Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/705

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

చామర్లకోట

ప్రాధాన్యము వహించుచున్నది. కెమేరాను 'రీవర్స్'లో నడుపుటద్వారా ఒకటర్న్-ఒక పిక్చర్ ద్వారా అనగా స్టాప్ మోషన్ విధానము ద్వారా, తంత్రమునకు సంబంధించిన దృశ్యములను చూపించుటకు అవకాశము కల్గును. 'బాక్ ప్రొజెక్షన్' విధానము నటీనటులు కొన్ని పరిసర ప్రాంతములలో నుండి, అభినయించు చున్నట్లు మనకు చిత్తభ్రమమును కలుగ జేయును.

టెక్నిక్ : సాహిత్యము : సినిమాకు ప్రత్యేక మైన ఒక సాంకేతిక శాస్త్రవిధానము కలదు. ఈ విధానము నే 'టెక్నిక్ ' అనియెదరు. దీనిపై గొప్ప సాహిత్యము వెలు వడినది. అంతర్జాతీయ రంగములో ఆధునిక యుగమున చలనచిత్ర రంగములో ప్రాముఖ్యము వహించుచున్నవి రెండే రెండు దేశములు-అమెరికా, సోవియట్ రష్యాలు . ఈ రెండుదేశములు తమ అభిరుచుల కనుగుణ్యముగా ఈ సాహిత్యమును తీర్చి దిద్దుకొనుచున్నవి. అమెరికా 'ఫిక్షన్' కు అనగా కల్పనకు ప్రాధాన్య మిచ్చుచుండగా, సోవియట్ రష్యా 'రియలిజం' - కు అనగా వాస్తవికతకు అత్యంత ప్రాముఖ్య మొసగుచున్నది. ప్రఖ్యాత రష్యన్ రచయిత 'పుడోవిన్' రచించిన 'ఫిల్ముటెక్నిక్ ' అను మహత్తర గ్రంథము చలనచిత్ర సాహిత్యమునకు మకు టాయమాన మైనది. మానవజాతియొక్క సర్వతోముఖ వికాసమునకు చలనచిత్ర మెట్లు తోడ్పడగలదో ఈ గ్రంథము మనకు విప్పిచెప్పగలదు.

కమ్యూనిస్టు దేశములు ప్రచండశక్తితో కూడుకొని యున్న సినిమా రంగమును ప్రభుత్వపర మొనర్చినవి. పెట్టుబడి దారీ విధానమునకు కొద్దిగనో గొప్పగనో నివాళు లర్పించుచున్న దేశములు ఈ మహత్తరశ క్తిని ఇంకను వ్యక్తి గత మైన వ్యాపారస్తులహ సములయందే ఉంచినవి.

ప్రపంచమందలి పెక్కు దేశములు సినిమా ఒక మహ త్తరమైన ప్రచారక సాధనమని గుర్తించుటచే, ఏటేటా, అంతర్జాతీయ ఫిల్ము మహోత్సవములను ఏర్పాటు చేసి, ఉత్తమమైన చిత్రములకు బహుమతుల నిచ్చుచున్నవి. భారత ప్రభుత్వముకూడ మన దేశములో ప్రతిసంవత్సరము తయారగుచున్న పొడుగు చిత్రములలోను, పొట్టి చిత్ర ములలోను ఉ త్తమమైన వాటికి పారితోషిక ములను ప్రసా దించుచున్నది.

సినిమా సాంకేతిక శాస్త్రవిధాన మీనాడు శర వేగ ముతో అభివృద్ధి నొందుచున్నది. వర్ణచిత్రములు ప్రచా రములోనికివచ్చి, నలుపు-తెలుపు చిత్రములను వెనుకకు నెట్టి వేయుచున్నవి. ఒక వైపునుండి 'టెలివిజన్' వచ్చి ఉప్పెనవలె విరుచుకొని పడుచున్నను, సినిమాకు ఎట్టి చలనమును కలుగబోదు. టెలివిజన్ సెట్లు సామాన్య మానవులకు ఆరుఅణాల వెలకు లభించునంతవరకు, కోట్ల కొలది ప్రేక్షకుల హృదయ ఫలకములమీద పడిన సినిమా ప్రభావముద్ర చెక్కు చెదరనేరదు.

మంచికి కాని, చెడుకు కాని సినిమా ఒక మహత్తర శక్తిగా రూపొందినది. మానవజాతి ఈ చలనచిత్రమును ఉపయోగించుకొను విధానము ననుసరించియే අධි మంగళగీతములను ఆలపించుటయో, కాక, మారణ హోమమునకు సమిధలను చేకూర్చుటయో సంభవించును.

ఇం. వే.


చామర్లకోట :

చామర్లకోట (సామర్లకోట) రాజమహేంద్రవరము నకు తూర్పుగా రై లుమార్గమున ముప్పదిమైళ్ళ దూరములో నున్న పారిశ్రామిక కేంద్రము. ఇది పంచారామ క్షేత్రములలో నొకటియై శివప్రధానమైన పుణ్యక్షేత్రమై వెలసినది. క్రీ.శ. 1855 వ సంవత్సర ప్రాంతమున ద్రవ్వబడిన కాకినాడ కాలువవలనను, 1893 వ సంవత్సరమున తెరువబడిన రైలుమార్గమువలనను ఈ క్షేత్రమందలి చాళుక్య భీమేశ్వర, రాజనారాయణస్వాముల ఆలయ ములు ప్రధాన గ్రామమునుండి వేరుపడిపోయి చెరకు, వరి పొలములమధ్య నిల్చి ప్రకృతిమాత లాలితము లగుచున్నట్లున్నవి. మొదటి చాళుక్య భీమ విష్ణువర్ధనుడు వేంగిరాజ్యమును క్రీ. శ. 892 నుండి 922 వరకును పాలించిన కాలములో ఈ ప్రదేశ మారాజున కొక రాజధానిగా నుండెను. అంతకు పూర్వ మిది మొగలాయి ప్రభువుల కాలములో మృత్యుంజయ పురమను పేరున వెల సెడిది. చాళుక్య భీముడు తనకు ఉపాస్యదై వమగు భీ మేశ్వరుని కిట దేవాలయ నిర్మాణము చేయించి, చాళుక్య భీమవరాగ్రహారమును తన పేర నెలకొల్పెను. “.. చాళుక్యభీమః, షష్ట్యుత్తరం యస్త్రిశతం రణానాం జిత్వాస్వనామ్నా ప్రధితంవిధాయ