చిత్రవస్తుప్రదర్శనశాలలు
ఆయన ప్రశస్తతర పద్ధతులపై పురావస్తు పరిశీలనమును క్రమబద్ధ మొనర్చెను. సర్ జాన్ మార్షల్ పెక్కు వర్ష ములవరకు ఈ శాఖకు అధిపతిగా నుండెను. ఆయన వివిధ చిత్రవస్తు ప్రదర్శనశాలల నిర్మాణమునకు కారకు డయ్యెను. ఆయన బిజాపూరు, జారిపడా, చండా, అజ్మీర్, ఖజురాహో, గ్వాలియర్, సాంచీ అను తావు లలో చిత్రవస్తు ప్రదర్శనశాలలను నెలకొల్పెను. పురా వస్తు పరిశీలనమునకై త్రవ్వకములు జరిగినచోట చిత్ర వస్తు ప్రదర్శనశాలలను నెలకొల్పుట భారత ప్రభుత్వపు విధానముగా నుండెను. కలకత్తాలో ఇండియన్ మ్యూజి యములో భూగర్భశాస్త్రము, మానవశాస్త్రము, జంతు శాస్త్రము మొదలగువానికి సంబంధించిన ఉత్తమ శాఖలు కలవు. పురావస్తుశాస్త్ర శాఖ మిక్కిలి బాగుగా అభివృద్ధి గాంచెను. పురావస్తుశాస్త్రము అతి విపులమైన విషయము. ఇది ప్రాక్చారిత్రక యుగము నుండి కూడ మానవ సంస్కృతీ విశేషములకు చెందిన ప్రతి శాఖ విషయము ఇందు చేరగలదు. కావున పురావస్తుశాస్త్రమును పౌర్వాపర్య క్రమబద్ధ మొనర్చుట అత్యంతావశ్యకము. కలకత్తా ఇండి యన్ మ్యూజియమునందు సాటిలేని ప్రాచీన హైందవ వస్తు సంగ్రహణము కలదు. ఇది వివిధ దశల యందలి హిందూ సంస్కృతికి దర్పణము. ఇందలి ప్రాచీన వస్తు వులు అర్థవంతముగను, ఆకర్షకవంతముగను ప్రదర్శింప బడినవై, పండిత పామరులకు ముదము గొల్పుచుం డును. ఈ మ్యూజియము నందలి శిలాప్రతిమాశాలలు మిక్కిలి సుసంపన్నమైనవి. ఇవి కచ్చితముగా చరిత్ర క్రమము ననుసరించి అమర్పబడుట అవసరము. అయినను స్థలసంకోచము ప్రతిబంధకమైనది. ఐనను అవి మౌర్య, శుంగవంశ రాజయుగములకు సంబంధించిన వివిధ దళా వళులను భార్ హట్, మధుర, అమరావతి, భూమార సారనాథ్, బీహార్, బెంగాలు మున్నగు తావులందలి గాంధార శిల్పపరంపరను సమగ్రముగా వివరించుచున్నవి. ఒరిస్సా దేశపు శిలా ప్రతిమల సంగ్రహణము కూడ సుందర ముగా నున్నది. నేపాళము నుండి, టిబెట్ (త్రివిష్టపము) నుండి, దక్షిణభారతము నుండి సేకరించబడిన భారతీయ కాంశ్య ప్రతిమలు సుందరముగా ప్రదర్శించబడినవి. 688 సంగ్రహ ఆంధ్ర భారతీయ నాణెముల సంచయము ప్రపంచ మంతటి లోను అమూల్యమైనది. కెంపులు, సువర్ణాభరణములు, షాహజహాన్ చక్రవర్తి భూషణములు ఈ సేకరణలో నున్నవి. శిలాశాసనములు, తామ్రశాసనములు బహుళ ముగా నున్నవి. అరబ్బీ, పార్శీ శాసనములు, శిల్ప కళా ఖండములు, మెరుగు పెట్టబడిన పెంకులు, ప్రకాశమాన ములైన వ్రాతప్రతులు, పూర్వభారతమున మిక్కిలి ప్రసిద్ధిచెందిన ముస్లిమ్ స్మారక చిహ్నములలో కొన్నింటి చిత్రపటములు ముస్లిం శాఖలో అమర్చబడినవి. మద్రాసులోను, బొంబాయిలోను గల చిత్రవస్తు ప్రదర్శనశాలలు మిక్కిలి బాగుగా రూపొందించబడినవి. ఇవి ఆ యా రాష్ట్రప్రభుత్వముల శ్రద్ధచే అభివృద్ధి చెందు చున్నవి. మద్రాసు మ్యూజియమునందలి ప్రాక్చారిత్రక యుగమునకు చెందిన వస్తుసంగ్రహణము. బొంబాయి మ్యూజియము నందలి ప్రకృతిశాస్త్ర విభాగస్థమయిన వస్తుజాతము చూపరులకు ప్రత్యేకాభిరుచిని క ల్పించునవిగా నున్నవి. నాగపూరు పాట్నాలలోని చిత్రవస్తు ప్రదర్శన శాలలు కూడ ప్రశంసనీయములైనవే. ఆగ్రాలోని టాజ్ మ్యూజియము, సారనాథ్ మ్యూజియము, ఢిల్లీ కోటలోని మ్యూజియము, నలందా యందలి వాస్తుశాస్త్ర మ్యూజి యముల వంటివి కొన్ని మ్యూజియములు స్థానికముగా సేకరించబడిన ప్రాచీన వస్తువులతో అలరారుచున్నవి. ఈ వస్తువులు అత్యుత్తమమైన శిల్పనై పుణికిని, అభిరుచికిని తార్కాణములు. హైద రాబాద్ మ్యూజియము, అందలి అజంతామండ పము విస్తారయశము నందినవి. అజంతా గచ్చువర్ణ చిత్ర ములు, పార్సీ, అరబ్బీ వ్రాతప్రతులు, శిలా ప్రతిమలు, చరిత్ర పూర్వయుగపు ప్రాచీన వస్తువులు ప్రత్యేకముగా ఎన్నదగినవి. హైదరాబాద్ లోని సాలార్ జంగ్ మ్యూజి యము సాలార్ జంగ్ ప్రాసాదములో ఏర్పాటు చేయ బడినది. ఈ చిత్రవస్తు ప్రదర్శనశాల నిస్సంశయముగా గొప్ప విలువయు, వైవిధ్యమును కలది. మూడు పురు షాంతరములనుండి కళావిమర్శకాగ్రేసరులచే కావింప బడిన ఈ సంగ్రహణములు సంస్కృతికి చెందిన ప్రతి శాఖకు దర్పణములు, యూరపు ఖండమునకును ప్రాచ్య దేశములకును చెందిన వర్ణచిత్రములు, చైనా దేశపు