Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/745

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము - 3

చిత్రవస్తుప్రదర్శనశాల అన నెట్లుండవలెనో మనకు తెలుపుచున్నవి.

చిత్రవస్తుప్రదర్శనశాల సక్రమమును, శాస్త్రీయము నైన పద్ధతులపై నిర్మింపబడవలెను. ఏ ఉద్దేశములతో వస్తు సంగ్రహణము చేయబడుచున్నదో అది స్పష్టముగా నిర్వచింపబడవలెను. ప్రదర్శనమునకు అమర్చిన వస్తువులు వర్గీకరింపబడి జాబితా చేయబడవలెను. అవి సంఖ్యా బద్ధములు వాటిమీద గ్రంథసంబంధ మైన వివరము గల చీటీ ఉండవలెను. ప్రతి వస్తువు యొక్క శోభ హెచ్చునట్లును, ప్రేక్షకులకు గొప్ప సదుపాయము, సౌకర్యము కలుగునట్లును ప్రదర్శనము జరుగవలెను. కావలెను.

వస్తువులను వర్గీకరించుటలో గమనింపదగిన ముఖ్య సూత్రము లేవి అను' ప్రశ్న బయలుదేరును. వస్తువులు చారిత్రకములు, వస్తుగతములు. కొన్ని వేళలలో అవి జాతిబద్ధములుకూడ కావచ్చును. కాని ఈ లక్షణములలో కొన్ని ప్రాయశః అతివ్యాప్తి (overlap) చెందవచ్చును. చరిత్ర ననుసరించిన వర్గీకరణము మనుష్యకాశలము అభివృద్ధి చెందిన జాడలు కని పెట్టుటకు సహకరించును. కలపతో నిర్మితములైన గీత వాద్య పరికరములను, కలప వస్తువుల క్రిందను, గీతవాద్య పరికరముల క్రిందను, వర్గీక రింపవచ్చును. జంతుశాస్త్ర, పక్షిశాస్త్రములకు సంబం ధించిన చిత్రవస్తు ప్రదర్శనశాలలయందు గడ్డి నింపిన క ళేబరములను (Stuffed Skins) ప్రదర్శించు సందర్భ మున వాటికి సరియైన వాతావరణమును, వాటికి తగిన వస్తువులతో పొత్తును కల్పించుటకు ప్రయత్నములు చేయ బడుచున్నవి. భిన్న దేశములనుండి వచ్చిన సమానమైన వస్తువులను ప్రదర్శించునపుడు అవి జాతీయతను గాని, ద్రవ్య స్వభావమును గాని అనుసరించి వర్గీకరించబడు చున్నవి. మ్యూజియములలో దీపముల ఏర్పాటు శక్య మైనంత సంపూర్ణముగను, సమృద్ధిగను ఉండవలెను.

అన్ని మ్యూజియములలోను వర్గీకరణమునందు ఏక రూపత ఉండవలెను. యూరపుఖండములోని ప్రతిదేశ మును స్వీయపద్ధతి నవలంబించుచున్నను ఇంగ్లండులో ఏక రూపత పాటింపబడుచున్నది. వర్గీకరణము వివేచనా పూర్వకముగా చేయవలెను. అది నిరంకుశముగా ఉండ కూడదు. భూగర్భశాస్త్రము, మానవశాస్త్రము, వాస్తు శాస్త్రము, శిల్పశాస్త్రము, వర్ణచిత్ర రచనము, ఖగోళ శాస్త్రము, జంతుశాస్త్రము, పక్షిశాస్త్రము మొదలగు ప్రతి విజ్ఞానశాఖయు చిత్రవస్తు ప్రదర్శనశాలలో జాగ రూకతతో ప్రదర్శింపబడవచ్చును. వివరణ పటములు, రేఖా గారతో చేయబడిన ఆకృతులు, నమూనాలు, కృతులు తదితర చిత్రములు వస్తువుల యొక్క నష్టమైన అవాంతరదశలను చూపుటకు ఉపయోగపడును. శాస్త్రో క సంవిభాగములు గల భవనములలో చిత్రవస్తుశాలల నుంచ వలెను. యూరవుఖండమం దంతటను అనేక పురాతన భవనములు సంపాదింపబడి, చిత్రవస్తు ప్రదర్శనశాలలకు అనువుగా మార్చబడినవి. ఇంగ్లండులో మాత్రము చిత్ర నస్తు ప్రదర్శనశాలా నిర్మాణమునకు పెద్ద మొత్తములు వ్యయపరచబడినవి. పెద్ద భవనము లభ్యమై సర్వత్ర అమర్చుటకు తగినన్ని చిత్రవస్తువులు లేకపోయినచో కాశీ స్థలములను రెండవ తరగతి నమూనాలతో నింపవలసి వచ్చును. అప్పుడు రెండవ తరగతి నమూనాల రాశి ముందు కొలదిమాత్రపు రమ్యవస్తువులు చూడ ముచ్చ ట నుండవు. ఇతర అనుమాన

గ్రేట్ బ్రిటన్ లో చిత్రవస్తు ప్రదర్శనశాలలు గొప్పగా అభివృద్ధిచెందినవి. బ్రిటిష్ మ్యూజియము ప్రపంచములో ఉత్తమో త్తమమైన వాటిలో ఒకటి. ఈ మ్యూజియమును స్థాపించునప్పుడు చేయబడిన శాసనము (1751) యొక్క పూర్వ పీఠికలో ఇట్లు పేర్కొనబడినది : "అన్ని కళలును, శాస్త్రములును ఒండొంటితో సంబంధము కలిగియున్నవి. ప్రకృతి తత్త్వ శాస్త్రము నందును, ప్రమాణజన్య శాస్త్రములందును, జరిగిన నూత నావిష్క రణములు మిక్కిలి ప్రయోజనవంతములైన ప్రయోగ ములకు సహాయము నొసగునవిగా ఉన్నవి. ఈ శాస్త్రముల ప్రగతి కొరకే ఈ చిత్రవస్తుశాల ఉద్దేశింపబడినది. " ఆంగ్ల దేశములో ప్రేక్షకులు లక్షోపలక్షలు. వారము నందలి అన్ని దినములలోను వారికి ప్రవేశము అనుమతింపబడును. ప్రవేశ రుసుములు క్రమముగా తగ్గింపబడుచున్నవి. అచట మ్యూజియములకు సంబంధించిన చట్టము కూడ ఉన్నది. దానిని బట్టి పురపాలక సంఘములు మ్యూజియముల పై పన్ను వసూలు చేయుటకు అనుమతించబడినవి.

ఇంగ్లండు నందు నాలుగు జాతీయ చిత్రవస్తు ప్రదర్శన