Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/700

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

చలనచిత్రములు 640 సంగ్రహ ఆంధ్ర

గ్రహింపబడిన వస్తువుల యొక్క ప్రతిబింబములను 'పాజి టివ్' మీద స్పష్టముగా ముద్రించుటకును, ఒక ప్రింట్ నుంచి అవసరమైనన్ని కాపీలు తీయుటకును అవకాశము కలిగెను.

ఛాయాగ్రహణ చరిత్రలో మరొక అధ్యాయమును సృష్టించినవాడు సర్ జాన్ హెర్షెల్. సిల్వర్ క్లోరై డును గాజుకు పట్టించి, దానిపైన 'నెగెటివ్' ను సృష్టిం చుటకు హెర్ షెల్ కృషిసల్పెను. కాని క్లోరైడ్ గాజుకు గట్టిగా పట్టుపట్టక పోవుటచే, అతనికృషి అంతగా ఫలించక పోయెను. కాని కొంతకాలమునకు తరువాత నిప్సెడి సెంట్ విక్టర్ అను నాతని ప్రయత్నఫలితముగా ఈ క్లోరైడ్ విధానము విజయవంతమై, పందొమ్మిదవ శతాబ్దము మధ్యభాగమువరకు మంచి ప్రచారములోనికి వచ్చెను.


కోరెడ్ విధానము 'కొలోడియన్' విధానమునకు అచిర కాలములో తావిచ్చెను. ఈవిధానము (process)ను కని పెట్టినవాడు స్కాట్ ఆర్చర్. ఆల్కహాల్, ఈథర్ కలిసిన రసాయన పదార్థమే 'కొలోడియన్' అనబడును. క్రీ. శ. 1851 లో ఈ పదార్థము కనిపెట్టబడినది. ఆధునిక యుగములో ఈ పదార్థమే ఛాయాగ్రహణములో విరివిగా వాడబడుచున్నది. కొలోడియన్ పూత పూయబడిన గాజు ప్లేట్లు సిల్వర్ నైట్రేట్ సొల్యూ షన్ లో ముంచి తీయబడిన తరువాత 'ఎక్స్పోజర్ 'కు (exposure) ఆనగా ఉపయోగమునకు సిద్ధమగును. ఇవి తడిగా నుండుట చే ఈ విధానముసు 'వెటకలోడియన్ ప్రాసెస్ ' అనియెదరు. ఈ విధానము చూపిన ప్రమాణములు ఈనాడు ఇతర విధానముల ద్వారా కాన్పించు చున్న ప్రమాణములతో దీటు రాగలవని శాస్త్రజ్ఞు లభిప్రాయ పడుచున్నారు. ఛాయాగ్రహణ కళకు ఇట్టి అద్భుతమైన సేవచేసిన స్కాట్ ఆర్చర్ అంత్యదశలో తినుటకు తిండి లేక మలమల మాడి మరణించెను.

తరువాత ఛాయాగ్రహణము విషయములో శాస్త్రీయమైన కృషి బహుళముగా జరిగెను. గెల టైన్ డ్రై ప్లేట్లు, అటు పిమ్మట సెల్యులాయిడ్ వ్యా ప్తిలోనికి రాజొచ్చెను. అమెరికన్ శాస్త్రజ్ఞుడు ఈస్ట్మన్ సెల్యు లాయిడ్ పదార్థమును బహుళ ప్రచారమునకు తీసికొని వచ్చెను. ప్రపంచమంతట విఖ్యాతినందిన 'కొడక్ ' కం పెనీకి ఈతడు అధినేత. ఫీలు చీకటిలో కాక, పట్టపగలే 'లోడ్' చేయబడుటయు, చీకటిగది (dark room) అవసరము లేక యే 'డెవలపింగ్ ' యంత్రము అమలులోనికి వచ్చు టయు ఛాయాగ్రహణరంగములో ప్రత్యేకముగా పేర్కొన దగిన విశేషములు.

చలనచిత్ర ఛాయాగ్రహణము: ఇంతవరకు చిత్రఛాయా గ్రహణమునకు సంబంధించిన వైజ్ఞానిక విశేషములను గూర్చి తెలిసికొంటిమి. ఇప్పుడు చలనచిత్ర ఛాయాగ్రహణ మునకు సంబంధించిన విషయములను గ్రహించవలసి యున్నది. చలనచిత్ర ఛాయాగ్రహణమును 'సినిమెటో గ్రఫీ' అనియెదరు. ఫ్రీజ్ గ్రీన్ అను నాతడు ఈ చలనచిత్ర ఛాయాగ్రహణమునకు జనకుడని చెప్పక తప్పదు. క్రీ.శ. 1889 లో ఫ్రీజ్ గ్రీన్ గావించిన పరిశోధనను గురించి ఒక సమకాలిక పత్రిక ఇట్లు వ్రాసెను. "ఆతడు ఒక రకమైన, ఒక విచిత్రమైన కెమేరాను కనిపెట్టెను. అది ఒక చతుర పుటడుగు వైశాల్యము కలది. సంచలనమునకు గురియవు చున్న జీవిని దీనికి అభిముఖముగానుంచి, దీని 'హాండిల్ ' త్రిప్పినచో, క్షణమున కెన్ని యో ఫోటో గ్రాఫులు 'రికార్డు' అగును. వీటినన్నిటిని ద్రావకములో శుభ్రముగా కడిగి, వరుస క్రమములో జతచేసి, వీటికి రెండు ప్రక్కల రెండు రోలర్లను అమర్చి, ఒక విచిత్రమైన లాంతరు (ఈమాజిక్ లాంటర్న్ ఫ్రీజ్ గ్రీన్ చేతనే సృష్టించబడినది) ద్వారా వెండితెరమీద ప్రొజెక్టు చేయబడినది. శబ్దము కావలసిన చోట ఫోనోగ్రాఫ్ ఉపయోగింపబడినది.

చిత్రము - 187 పటము - 3 స్టూడియో పెట్టుమీద