Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/746

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చిత్రవస్తుప్రదర్శనశాలలు

సంగ్రహ ఆంధ్ర

శాల లున్నవి. వాటిలో బ్రిటిష్ మ్యూజియము, విక్టోరియాఆల్బర్ట్ మ్యూజియము అనునవి అత్యంత పురోగామి చిత్రవస్తు ప్రదర్శనశాలలు. బ్రిటిష్ మ్యూజియము విశేషముగా పురాతత్వ శాస్త్రమునకు సంబంధించినది. అందు అనేక కళానిక్షేపములు, పోతబొమ్మలు, వ్రాత ప్రతికృతులు, వైద్యుత ముద్రణ చిత్రములు ఉన్నవి. ఈచిత్రములలో కొన్ని మూలప్రతుల నుండి గుర్తుపట్టరానంత నేర్పుతో కల్పించబడినవి. బ్రిటిష్ మ్యూజియములో 75,000 ప్రతులు గల కళాగ్రంధ భాండాగార మున్నది. 2,50,000 ముద్రణములు కలవు. ఈ చిత్రవస్తు ప్రదర్శనశాలను నిర్వహించుటకు సమర్థవంతమైన సిబ్బంది కల్పింపబడినది. చిత్రవస్తువుల కొనుగోలు కొరకు విరాళము లివ్వబడు చున్నవి. స్థానికములు, ప్రాంతీయములు ఐన చిత్రవస్తు ప్రదర్శనశాలలకు కళాఖండములు ఒక నిర్ణీత కాలవ్యవధిలో తాత్కాలికముగ అరువు ఇయ్యబడును. ఈ పద్ధతి శీఘ్రముగా పెరుగుచున్నది. ఎందుచేత ననగా వివిధమండలములు, దేశములు చేసిన సహాయమునకు ప్రతిఫల మొసగుటకు మార్గాంతరములేదు. విక్టోరియా - ఆల్బర్టు మ్యూజియము కూడ మిక్కిలి సంపన్నమైనది. దాని మూలసిద్ధాంతము కళను పరిశ్రమకు అనుబంధింప జేయుటయై యున్నది. కళకు సంబంధించిన అందమైన పెక్కు సంగ్రహణములు దీనికి చేర్చబడినవి. బ్రిటిష్ మ్యూజియమంత బాగుగా ఇది సంవిభాగ సంపన్నము కాలేదు. కాని ఆంగ్లదేశపు ప్రభువుచే బదులుగా ఇవ్వబడిన 'రాఫేల్ ' వ్యంగ్య చిత్రములతో సహా చిత్ర పటములు, నేతరకములు, పట్టు నేత వస్త్రములు, జలతారు అల్లిక పనులు, పింగాణి పాత్రలు, ఎనామిల్ సరకు, దంత వస్తువులు, రూపనిర్మాణ కళాత్మక ఖండములు, లోహమయములు, దారు వికారములు, ప్రాచ్య ఖండముల నుండి సేకరించబడినవి. ముఖ్య వస్తువుల సౌందర్యము, అలంకరణాకర్షణము ఇక్కడ ప్రదర్శితములగు ముఖ్యలక్షణములై యున్నవి.

యూరపుఖండమందలి చిత్ర వస్తు ప్రదర్శనశాలలు కళాఖండముల సంగ్రహణవిషయమున వీనికన్న సంపన్న తరములును ; గురుతర వైవిధ్యము కలవియు నై యున్నవి. జర్మనీలో, మ్యూజియములయొక్క విద్యా విషయక లక్షణములు మిక్కిలి ని పుణముగా ఆలోచించబడినవి. ఇటలీదేశము నందలి సార్వజనీన సేకరణములు ఇంగ్లండులో నున్న వానికంటె సంఖ్యలో పదిరెట్లు అధికముగా నున్నవి. ఇవి ముఖ్యముగా జాతీయమైన ఆస్తిగా పరిగణింపబడుచున్నవి. వియన్నా, ఆమ్‌ష్టర్‌డామ్, జూరిక్, మ్యూనిక్‌లలోను, ఈజిప్టులోని గిజేహ్ వంటి చోటులందును అసామాన్య చిత్రవస్తు ప్రదర్శనశాల లున్నవి. ప్యారిస్ నగరములోని “మ్యూస్ కార్నావాలెట్" అను చారిత్రక చిత్రవస్తుప్రదర్శనశాల ప్రపంచములో అత్యంతము పరిపూర్ణమైన నాగరక చిత్రవస్తు ప్రదర్శనశాల. ఫ్రాన్సు కేంద్ర చిత్రవస్తుప్రదర్శనశాల “లూవ్రే” అనునది ఫ్రెంచి విప్లవ సమయమున స్థాపించబడినది. దీనిలో మొదటి ఫ్రాంకోయీ, పదునాలుగవ లూయీ, నెపోలియన్ చక్రవర్తుల సంగ్రహణములున్నవి. ఇందు అధికసంఖ్యగల సంగ్రహణములు చేర్చబడినవి. అందుచే సాధారణముగా ప్రేక్షకులతో ప్రదర్శనశాల క్రిక్కిరిసియుండును. ఇందు వెలుతురు ఏర్పాటు కూడ సంపూర్ణముగాలేదు. ఇటలీలో గల చిత్రవస్తుప్రదర్శనశాలలు అసంఖ్యాకములు. మిక్కిలి బాగుగా అమర్చబడి నటువంటియు, సర్వోత్తమముగా వర్గీకరించబడినట్టియు సంగ్రహణములు నేపిల్స్‌లోని మ్యూజియోనాజియో నేల్ అనుచోట కనబడును. నేపిల్స్‌యొక్క అవ్యహిత, సన్నిహిత ప్రాంతములనుండియే ముఖ్యముగా సేకరించ బడిన రోమక కళాఖండములు వేల సంఖ్యలో ఇందు కానగును.

ఆమ్‌స్టర్‌డామ్‌లోని 'రిక్స్ మ్యూజియము', దాని ఏర్పాటును బట్టి మిక్కిలి విశిష్టమైనది. దీనిలో వరుస వారీగా గదులున్నవి. వీటియందు విభిన్న కాలిక ములయి నడచే కళా సంప్రదాయములకు చెందిన నమూనాలు ఒక్క వీక్షణమున గోచరించును. బెర్లిన్, వియన్నా నగరములయందు అగణ్య వస్తుసంపదగల చిత్రప్రదర్శనశాలలున్నవి. చిత్రశాలా శిల్ప కళాఖండములతోపాటు పురాతన క్రైస్తవ కళాఖండ సముదాయముకూడ సంపూర్ణముగా కొనియాడతగియున్నది. బెర్లిన్‌లోని పురాతనమైన చిత్రవస్తు ప్రదర్శనశాల ప్రాచీనమైన చెక్కడపు ప్రతిమలకును, ఇటాలియన్ కళ చక్కగా ప్రతిబింబిత

686