విజ్ఞానకోశము - 3
చరిత్రాధారములు
వ్యాఖ్యానములు చేరియున్నవి. పవిత్రమైన జైన వాఙ్మయము ‘అర్థమాగధి' భాషలో రచింపబడి అత్యంత విస్తృతముగ నున్నది.
లౌకిక పరమైన సాహిత్యమును గూర్చి మనమెక్కువ శ్రద్ధ వహింపవలసియున్నది. మత్స్య, వాయు మున్నగు 18 పురాణములందును (ప్రక్షిప్తములుకాక), దీపవంశ, మహావంశములనెడి పాలిభాషా గ్రంథములందును చారిత్రక కథనము భద్రపరుపబడియున్నది. పురాణములందు రాజవంశముల పట్టికలు గలవు. ప్రాచీన భారతీయ చారిత్రక కథానకములయొక్క చిక్కులను విడదీయుటకు ఈ రాజవంశముల పట్టికలు ఎక్కువ మార్గదర్శకములుగా నుండగలవు. అట్లే వంశ గ్రంథములు ప్రాచీన భారత చరిత్రయందలి కొన్ని ఘట్టములను గూర్చి ముఖ్యమైన సమాచారమును ఇవ్వగలవు.
చైనా బౌద్ధధర్మ చరిత్రలో ఫాహియాను, హుయాన్ త్సాంగు, ఇత్సింగు అను మువ్వురు అమరజీవులు మనకు కూడచాల ముఖ్యులు. ఫాహియాను అను నాతడు క్రీ. శ. 5 వ శతాబ్ద ప్రారంభమున బౌద్ధ ధర్మగ్రంథ సంపాద
631