Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/761

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము = 3 699 చిన్నయసూరి పరవస్తు

వ్యాక ర్తలలో ప్రముఖస్థానము నొసంగి, ఆతనిని లాక్షణిక సార్వభౌముని గావించినది. నేడాంధ్రవ్యాకరణ గ్రంథ ములలో దేనికిని బాలవ్యాకరణమున కున్నంత ప్రచా రము లేదు. దానిపై వ్రాయబడినన్ని వ్యాఖ్యలు తెనుగు వ్యాక రణములలో ఏ యితర గ్రంథములపైనను వ్రాయ బడ లేదనినచో, దాని వైశిష్ట్యము కొంత తెలియును. ప్రాచీనాంధ్ర వ్యాకరణముల యందు ఆంధ్రశబ్ద చింతా మణి ఇతర వ్యాకరణముల ప్రచారమును తగ్గింప జేసినట్లే, బాల వ్యాకరణము తనకు ముందు ప్రచారమున నున్న వాని నొక్కమారుగా వెనుకకు నెట్టివేసినది. అంతే కాదు. ఆనాడు మొదలు చిన్నయసూరి యొప్పుకొన్న పదమే సాధువుగను, ఆత డనుశాసింపని రూపము అసాధువుగను భావింపబడజొచ్చినది. అయినను బాల వ్యాకరణ విరుద్ధము లయిన ప్రాచీన ప్రయోగములు లేకపోలేదు. సత్యము నకు, బాల వ్యాకరణకర్త ఆంధ్రభాషా సర్వస్వమును తన వ్యాకరణమునకు లొంగిపోవలె నని యాశింపను లేదు.

"దిక్రదర్శనముగఁ దెలిపెద నిందు ల క్షణముగానఁ బూర్వకవుల లక్ష్య ములను లాఁతి లక్ష్యముల గాంచి తక్కు ల క్షణ మెఱింగికొనుఁడు చతురమతులు"

అని చిన్నయసూరి తన గ్రంథము భాషా సామాన్యపు స్వరూపమును మాత్రమే చూపగలదనియు, ప్రయోగ విశేషముల సాధనమునకు ఇది యుద్దేశింపబడ లేదనియు, అట్టి వాని నెరుగగోరువారు ఇతర గ్రంథముల నరయ వలయుననియు వచించియున్నాడు. బాల వ్యాకరణము, దాని పేరును బట్టియే విద్యార్థులకు సులభముగా భాషా నియమములను దెలిపి సలక్షణమయిన వచనరచనమును అలవడ జేయుటకు ఉద్దేశింపబడినదని యెరుగనగును. ఈ విషయమునే చిన్నయసూరియును బాల వ్యాకరణ వీఠిక యందు స్పష్టముగా జెప్పియున్నాడు. విద్యార్థులకు సులభ ముగా బోధించుటయే గ్రంథకర్త లక్ష్యము గనుక తదను గుణముగనే చిన్నయసూరి ఈ బాల వ్యాకరణ రచనము సాగిపోయినది.

తనకున్న సంస్కృతాంధ్ర వ్యాకరణములందలి పాండి త్యమును, రచనానై పుణిని ఉపయోగించుకొని, చిన్నయ

సూరి బాల వ్యాకరణములోని సూత్రములను మిక్కిలి చక్కగా రచించెను. అంతేకాక, సంస్కృతమున భట్టోజీ దీక్షితులు కూర్చిన సిద్ధాంత కౌముది పద్దతి ననుసరించి సూత్రములును, సూత్ర వివరణములును, ఉదాహరణము లును క్రమముగా నుండునట్లు రచనము సాగించెను. అక్క డక్కడ సంస్కృత వ్యాకరణ మర్యాదలను ప్రవేశ పెట్టెను. సంజ్ఞాది పరిచ్ఛేదములుగా గ్రంథమును విభజించెను. తాను పూర్వము రచించిన వ్యాకరణములనుండియు, అంతకుపూర్వమే రచింపబడి ప్రచారమందుండిన అనేక ఇతర ఆంధ్ర వ్యాకరణములనుండియు తనకు వలసిన విషయములను గ్రహించెను. తన ప్రణాళికకు అనుగుణ ములు గాని వానిని వదలివేసెను. ఇవియన్నియు కలిసి బాలవ్యాకరణమున కొక విశిష్ట స్వరూపము నొసగి, దాని బహుళ ప్రచారమునకు కారణమయ్యెను. ఇది యంతయు సూరి తన ప్రతిభచే సాధించిన విజయమేకాని అన్యము కాదు .

సూరి బాల వ్యాకరణము, హరికారికలకు అనువాద మను నొక వాదము కొంతకాలము క్రింద కొందరిచే ప్రచా రము చేయబడెను. కాని వీరేశలింగము మొదలగువారు ఆ వాదమును ఖండించి, హరికారికలే బాల వ్యాకరణ సూత్రములకు సంస్కృతీకరణము లని సహేతుక ముగా ఏమయినను ఈనాటి గ్రాంథి నిరూపించియున్నారు. కాంధ్ర భాషాస్వరూపమును తీర్చిదిద్దిన ఘనత బాల వ్యాకరణ కర్త దనుట యథార్థము.

లక్షణకర్తగా చిన్నయసూరికి ఘనమయిన యశస్సు నొసగినది బాలవ్యాక రణము కాగా, రచయితగా, ఆతని కీర్తిచంద్రికలను వ్యాపింపజేసినది 'నీతిచంద్రిక'.

నీతిచంద్రిక సంస్కృత పంచతంత్ర, హితోపదేశము వెలసిన లాధారముగా తెలుగు భాషలో గ్రంథము. ఆంధ్రవచనము ఎంత బిగువుగా నడవగలదో రుచి చూపిన యు త్తమ రచన యది. సంస్కృతములోని హితోప దేశమునకుగాని, పంచతంత్రమునకుగాని రచనమునం దింత బిగువు కానరాదు. ఆ విధానము వేరు; ఈ విధానము వేరు. చిన్నయసూరి నీతిచంద్రికలోని వచన రచనమును ఆంగ్ల భాషయందు వ్యాసకర్తగా సుప్రసిద్ధుడయిన బేకన్ మహాశయుని ఆంగ్లవచనముతో పోల్చవచ్చును.