి చిన్నయసూరి వచనమున కొక విశిష్టత నొసంగినవి. నీతిచంద్రిక లో నివాక్యములలో సూత్రకర్తయయిన చిన్నయసూరి గోచరించుచుండును.

చిన్నయసూరి నిత్యజీవితము మిక్కిలి నిరాడంబర మయిన దయ్యును, మిక్కిలి నియమబద్ధ మయినదని విందుము. ఆతడు స్ఫురద్రూపిగానుం డెనట ! కలువలపల్లి ౦డెనట! రంగనాథశాస్త్రిగారను సుప్రసిద్ధ పండిత న్యాయమూ ర్తుల యింట చిన్నయసూరి యుద్ధండ పండితులముందు నిలచి, పూర్వసంసిద్ధత లేకుండగనే అలంకారశాస్త్రమును గురించి ఒక నాడు గంటల తరబడి శ్రుతి రంజనముగా నుపన్యసించెనట! ఆ వినువారు సాయం కాలమయినను, భోజన సమయమయినను, కాలమునే మరచిపోయి సూరి గారి ఉపన్యాసమున మునిగిపోయిరట ! ఇది ఈ తరము వారికి వినికిడి వలన నెరుగదగినదే కాని, నీతిచంద్రిక వచన రచన చూచినచో అట్టిది చిన్నయసూరికి సహజమేయని తోచకమానదు. సూరి నీతిచంద్రికలో మిత్రలాభ, మిత్రభేదములను రెండు ప్రకరణములనే రచించెను. కడమ వానిని కందుకూరి వీరేశలింగముగారును, కొక్కొండ వేంకటరత్నము పంతులుగారును వేరువేరుగా రచించి పూరించిరి. ఆంధ్రభాష యున్నంతకాలము నిలిచియుండగల కీర్తిమూర్తి చిన్నయసూరి.

అ. రా. శ.


చిరుధాన్యములు (Millets) :

ప్రపంచమందలి జనాభా కంతకు కావలసిన ముఖ్య మైన ఆహారము తృణధాన్యములనుండి లభించుచున్నది. ఈ తృణధాన్యములలో వరి, గోధుమ, మొక్కజొన్న, బార్లి, ఓట్లు, రై ముఖ్యములయినవి. ఈ ధాన్యపు గింజల పరిమాణముతో పోల్చిచూచినచో, మరికొన్ని తృణధాన్యముల గింజలు చాల చిన్నవిగ నుండును. వీనిని 'చిరుధాన్యములు' అందురు. జొన్న, గంటె, చోడి, కొర్ర, ఆరిక, చామ, వరిగ, ఊద, దిసక మొదలగునవి చిరుధాన్యములు. గొలుగు గింజలు, వెదురు బియ్యము కూడ ఈ జాతిలోనివే. జొన్నలను సామాన్యముగా పెద్ద చిరుధాన్యములని వ్యవహరించుచుందురు.

చిరుధాన్యముల మొక్కలు సాధారణముగ చిన్నవిగ నుండును. వాటికి ఆకులు ఎక్కువగ నుండును. ప్రపంచమందలి ఉష్ణమండలములలోను, సమశీతోష్ణమండలములలోను చిరుధాన్యములు పైరులు విస్తారముగా సాగులోనున్నవి. అవి చాల తక్కువ కాలమున పంటకు వచ్చును. వాణిజ్యదృష్టిచే విశేష ప్రాముఖ్యము కలవి కాకున్నను, ఉష్ణమండల తృణధాన్యములలో చిరుధాన్యములు చాల ముఖ్యమైనవి. ఉష్ణమండలమున పొడిగానున్న ప్రదేశములలోని సవన్నాగడ్డి మైదానములలో పెరుగు కొన్ని ఆటవిక తృణజాతులనుండి నేటి చిరుధాన్యములలో కొన్ని ఉద్భవించినట్లు తెలియుచున్నది. వీటి ఆటవిక రూపములు ముఖ్యముగ మధ్య ఆఫ్రికాలో ఉష్ణమండలములలో నున్న గడ్డిమైదానములందు అగపడుచున్నవి. కరవు సమయములలో వీటిలో కొన్ని చక్కగా ఉపయోగపడు చున్నవి. ప్రజలు సాధారణముగా వీటి ధాన్యములను సేకరించి నిలవచేయుచుందురు. ఉష్ణమండలమున తడిగానున్న ప్రదేశములలో చోడి ముఖ్యమైన చిరుధాన్యము. ఇది మధ్య ఆఫ్రికాలోను, భారతదేశములోను మిగుల సాగులో నున్నది.

చిరుధాన్యములన్నియు పిండి, రొట్టె, అంబలి మున్నగు రూపములలో ప్రజలకు ఆహారముగా ఉపయోగపడుచుండును. మత్తు కలుగజేయు పానీయములు తయారుచేయుటకును, కోళ్ళకు ఆహారముగను ఈ చిరుధాన్యములన్నియు ఉపయోగపడును. గడ్డి పశువులకు మంచి ఆహారముగ ఉపయోగపడును. గంటె, చోడి, ఊద మొదలగు చిరుధాన్యపు సస్యములను కొన్నిచోట్ల ప్రత్యేకముగ