Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/704

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

చలనచిత్రములు 644 సంగ్రహ ఆంధ్ర

మీటరుల ఫిల్ములను చూచుచున్నాము. 16 మిల్లీమీటరుల ఫిల్ములు, 9.5 మిల్లీమీటరుల ఫిల్ములు, 8 మిల్లిమీటరులు ఫిల్ములు గూడ ఈ కాలములో వ్యాప్తియందున్నవి. 35 మిల్లీమీటరుల ఫిల్ము సర్వసాధారణముగా వేయి అడుగులచుట్టుగాను, 16 మిల్లీమీటరుల ఫిల్ము 400 అడు గుల చుట్టుగాను తయారుచేయబడి యుండును. వెయ్యి అడుగుల ఫిల్ముచుట్టు థియేటరులో ప్రొజెక్టర్ మీద పరు గెత్తుటకు పది నిమిషముల కాలవ్యవధి పట్టును.

చలనచిత్రప్రభావము : లెనార్డో డావిన్స్కీ, వెడ్జివుడ్, నిస్సీ, డాగరే, ఫాక్స్ టాల్బట్, ఫ్రీజ్ గ్రీన్, లాస్టీ, ఎడి సన్ మొదలైన వైజ్ఞానిక శాస్త్రవేత్తల కృషిఫలితముగా ఈనాడు సినిమా, ప్రపంచమంతటను మహ త్తర మైన శక్తిగా రూపొందియున్నది. సంగీతము, సాహిత్యము, చిత్రలేఖనము, నృత్యము మున్నగు లలితకళలన్నియు చలనచిత్రములో ఈ యుగమందు గూడుకట్టుకొని యున్నవి. చలనచిత్ర మీ నాడు ఒక వంక కళగాను, మరొక వంక వ్యాపారముగాను పరిణామము చెందినది.

చిత్ర నిర్మాత, దర్శకుడు, కవి, సంగీతదర్శకుడు, ఛాయాగ్రాహకుడు, శిల్పదర్శకుడు, నటీనటులు, ఆహా ర్యము, వేషధారణములను చూచువారు, కూర్పు దారుడు, ఇతర సాంకేతిక శాస్త్రజ్ఞులు చిత్రనిర్మాణ ములో భాగస్వాములై వ్యవహరించుచున్నారు. చిత్ర నిర్మాణము సమష్టి కృషిఫలితము. దర్శకుడు ఈ సాంకే తిక శాస్త్రజ్ఞు లందరికిని నాయకుడు. అతని వీరు ణాశక్తిని (visualization power) అనుసరించియే చిత్రము రూపులు తీర్చి దిద్దుకొనును.

చిత్రమనగా సెల్యులాయిడ్ మహాకావ్యమన్నమాట. అధ్యాయములు, పేరాలు, ఫుల్ స్టాపులు, సెమికో ల లన్లు, కోలన్లు, డాష్ లు, కామాలు - ఇవన్నియు కావ్యమందలి భాషా, భావవాహికలకు సొబగులు ఎట్లు తీర్చి దిద్దగలవో. అటులే ఈ సెల్యులాయిడ్ మహాకావ్యానికి 'సీక్వెన్సులు', 'సీనులు', 'పాటు' లు, 'ఫేడ్ ఇన్', 'పేడ్ అవుట్' లు, 'కట్'లు, 'మిక్స్'లు, 'డిసాల్వ్ ' లు, 'టర్న్ వ్' లు, 'వైవ్ 'లు పరిపుష్టిని చేకూర్చగలవు. ఈ సాంకేతిక పారి భాషిక పదములన్నియు చిత్రమునకు లయబద్దమైన నడక ను ప్రసాదించి మన దృష్టిని బంధించును. కెమెరాలో ఉపయోగింపబడు 100, 75, 50, 40, 25, 15 లెన్సులు పాత్రల ముఖకళవళికలను, సెట్లలోని వాతావరణము యొక్క రామణీయకతను మనకు ప్రస్ఫుటముగా చూపించుటకు ఉపకరించును.

'సినాప్సిస్', 'స్టోరీ', 'ట్రీట్ మెంట్', 'సినేరియో ' 'స్క్రిప్ట్', 'షూటింగ్ స్క్రిప్ట్'-ఇవన్నియు కథ వెండి తెర మీద రూపు తీసికొనులోపల వచ్చు పరిణామదశలు. ఈ దశలలో కథ విశిష్టతతో కూడిన తీర్పులను తీర్చి దిద్దు కొనును. 'ఎక్స్ పొజిషన్', 'ఎక్స్ పౌండర్', 'ఎక్స్ ప్లోడర్ ', 'కాన్ ఫ్లిక్ట్', 'కాంప్లికేషన్స్', 'మోర్ కాంప్లి కేషన్స్', 'సబ్ క్లైమాక్స్', 'క్లైమాక్స్', 'డినౌమెంట్ ' ఇవి ప్రతి ఇతివృత్తమునకును అవసరమగు దినుసులు. పాతౌచిత్యము, పాత్ర పరిపోషణ, సంఘర్షణ, చిక్కులు, రససిద్ధిని బడయు అంతిమఘట్టము- ఇవి వీటిలో మనకు ద్యోతకమగును. ఇతివృత్తము యొక్క ప్రయోజనము లేక గమ్యస్థానము 'డినౌమెంటు' లో గోచరించును.

తెరమీద కథను చెప్పుటలో షాట్ల విభజనము ప్రాధా న్యము వహించును. స్థూలరూపములో ఈ షాట్లు రెండు రకములుగా నుండును. ఒకటి 'స్టెడీ' షాట్లు ; రెండు 'ట్రాలీ' షాట్లు. కెమేరా ఒకే ఒక సెటవ్ లో నున్నప్పుడు 'స్టెడీ' షాట్ తీసికొనబడును. అది ముందునకు కాని, వెను కకు కాని, ప్రక్కకు కాని తిరుగుచున్నప్పుడు 'ట్రాలీషాట్ ' తీసుకొనబడును. సెట్టుమీద షూట్ చేయవలసిన పాత్ర లలో కొన్నిటిని మినహాయించుటకు కాని, కొన్నిటిని కలుపుటకు కాని, ఒక పాత్ర యొక్క శరీరములో ఏ భాగము నై నను మినహాయించుటకు గాని, కలుపుటకు గాని 'ట్రాలీషాట్' ఉపయోగింపబడును.

'డిన్స్పాట్', 'లాంగ్ షాట్', 'మిడ్ లాంగ్ షాట్', 'మిడాట్', 'కోజ్ మీడియంషాట్' 'కోల్షిట్' మున్నగునవి వెండి తెరపైన మనకు ప్రకృతి సౌందర్య మును, పాత్రల ముఖ కళవళికలను, భావ విస్ఫూర్తిని ఆయా సందర్భముల ననుసరించి చూపించుటకు ఉపయోగ పడుచుండును. రసానుభూతిని కల్గించుటకై వెండి తెరమీద శర వేగముతో కొన్ని చిన్నషాట్లు చూపింపబడును. వీటిని 'మాంటేజి షాట్స్' అని యెదరు.

ఈనాడు చలనచిత్రములో తంత్ర ఛాయాగ్రహణము