Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/749

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము - 3 87 689 చిత్రలేపనసామగ్రి

పింగాణి వస్తువులు, 'జాడె' అను నొక పచ్చరాయితో నిర్మింపబడిన వస్తువులు, తుపాకులు, ఆయుధములు మున్నగువాని సంగ్రహణము కొనియాడతగియున్నది.

కలకత్తాలోని విక్టోరియా మ్యూజియము, లేక క్రొత్త ఢిల్లీ లోని గాంధీస్మారక మ్యూజియము వంటివి కొన్ని చిత్రవస్తు ప్రదర్శన శాలలు జీవిత చరిత్రకు ప్రాధాన్య మిచ్చుచున్నవి.

చిత్రవస్తు ప్రదర్శనశాలలు జీవముతో తొణికిసలాడు చుండు నిర్మాణములు. అవి పెరుగుదల పొందదగినవి. వస్తువుల ప్రదర్శనము, ప్రాతినిధ్యము ఎల్లప్పుడు నిలు కడ కలిగి ఒకేరీతిలో నుండరాదు. జాగ్రత్తగ అవగాహ నము చేసికొని పరిస్థితుల కనుగుణముగా వాటిని మార్చు చుండవలెను. చారిత్రకాభిరుచికి మాత్రమే చెంది యుండని చిత్రవస్తు ప్రదర్శనశాలల విషయమున పై నియమము ముమ్మాటికి యధార్థము. మ్యూజియము వ్యవస్థ కంతటికి వెనుక పరిశీలనయుత మైన దృష్టి యుండవలెను. చిత్రవస్తు ప్రదర్శనశాల ఎన్నటికిని గిడ్డంగిగా గాని, గోదాముగా గాని దిగజారకూడదు.

చిత్రవస్తు ప్రదర్శన శాలలలో జాగ్రత్తగా తయారు చేయబడిన గ్రంథ సూచికలుండవలెను. ఇవి మంచి వివరణములతోను, బొమ్మలతోను అచ్చై యుండవలెను. ఇటువంటి వస్తు సూచికలు చిత్రవస్తు ప్రదర్శనశాలలలో ప్రదర్శనమునకు ఏర్పాటుచేయబడిన వస్తువులను గురించి పండితులకు, పామరులకు బాగుగా తెలియపరచగలవు. వారు ఒకానొక నిశ్చితమైన ఆకాంక్షతోను, లక్ష్యము తోను చిత్రవస్తు ప్రదర్శనశాలకు వచ్చుటకు తోడ్పడును.

బ్రిటిష్ మ్యూజియమునందు నాణక శాస్త్రము, చెక్క డపు పనులు, వర్ణ చిత్రములు, వ్రాత ప్రతులు, మొద లైనవాటి బోధన కొరకు సమర్ధముగా కూర్పబడిన అనేక సూచిక లున్నవి. బోస్టన్ మ్యూజియములోను, ప్యారిస్ నందలి మ్యూసిగ్విమెట్ చిత్ర వస్తు ప్రదర్శనశాలలోను కల వస్తువుల పట్టికలు శ్రేష్ఠతయందు ఉన్నత శ్రేణికి చెందినవి. ఇండియన్ మ్యూజియము (కలకత్తా) నందును ఢిల్లీ మ్యూజియము నందును, గ్వాలియర్, లక్నో, మధుర, సాంచి, సారనాధ్ అను తావులందుగల చిత్ర వస్తు ప్రదర్శన శాలలలోను, ఉత్తమమైన వస్తు పట్టికలు కలవు.

కవిలెభాండారములు చిత్రవస్తు ప్రదర్శనశాలలు అను రెంటికిని సర్వసాధారణములైన విషయములు అనేక ములుకలవు. ఈ రెంటికిని అగ్నిభయరహిత మైన సుందరభవ నములు ప్రశాంత నిశ్శబ్ద ప్రదేశమున నిర్మింపబడ వ లెను. రెండింటియందును వస్తువులను ప్రదర్శించుటకై శాస్త్రోక్త మైన సంష్టీకరణ ముండవలెను. రెండింటి యందును వస్తు వుల విషయమున నిర్దుష్టమును కచ్చితమునైన భావము లను వెలిబుచ్చు గైడులు (guides), సూచికలు ఆవశ్యక ములు. కవిలెఖాండారములు వాఙ్మయశాఖకు మాత్రము సంబంధించియుండును. ఇక చిత్రవస్తు ప్రదర్శనశాలలు అన్ని లలితకళలతోను సంబంధమును కలిగియుండును. చిత్రవస్తు ప్రదర్శనశాలలలో ప్రదర్శింపబడిన వస్తువు లన్నియు సంస్కృతియొక్క వివిధరంగములందు మానవు డధిరోహించిన శిఖరములకు ప్రతినిధులు. ఇక కవిలె భాండారము లన్ననో, అధికారస్థులు బుద్ధికాళ లమునకు సాక్షీభూత మై క్రమపద్ధతి ప్రకారము సమగ్రముగా వ్రాసి పెట్టబడిన దస్తావేజులు. చిత్రవస్తు ప్రదర్శనశాలలతో పోల్చినప్పుడు కవిలె భాండారముల వ్యాప్తిరంగము పరిమితమైనదే కాగలదు. కాని అవి అతిమాత్రముగా ప్రత్యేకత గన్నవి; కేంద్రీకరించబడినవి. అవి వివిధ శాఖా విభాగములచే దురవగాహములు. చిత్రవస్తు ప్రదర్శనశాలలు ప్రేక్షకునియొక్క రసపిపాసకు అత్యంత దోహద కారులు. ఇక కవిలె ఖాండారములో, మానవ జీవితములోని జిజ్ఞాసకును, వ్యావహారి కావసరములకును ఉపయోగించును. ఈ రెండు వ్యవస్థలును మానవుని మేధస్సుయొక్క క్షణభంగురములును, దుర్గాహ్యములు నగు వ్యాపారములను, దశలను అందుకొనుటకు యత్నిం రెండు వ్యవస్థలును వాటికి ప్రత్యక్ష గోచరమగు శాశ్వతత్వమును కల్పించు లక్ష్యముతో ప్రవర్తించును.

ఆర్. ఎమ్. జో.


చిత్రలేపనసామగ్రి :

ప్రాచీనకాలమునుండి మానవుడు వర్ణచిత్రములను రచించుచునేయుండెను. గ్రీసు, ఈజిప్టు, భారత దేశముల యందలి దేవాలయ కుడ్యములు, అందలి విగ్రహములు