Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/747

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము – 3 చిత్రవస్తుప్రదర్శనశాలలు

మైన శిలావిగ్రహములు సంగ్రహణమునకును ప్రసిద్ధి చెందినది. ఇక్కడి నూతన వస్తు ప్రదర్శనశాల కూడ గ్రీసుదేశపు చలువరాతి బొమ్మలకు పేరొందినది. కంచు విగ్రహములును, కట్టెమీద, లోహములమీద తొలిచిన ప్రతిమలును, ఈజిప్షియను కళానిధానముల విశిష్ట సంగ్ర హణములును దీనిలో కలవు. రష్యాలోని చిత్రవస్తు ప్రదర్శనశాలలు మిక్కిలి గొప్పగా అభివృద్ధి నొందినవి. ప్రతి సంవత్సరము క్రొత్త మ్యూజియములు స్థాపించబడు చున్నవి. సై బీరియాలోని దూరప్రదేశములలో సై తము మ్యూజియముల సంఖ్య పెరుగుచున్నది. సెంట్ పీటర్స్ బర్గులోని హెర్మిటేజ్ ప్యాలెస్ లో నమ్మశక్యము గానంత విలువకల మధ్యయుగ కళాసంపద సమకూర్పబడినది. అందు అత్యంత పురాతన యుగకళను దృష్టాంతీకరించు సువర్ణ, రజత నిర్మితములగు వస్తువు లున్నవి. చేతి పనితన ములోని నై పుణ్యముయొక్క గొప్ప ప్రగతిదశను రుజువు చేయుచు ఉత్తమ తరగతికి చెందినట్టి సిథియా, క్రిమియా, క కేషియా దేశములు ఆభరణములుకూడ ఇందు పొందు పరచ బడినవి. మాస్కోలోని పారిశ్రామిక చిత్రవస్తు ప్రదర్శనశాల అచట శిక్షను పొందు ఆకృతి రచయితల పై మంచి ప్రభావమును పై చినది.

అమెరికాలో చిత్రవస్తు ప్రదర్శనశాలలు సర్వసామా న్యముగా ఉండును. వాటి సంఖ్యయు పెద్దది. అవి ఎట్టి ఐతిహ్య సంప్రదాయమునకు చెందినవి కావు. కావున వాటినిగూర్చి శాస్త్రీయమైన ప్రశంస చేయుటకు ఎక్కువ అవకాశము ఉన్నది. వాషింగ్టన్ లోని జాతీయ చిత్ర వస్తు ప్రదర్శనశాల ప్రధానముగా చారిత్రకావ శేషము లకు ప్రసిద్ధి చెందినది. ఆ నగరమునందే యున్న స్మిత్ సోనియన్ ఇన్ స్టిట్యూటు తత్తుల్య సంగ్రహణములను కలిగి యున్నది. బోస్టన్ లోని లలితకళా చిత్రవస్తు ప్రదర్శనశాల సర్వాంగసంపూర్ణమైనది. విస్మృతకళ యొక్క శ్రేష్ఠ మైన పునర్నిర్మాణములతో పాటు అద్భుతమైన మృణ్మయవస్తు సంచయము కూడ అందున్నది. ఈజిప్టుదేశపు పురావస్తు సంపదకు 'గిజేహ్' మ్యూజియము ప్రఖ్యాతిగాంచినది. ఇది మారియట్ బే చే స్థాపింపబడి మాస్పెరోచేత అభివృద్ధి కావింపబడినది. ఇది జాతీయ చిత్రవస్తు ప్రదర్శనశాలలలో అత్యుత్తమ మైనది. 1890 వ సంవత్సరమున నిర్మింపబడిన విశాల భవనములలో ఇది స్థాపింపబడి యున్నది. ఇది బాగుగా వర్గీకరింపబడినది. దీనికి విరివిగా ఆర్థికావలంబము చేకూరినది. క్రొత్త సేకరణలు దీనిలో విరివిగా కలవు.

హిందూ దేశమునందలి చిత్రవస్తు ప్రదర్శనశాలలు బ్రిటిష్ వారి ప్రోత్సాహమున అభివృద్ధిచెందినవి. హిందూ దేశమందు ఆత్యంతాద్యమైన చిత్రవస్తు ప్రదర్శనశాల 1796 లో స్థాపిత మైనది. అప్పుడు కలకత్తాలోని బెంగాలు ఏషియాటికీ సొసై టీ వారి మందిరమున పెక్కు వింత వస్తు వులు పదిలపరుచబడినవి. మదరాసులో ఒక చిత్రవస్తు ప్రదర్శనశాలను స్థాపించుటకు 1819 లో ప్రయత్నములు చేయబడినవి. కాని 1846 లో తూర్పు ఇండియా కంపెనీ వారు ముఖ్యవస్తువుల నన్నిటిని సంపాదించి, ఒక చోట కేంద్ర సంస్థగా ఏర్పాటు చేయుటకు సంకల్పించిరి. ఆ సంకల్ప ఫలితముగా 1851 లో మదరాసు ఫోర్టు సెంటు జార్జి కోటలోని కాలేజియందు కేంద్ర చిత్రవస్తు ప్రదర్శన శాల ఆవిర్భవించెను. 1858 వరకును అనగా కంపెనీ పరి పాలనము సార్వభౌమ ప్రభుత్వము యొక్కయు, రాష్ట్ర ప్రభుత్వముల యొక్కయు హస్తగత మగువరకును చిత్ర వస్తు ప్రదర్శనశాలల విషయమున కంపెనీవారి ఉత్సా హము పెరుగజొచ్చెను. హిందూ దేశమందలి చిత్రవస్తు ప్రదర్శనశాలలు ప్రధానముగ పురావస్తుశాస్త్ర పక్షపాత మును చూపుచున్నవి. అయినను 1847 లో హిందూ దేశపు చిత్రవస్తు ప్రదర్శనశాలలను పరిశీలించిన ఒక ప్రేక్షకుడు వీనిలో ప్రకృతిశాస్త్రము అగ్రస్థానము నాక మించి యున్నదని అభిప్రాయపడినట్లు తెలియుచున్నది. హిందూ దేశమునందలి పురావస్తు సంభారముల ప్రాధా న్యము కల పెద్ద చిత్రవస్తు ప్రదర్శనశాలలలో కలకత్తా యందలి ఇండియన్ మ్యూజియము, బొంబాయి యందలి ప్రిన్స్ ఆఫ్ వేల్సు మ్యూజియము, మదరాసు, లక్నో, పాట్నా (పాటలీపుత్రము), నాగపూరులోని మ్యూజియ ములు ఇట్టివి మరికొన్ని పేర్కొనదగినవి. పురావస్తు శాస్త్ర పరిశీలనకృత్యము పురోగమింప వెంటనే కలకత్తాలోని చిత్రవస్తు ప్రదర్శనశాలలో గాంధార శిలాప్రతిమలకు స్థానము చేకూరెను. మొదలిడిన

కర్జన్ ప్రభువు ప్రాచీన హిందూ దేశ చరిత్ర విషయ మున సమున్నతో త్సాహము కలవాడుగా నుండెను.