విజ్ఞానకోశము - 3
చలనచిత్రములు
ఆతనికి తలవని తలంపుగా ఒక సూత్రము అవగాహన మయ్యెను. ఈ సూత్రము ప్రకారము సూర్యునికిరణములు పడుటకు అవకాశముగల భాగములనే ఈ రసాయనిక పదార్థము నలుపుచేయగల్గును. ఈ సూత్రముపై డా. లూయీ అను ఆంగ్లేయుడు మరికొన్ని పరిశోధనలు జరిపెను. ఆ పరిశోధన లన్నిటిని ఆతడు గ్రంథస్థముచేసి, హఠాత్తుగా చనిపోయెను. ఆ గ్రంథము మరొక ఆంగ్లేయుడైన జోసయా వెడ్జివుడ్ యొక్క హస్తములలో పడెను. మరణించిన డా. లూయీకి సహాయకుడుగా పనిచేసిన చిస్ హోం కూడ వచ్చి వెడ్జివుడ్ యింటిలో ప్రవేశించెను.
వెడ్జివుడ్ యొక్క నాల్గవ కుమారుడైన థామస్‌కు వైజ్ఞానిక పరిశోధనలయెడల మిక్కిలి ఆసక్తి ఉండి యుండెను. డా. లూయీ ఛాయాగ్రహణము విషయములో గావించిన పరిశోధనల నన్నిటిని ఆతడు చిస్ హోం ముఖతః విని కార్యరంగములోని దూకెను. వెలుగు ప్రసరణము ద్వారా ఆతడు వస్తువుల ప్రతిబింబములను కెమేరా అబ్‌స్క్యూరా సహాయముతో 'రికార్డు' చేయ గలిగెను.
ఛాయాగ్రహణ విధానమునకు ఈ పరిశోధనలు ఎంతయో సహాయపడెనని దీనవలన మనము గ్రహింప గలము. సిల్వర్ నైట్రేట్ సొల్యూషన్లో ముంచి తీయబడిన తెల్లని కాగితములుగాని లేక తోలుముక్కలు గాని వివిధ పదార్థముల ప్రతిబింబములను 'రికార్డు' చేయుటకు ఉపయోగింపబడెను. సూర్యరశ్మి వీటిపై సూటిగా ప్రసరించినపుడు త్వరితగతిని యివి నలు పెక్కును. కొన్నిగంటలవరకు వీటిని నీడలో ఉంచినప్పుడు గూడ ఇవి నలుపురంగుకు తిరుగగల్గెను. దురదృష్టవశాత్తు కెమేరా అబ్‌స్క్యూరా ద్వారా 'రికార్డు' చేయబడిన వస్తువుల ప్రతిబింబములలో స్ఫుటత్వము లేకుండెను; అనగా ఈ ప్రతిబింబములన్నియు రేఖామాత్రముగానే గోచరించిన వన్నమాట, 'ప్రింట్ల'కు కాపీలు తయారు చేయుటకు కూడ వెడ్జివుడ్ చాల బాధపడెను. ఎన్నియో పర్యాయములు అవి నీటియందు కడుగబడి శుభ్రపరుప బడినప్పటికిని సత్ఫలితములు చేకూరకపోయెను. ఆ ప్రింట్ల మీదగల సిల్వర్ కాంపౌండు మార్పునకు గురికాక యథాప్రకారముగనే ఉండిపోవుటచే, అతడు వాటిని తీసి వేయ లేక పోయెను. ఈనాడు విరివిగా ఉపయోగింపబడెడు 'హైపో' యను రాసాయనిక పదార్థము క్రీ. శ. 1799 సం.లో కనిపెట్టబడినను, ఇతర వస్తువులుగూడ ఈ విషయములో ఉపయోగార్హతను సంపాదించినను, వెడ్జిఫుడ్ తన పరిశోధనలను విజయవంతముగా కొనసాగించ లేక పోయెను. ఆతని ఆరోగ్యము పూర్తిగా దెబ్బతిని నందున, వెడ్జివుడ్ ముప్పది అయిదేండ్ల వయస్సుకూడ ముగియక మునుపే శాశ్వతముగా కన్నుమూసెను.
ఫ్రాన్స్ దేశీయులైన జోసెఫ్ నిసిఫోర్ నివ్స్, డాగరే అను శాస్త్రజ్ఞులును, ఆంగ్లేయుడైన విలియం హెన్రీ ఫాక్స్ టాల్ బట్ అను నాతడును వెడ్జివుడ్ గావించిన పరిశోధనలను ఆధారము చేసికొని ముందునకు వెళ్ళగలిగిరి. ప్రతిబింబములను గ్రహించుటకై కాగితములకును, తోలుముక్కలకును బదులు లోహపు ముక్కలు ఉపయోగింపబడెను. ఈనాడు ఛాయాగ్రహణములో మన ముపయోగించెడి 'నెగెటివ్' లకు ప్రాణదాత ఫాక్స్ టాల్ బట్ అను నాతడు ; 'పాజిటివ్' లకు జీవముపోసిన వాడు డాగరే. వీరిద్దరి కృషివలన 'నెగెటివ్' మీద
చిత్రము - 186
పటము - 2
మొట్టమొదట స్టూడియో కెమెరా
639