Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/698

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

చలనచిత్రములు సంగ్రహ ఆంధ్ర

చలనచిత్రము ప్రజాబాహుళ్యమునకు అత్యంత సన్నిహిత మగుటయే దాని ప్రత్యేకత అని చెప్పుటలో అత్యుక్తి కానరాదు.

ఈనాడు చలనచిత్రము ఆకర్షణీయమయిన వివిధ రూపములతో అలరారుచున్నది. ప్రకృతిగర్భములో నున్న రహస్యముల నన్నిటిని చలనచిత్రము మానవప్రపంచము నకు గోచరింప జేయుచున్నది. "త్రిడైమెన్షనల్", “సినిమాస్కోప్”, “సినీరమ", "విస్టావిజన్” మున్నగు రూపములన్నియు సినిమా సాంకేతిక శాస్త్ర విజ్ఞానాభి వృద్ధికి వై తాళికలుగా వ్యవహరించు చున్నవి. అందు

ఆధునిక యుగములో చలనచిత్రము ఇంతటి విశ్వ రూపమును చూపింపగలుగుటకు, సుమారు మూడు వందల సంవత్సరములనుండి వైజ్ఞానిక శాస్త్రవేత్తలు గావించిన మహ త్తరమైన పరిశోధనములే కారణమన్న విషయమును విస్మరింపరాదు. ఏయే పరిశోధనములు, ప్రయోగములు చలనచిత్ర కళామతల్లిని పసిడి పల్లకీలపై కూర్చుండబెట్టి ఊ రేగించుటకు తోడ్పడినవో తెలిసి కొందము.

వెలుగు - నీడ : ఈ రెండును చలన చిత్రకళకు జీవ తంతువులు. విశ్వమునందలి చరాచర జీవసృష్టినంతయు చలనచిత్రములో ఈ రెండింటిద్వారా మనకు ప్రత్యక్ష మగును. రూపములు, ప్రతిరూపములు, బింబములు, ప్రతి బింబములు = ఇవన్నియు వెలుగు నీడలలో గోచరించి, వివిధరసముల అనుభూతులను మనకు సిద్దింప జేయగలవు.

చలనచిత్రమునకు ఛాయాగ్రహణ మొక ప్రాతిపదిక. ఈ ఛాయాగ్రహణమును ఇంగ్లీషులో 'ఫోటోగ్రఫీ' అనెదరు. క్రీ. పూ. 350 సంవత్సరముల క్రిందట గ్రీకు శాస్త్రజ్ఞుడు, తత్వవేత్త అయిన అరిస్టాటిల్ వ్రాసిన కొన్ని గ్రంథములలో ఈ ఛాయాగ్రహణమునకు సంబంధించిన యొక యంత్రము యొక్క రూపు రేఖలు పొందుపరుపబడి నట్లు తెలియవచ్చుచున్నది. ఈ యంత్రము పేరు ' కెమేరా అబ్ స్క్యూరా' అని తెలియుచున్నది. 'లెనార్డో డావిన్సీ యను నాతడు ఈ ఛాయాగ్రహణమునకు సంబంధించిన సాహిత్యమును పురాణగ్రంథముల నుండి వెలికి తీయ గల్గెను. అతడు తన వ్రాతలలో ఇట్లనెను:

"ఒక చిన్న గుండ్రని రంధ్రము నుండి ఒక చీకటి గది లోనికి వెలుగును స్వీకరించిన వస్తువుల యొక్క ప్రతిబింబములు ప్రవేశించినచో - రంధ్రమునకు స్వల్పదూరములో ఉంచడిన ఒక తెల్లని కాగితముమీద ఆ గదిలో ఆ ప్రతిబింబములను గ్రహించినచో ఆ వస్తువుల ఆకారములను, రంగులను ఆ కాగితము పైన సలక్షణముగ చూడ గల్గుదుము. అయితే, ఆ బింబములు పరిమాణములో చిన్న విగ నుండి అడ్డముతిరిగి యుండును."

చిత్రము - 185 పటము - 1 కెమెరా ఆబ్స్క్యూరా

ఈ ప్రాతిపదిక సూత్రము ననుసరించియే, గుండ్రని చిన్న రంధ్రము గల కెమేరా వ్యాప్తిలోనికి వచ్చెను. దీనినే 'పిన్ హోల్ కెమేరా' అనెదరు.

ఛాయాగ్రహణము - ప్రయోగపరంపరలు : గ్రీకు ప్రజలు ఈ ఛాయాగ్రహణమునకు సంబంధించిన సారస్వత బీజములను కర్మక్షేత్రములో వెదజల్లగా, అందుండి మొలచిన మొక్కలకు నీరుపోసి, పైకి తెచ్చి, పెంచి, పోషించిన గౌరవము జర్మను శాస్త్రవేత్తలకు దక్కెను. క్రీ. శ. 1727 సం.లో డా. జె. హెర్మన్ షుల్జ్ సిల్వర్ నైట్రేట్ ను, సుద్దను మేళవించి ఒక రాసాయనిక పదార్ధమును సృష్టించెను. దానిమీద ఆతడొక పరిశోధనముజరి పెను. ఈ పరిశోధనలో