Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/760

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

చిన్నయసూరి పరవస్తు698 సంగ్రహ ఆంధ్ర

మున్నగు వచనరచనలును, విశ్వనిఘంటు టీక, అకారాది నిఘంటువు మున్నగు నై ఘంటిక రచనలును, పచ్చయప్ప నృపయళోమండనము, చాటుపద్యములు మున్నగు పద్య రచనలును చిన్నయసూరి వెలయించెను. వీటిలో కొన్ని సగములో నే విడువబడిన రచనలు ; మరికొన్ని సంకలన గ్రంథములు; కొన్ని యాంధ్రీకరణములు. ఇవియన్ని యును కాక సూరి 'సుజన రంజని' యను నొక సాహిత్య పత్రికను గూడ స్థాపించి కొంత కాలము నడి పెనట. సూరి వ్రాయనారంభించిన ఈ గ్రంథము లన్నియు పూర్తి యయియున్నచో, ఆంధ్రభాషకు అవి అమూల్యాలం కా రములయి యుండుననుటలో సందేహము లేదు.

చిన్నయసూరి రచనలలో వ్యాకరణమును గురించిన వే యెక్కువ. కొలదిగానున్న అతని పద్యములను పరిశీలించి సూరి మహాకావ్య నిర్మాణము నొకదానిని చేసి యుండిన, ఆతని కదియును గొప్ప కీర్తిని కలిగించియుండు ననిపించును. సూరి సంస్కృతాంధ్రములు రెంటను రసవ త్కవిత వ్రాయగల నేర్పరి. అంతేకాదు, సూరి యెందు లకోగాని, తాను వ్రాయదలచుకొన్న సూత్రాంధ్ర వ్యాక ర ణమును సై తము సంస్కృతములోనే ఆరంభించినాడు.

ఈ సూత్రాంధ్ర వ్యాకరణమును, బాలవ్యాకరణము నకు పూర్వమే సూరి రచించెను. అయినను ఇది విద్యార్థి జనులకు భాషా లక్షణమును సులభముగా తెలుపజాలనిదని భావించి, సూరి అందలి సూత్రములనే కొన్నింటిని తెనిగించి బాలోపయోగముగా బాలవ్యాకరణమును ముందుగా ప్రకటించెనట. ఈ విషయమును చిన్నయసూరి, “మును మదుపజ్ఞం బగుచుం దనరిన వ్యాకృతిని సూత్రతతి యొక కొంతం నుంచి యిది ఘటించితి ననయము బాలావబోధమగు భంగి దగన్." అని బాలవ్యాకరణము చివర వచించెను. సూత్రాంధ్ర వ్యాకరణమును ఆతడు పూర్తిచేసి ప్రకటనానుకూలముగ సిద్ధము చేసినట్లు కానరాదు. ఇందు బాలవ్యాకరణ సూత్ర ములకు మూలము లయిన సూత్రము లనేకములు కలవు. ఇందుగల కొన్ని సూత్రములకు బాలవ్యాకరణమునం దనువాదములు కనుపింపవు. కొన్ని సూత్రములు ప్రౌఢ వ్యాకరణ సూత్రములకు మూలములా ? అనదగినవిగా గనుపట్టుచున్నవి. ఇందు గ్రంథారంభమున సూరి “శాసన మిదం దిగ్భ్రాదర్శకమ్" అని సూత్రించి, "అజ్ఞాత దిశం దేశం జిగమిషోః పార్థస్య మార్గం పృచ్ఛతః పురుషేణ కేన చి దేవం యా హాతి హస నిర్దేశన దిశో దర్శనవ దం శాసనమధి జిగమిషూణాం ప్రథమ ప్రవృత్తా వుపకారకం. భవతీత్యర్థః" అని దానిని వివరించినాడు. అనగా శాస్త్రము దిష్ప్రదర్శనమే కాని సమగ్రముగా శాసకము కాదనుట. ఇందు సూత్రములు, సూత్ర వివరణములు కొన్ని యెడల నుదాహరణములు మాత్రమే కాక, అక్కడక్కడ కొన్ని శ్లోక రూప కారికలును గలవు. సూరిరచిత వ్యాకరణము లలో మరియొక విస్తృత ప్రణాళికగల గ్రంథము ఆంధ్ర శబ్దానుశాసనము.

ఆంధ్రశబ్దానుశాసనమునందు సంజ్ఞ, సంధి, తత్సమ, ప్రకీర్ణక క్రియా, తద్భవ పరిచ్ఛేదములు కలవు. ఇది చింతామణి సంప్రదాయములను బాలవ్యాకరణము కంటె ఎక్కువగా పాటించి రచించిన వ్యాకరణము. ఇందు యశ్రుతియును, గ్రామ్యముతోగూడ భాషకు చతుర్విధత్వమును. హలంత శబ్దములలో గుణవదాన్య గుణవదాది విభజనమును గాననగును. సూత్రాంధ్ర వ్యాకరణములోని సూత్రములకు అనువాద సూత్రము లును, చింతామణి సూత్రానువాదములును ఇందు గలవు.. అయినను ఇందు కొంత స్వతంత్రత లేకపోలేదు. కొన్ని సూత్రములు బాలవ్యాకరణ సూత్రములను పోలియే యున్నవి. కాని వాటికి బాలవ్యాకరణ సూత్రముల కున్నంత బిగువు కానరాదు. ఆ బిగువును సాధించుటకు చిన్నయసూరి కావించు ప్రయత్న మిందు కాననగును. అయినను

చిన్నయసూరి మరియొక పద్యాంధ్ర వ్యాకరణమును రచించెను. దీనిలో నలువది యెనిమిది పద్యములు గలవు. ఇది అసమగ్రము. మొత్తముమీద బాల వ్యాకరణము కా ఇతడు ఎనిమిది తొమ్మిది వ్యాకరణములను అంతకుముందు రచించినట్లు తెలియుచున్నది. ఇట్లెంతో కాలము వ్యాకరణరచనమునకు తన శక్తిని వినియో- గించినవా డగుటచేత నే, చిన్నయసూరి బాలవ్యాకరణ మును అంత చక్కగా రచింపగలైనట. బాలవ్యాకరణ రచన మే చిన్నయసూరికి ఆంధ్ర