చర్మవ్యాధులు 32 సంగ్రహ ఆంధ్ర
నార్థము భారతదేశమునకు వచ్చియుండెను. రెండు శతాబ్దుల అనంతరము హుయాన్ త్సాంగ్ కూడ అట్టి యుద్దేశముతో నే భారత దేశమునకు వచ్చెను. అటు పిమ్మట ఇత్సింగ్ హుయాన్ త్సాంగును అనుసరించి భారత భూమికి విచ్చేసెను. ఈ మువ్వురు బౌద్ధధర్మ గ్రంథాన్వేషణార్థము తాము దర్శించిన భారతభూమియందు పర్యటించి, తమ యాత్రా విశేషములను దెలుపుచు దినచర్యా గ్రంథములు వ్రాసి యున్నారు. ఈ యాత్రావి శేషములు వర్ణనా సందర్భమున భారతీయుల ఆచారవ్యవహారము లనుగూర్చి తమతమ యభిప్రాయములను ముచ్చటగొల్పు విధముగా గ్రంథస్థముచేసి యున్నారు.
ప్రాచీన భారత దేశములో జీవిత చరిత్రలకు సంబంధిం చిన వాఙ్మయము స్వల్పముగనే రచింపబడినది. అట్టి జీవిత చరిత్రలలో బాణుడను మహాకవి రచించిన హర్ష చరిత్ర యొకటి అత్యంత ప్రముఖమైనది. అయితే పౌరా ణిక కథలకు, అద్భుత గాథలకు, జానపదులకు సంబంధిం చిన సాహిత్యము అపరిమితముగా నున్నది. భాసుడు, కాళిదాసు, భవభూతి, భారతి అను మహాకవుల గ్రంథ ములు, పంచతంత్రము ఇత్యాది పెక్కు జానపద గాథలు ఈ సందర్భమున పేర్కొన దగినవి.
ప్రాచీన శాసనములు, నాణెములు చాల విలువగల చరిత్రాధారములుగా భావించబడుచున్నవి. అవిలేనిచో, విశ్వసనీయమయిన చరిత్రనిర్మాణము అసాధ్యమయి యుండును. కొన్ని చారిత్రకదశలను వర్ణించుటకు శాసన ములు మాత్రమే మనకు ఆధారములుగా నున్నవి. అలహా బాదు నగరమునందలి అశోకుని శిలాస్తంభ శాసనము లేకున్నచో, అశోకుడు నామమాత్రుడుగనే ఉండి యుండెడి వాడు. గుప్తరాజులయొక్క నాణెముల దర్శ నము ఎంతయు ఆహ్లాదకరము. ఆ నాణెములమీద ముద్రితమైన రాజలాంఛనములు, బిరుదావళులు, ఏ ప్రభు వులయొక్క ఆజ్ఞలపై ఆ నాణెములు ముద్రింపబడెనో తెలిసికొనుటకు ఘనముగా నుపకరించుచున్నవి.
ఇవియే మన ఆధారములు. వీటి పరస్పర విలువలను గూర్చి ఇచ్చట ముచ్చటించుట సందర్భశూన్యము కానే రదు. చరిత్రాధారములలోకెల్ల శాసనములు, నాణె ములు అత్యంత ప్రముఖములైనవి. అయినను వీటికిని కొన్ని పరిమితులు కలవు. ఎందుకనగా, కొన్ని శాసనములు అసంపూర్ణములు. మరికొన్ని శాసనములు అతిశయోక్తు లతో నిండి యుండును. ఇట్టి లోపము లెన్ని యున్నను శాసనములు మిక్కిలి నమ్మక మైన చరిత్రాధారములుగా పరిగ ణింపబడు చున్నవి. ప్రాచీన భారత దేశములోని సామం తుల యొక్కయు,సామ్రాజ్యాధి నేతల యొక్క యు నామ పరం పరా పరిశీలన మూలకముగా వారి పూర్వ, అపర చారిత్రక కథనమును ఒక క్రమమునకు తెచ్చుటలో వురాణములు వంశ గ్రంథములుమన కెంతయు తోడ్పడుచున్నవి.
కె. స.
చర్మవ్యాధులు (Skin Diseases) :
చర్మమునందు రెండు పొరలు కలవు. అందు ప్రభాసిని (ఎపిడెర్మిస్) అనబడు బాహ్యచర్మము ఒకటి. స్థూలత్వక్రు (డెర్మిస్) అను లోపలిచర్మము మరియొకటి. ప్రభాసిని యొక్క లోతుపొరలలో లోపలిచర్మపువర్గము ఉండును. స్థూలత్వక్కునందు ఈ క్రిందివి కలవు :
- (i) చర్మపు గ్రంధులు. ఉపరి భాగమునందలి తమ గొట్టములద్వారా అవి తెరచుకొనును. అందువల్ల చెమట వెలికి వచ్చును.
- (ii) వెంట్రుకల లఘురంధ్రములు.
- (iii) క్రొవ్వుద్రవమును తయారుచేయు గ్రంధులు.
- (iv) స్పర్శ, ఉష్ణోగ్రత, వేడి, చలి మొదలగువాటిని కనుగొను జ్ఞాననాడులు. ఈ నాడులు తుది అవయవముల యొద్ద ముగియును. వ్రేళ్ళయొక్క తుది భాగములు
మొదలైనచోట్ల ఈ స్పర్శజ్ఞానము ఎక్కువగా నుండును.
చర్మము యొక్క పనులు: 1. శరీరావయవములను ఇది కాపాడును. 2. శరీరోష్ణోగ్రతను క్రమబద్ధము చేయు టలో ఇది ముఖ్యపాత్ర వహించును. శరీరమునుండి సుమారు 1000 ఘన సెంటిమీటరుల ద్రవము ఉప్పుతో శరీ రము నుండి ఇగిరి పోవును. ఏ వాతావరణము నందైనను సుఖముగా నున్నామను భావన చర్మమునుండి కలుగు నదియే. బాహ్య ఉష్ణోగ్రతను, తేమను, ఒక ప్రత్యేక స్థాయిలో నుంచుటవలన అట్టిది కలుగుచున్నది. దీనినే 'ఎయిర్ కండిషనింగ్' అందురు.
చర్మములో మార్పులు కలిగించు సాధారణ వ్యాధులు : మధు మేహములో దురద పెట్టుట సామాన్యమైన విష