విజ్ఞానకోశము - 3
చిత్తూరుజిల్లా
రాని భూమి 13,45,907 ఎకరములు; సాగుకాని భూమి 9,45,274 ఎకరములు; సాగుఅగుచున్న భూమి 9,54,388 ఎకరములు.
ఖనిజములు : ఈ జిల్లాలో పేర్కొనదగిన ఖనిజము ముడి ఇనుము. ఈ ముడి ఇనుము కాళహస్తి తాలూకాలోని సిరసం బేడు ప్రాంతమున లభించును.
చంద్రకాంతశిల (పలుగురాయి), అభ్రకము. బంగారము బలపపురాయి (Steatite), భవననిర్మాణ సామగ్రి ఈ జిల్లాలో లభించును.
పశువులు: పుంగనూరులోని గోజాతి ప్రపంచప్రసిద్ధి చెందినట్టిది. చిత్తూరునకు 25 మైళ్ళ దూరములోనున్న పలమనేరులో గోజాత్యభివృద్ధికి సర్కారువారు ఒక పశు సంవర్థక ప్రతిష్ఠాపనమును నెలకొల్పియున్నారు.
రహదారులు (Communications) : ఈ జిల్లానుండి దీనిని తగిలియున్న ఇతర జిల్లాలకును, మైసూరు రాష్ట్రమునకును పోవు రోడ్లు కలవు. జిల్లాలో 1728 మైళ్ళ పొడవుకల రోడ్లు కలవు. ఇందు 48 మ్యునిసిపల్ రోడ్లును చేరియున్నవి. మదనపల్లి తాలూకాలోను, వాయల్పాడు తాలూకాలోను మిగతా తాలూకాలకంటె హెచ్చు దూరము రోడ్ల నిడివి కలదు. ఈ జిల్లాలో రోడ్లు మంచి స్థితిలోనున్నవి. ఇంకను వీటిని వ్యాప్తిచేయుటకు అవకాశములు కలవు !
రైలు : ఈ జిల్లాలో 681 మైళ్ళు వ్యాప్తి గల రైలుమార్గము కలదు. ఇది జిల్లా యంతటను చక్కగా వ్యాపించి యున్నది. పుత్తూరు, చంద్రగిరి, పలమనేరు తాలూకాలో పెద్దలైను (Broad Guage) రైలుమార్గము కలదు. మద్రాసు-బొంబాయి, మద్రాసు-బెంగుళూరు పోవు రైళ్ళు ఈ జిల్లా గుండ పోవుచుండును.
చిన్నలైను (Metre Guage) కట్పాడి - గూడూరులను కలుపుచుండును. రేణిగుంట నుండి గూడూరు పోవు మార్గము పెద్దలైనుగా మార్చబడినది. చిన్నలైను మార్గ మొకటి పాకాల నుండి బయలుదేరి గుంతకల్లు–బెంగుళూరు మార్గములో నున్న ధర్మవరమును కలిసికొనును. ఈ లైను చంద్రగిరి, పుంగనూరు, వాయల్పాడు, మదనపల్లి తాలూకాలలో నుండి పోవుచుండును. చిత్తూరుజిల్లా ప్రధానస్థానము, వాయల్పాడు, చంద్రగిరి, కాళహస్తి, పుత్తూరుతాలూకా ప్రధానస్థానములు, ఇవన్నియు రైలు మార్గముమీదనే యున్నవి.
తంతి-తపాలా : ఈ జిల్లాలో 419 పోస్టాఫీసులు కలవు. ప్రధానకార్యాలయము, 370 శాఖా కార్యాలయములు, 48 ఉపకార్యాలయములు జిల్లాలో నున్నవి.
తంతి కార్యాలయములు 25 కలవు. ప్రజావసరములు తీర్చు (Public Calls) కార్యాలయములు 17, టెలిఫోన్ ఎక్స్చేంజి ఆఫీసు 1 ఉన్నవి.
వైద్యము : ఈ జిల్లాలో 1951 లెక్కల ప్రకారము 6 ఆసుపత్రులు, 31 గ్రామ వైద్యాలయములు కలవు.
జిల్లా ప్రధావస్థాన మగు చిత్తూరులోని ప్రధాన వైద్యాలయములో ఎక్సురే (X-Ray) యంత్ర పరికరముల జోడు కలదు.
కుష్ఠవ్యాధి బాధితుల చికిత్సకు అక్కరంపల్లెలో వైద్యాలయము కలదు. దీనిని తిరుపతి దేవస్థానమువారు నడుపుచున్నారు.
క్షయవ్యాధి బాధితుల చికిత్సకు మదనపల్లిలో వైద్యాలయము కలదు.
విద్య : ఈ జిల్లాలోని విద్యాపరిస్థితి (1951).
1. కాలేజీలు | 2 |
2. ప్రాచ్య కళాశాలలు | 1 |
3. హైస్కూల్సు | 26 |
4. బాలికల హైస్కూళ్లు | 3 |
5. ట్రైనింగు స్కూళ్లు (బాలుర) | 1 |
6. ట్రైనింగు స్కూళ్లు (బాలికల) | 2 |
7. ట్రైనింగు స్కూళ్లు (ఆంగ్లో ఇండియనుల) | 1 |
8. ప్రాచ్య విద్యాశాలలు | 1 |
9. మిడిల్ స్కూళ్ళు | 7 |
10. ఎలిమెంటరీ స్కూళ్ళు | 1120 |
11. వయోజన విద్యాశాలలు | 48 |
12. విద్యార్థులు | 86,571 |
13. విద్యార్థినులు | 33,939 |
మదనపల్లిలో, తిరుపతిలో కళాశాలలు కలవు.
తిరుపతిలో ప్రాచ్యవిద్యా కళాశాల కలదు.
మదనపల్లి, చిత్తూరు పురములలో బాలికల శిక్షణ పాఠశాలలు (Training Schools), చిత్తూరు పురములో
681