Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/690

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

చరిత్రాధారములు సంగ్రహ ఆంధ్ర


చిత్రలిపి ప్రాచీనకాలములో మెక్సికో దేశమందు పూర్వసంఘటనములను అనుశ్రుతముగా స్మృతిపథము నకు తెచ్చుకొను నొక విచిత్ర సంప్రదాయ ముండెను. ఇట్టి సంప్రదాయమునకు తోడుగా లిఖిత చిహ్నాంకితములు నెలకొనెను. పరిణతి చెందని మోటుగాథలను విశదీక రించుటకు 'అజ్ టెక్స్' (Aztecs) అను జాతికి సంబంధించిన చిత్రలేఖన విధానము అనుసరించబడెను. కాని ఆ సంఘటన పరంపరను సంపూర్ణముగ అభివర్ణించుటకు చిత్రలిపి సంకేత సంవిధానము ఎంతమాత్రము చాల దయ్యెను. అందుచే ఒకానొక మతాచార్య సంప్రదాయ కులగు ఈ నాచార్యులు ఈ సంక్షిప్త చిహ్నముల యొక్క అంతరార్థమును గ్రహించుటకు చాల కాలము పరిశ్ర మించిరి. తరువాత పామరులకు ఈ చిత్రలిపి భావమును ప్రబోధింపసాగిరి. ఈ విధముగా లిఖితపత్ర సంబంధ ఈ ముల అసమగ్ర విధానము మౌఖికముగా పరంపరా వ్యాప్తి చెంది నిలువగలి గెను. అయితే, ఇది ఆ అసమగ్ర విధానమునకు మార్గదర్శకముగను, సహకారి గను ఉపకరించినదయ్యెను. ఇట్టి కార్యమునకై ఇంత కంటె హీనమగు విధానమును ప్రాచీనులైన పెరూవి యనులు (Peruvians) అనువర్తించుచుండిరి. సుమర్, మెసొపొటేమియా, హరప్ప, మొహెంజోదారో నాణె ములమీద జంతువుల చిహ్నములే కాక చిత్రాలంకార ములు గూడ ముద్రింపబడియుండెను. ఈ చిత్రాలంకార ములయొక్క గూఢార్థమును ఇంతవర కెవ్వరును విడదీసి వివరించియుండ లేదు . ఇవన్నియు ముఖ్యములైన చారిత్రకాధారములుగా భావింపబడుచున్నవి.

యం. డానౌ (M. Daunou) అను నాతడు చరి త్రాధారములను ఈక్రింది విధముగా వర్గీకరించి ఉండెను:

1. రికార్డు ఉద్యోగులచే (record keepers) భద్ర పరుపబడు ప్రభుత్వ ప్రకటనములు : రోజువారీ ప్రభుత్వ రిజిస్టరులు.

2. ప్రైవేటు డైరీలు లేక మాసిక, త్రైమాసికాది పత్రికలు.

3. ముద్రితములగు వార్తా పత్రికలు.

4. వ్యక్తిగత స్మృతులు (personal memories).

5. సమకాలిక చరిత్ర గ్రంథములు.

6. వర్ణితమైన సంఘటనలు జరిగిన ఒకటి రెండు శతాబ్దుల అనంతరము వ్రాయబడిన చరిత్రలు.

7. అతిప్రాచీనయుగమునుగురించి పూర్వచరిత్రకారు లచే రచించబడిన గ్రంథములు.

8. ప్రాచీన చరిత్రను గూర్చి ఆధునికులచే రచిత మైన గ్రంథములు.

వీటిలో మొదటి నాలుగు అంశములు అసమగ్రము, అసంపూర్ణమైన చరిత్రాధారములుగా గణింపబడు చున్నవి. ఆరవ, ఏడవ అంశములు సవ్యముగా వివరింప బడియుండ లేదు.

ఇంతవరకు మనము చరిత్రాధారములను గూర్చిన సాధారణ భావములనుమాత్రమే తెలిసికొనియున్నాము. కొందరు పండితుల అభిప్రాయము ప్రకారము ఈ చరి త్రాధారములను విస్తృతముగా రెండు శీర్షికలక్రింద విభజింపవచ్చును. (1) ప్రధానము; (2) అప్రధానము. ఈ రెండును మరల పెక్కు శాఖలుగా విభజింపబడెను.

పరిశీలనా సౌలభ్యముకొరకై వీటిని సారస్వత, పురా తత్వ శాఖలుగా రెండు విస్తృత వర్గములక్రింద విభజింప వచ్చును. ఈ రెండు వర్గములు పెక్కు ఉపవర్గములుగా మరల విభజింపబడవచ్చును.

మొట్టమొదట మతసంబంధమైన ఆధారములనుగూర్చి విచారింతము. ఈశాఖ శ్రుతి, స్మృతి, బౌద్ధము, జైనము శ్రుతి యనగా ఆవి వరణమైనట్టిది-అనగా వేదము అని యర్థము. ఋగ్యజు స్సామ అధర్వవేదములు, బ్రాహ్మణములు, ఆరణ్యక ములు, ఉపనిషత్తులు - ఇవన్నియు శ్రుతి శాఖకు చెందినవి. స్మృతి అనగా కంఠస్థముగావింపబడిన సాహిత్యము. కౌటి ల్యుని అర్థశాస్త్రము, మనువు, యాజ్ఞవల్క్యులు రచించిన ధర్మశాస్త్రములు, రామాయణ -మహాభారతేతిహాస ములు స్మృతిశాఖకు చెందును. బౌద్ధ వాఙ్మయము పాలీ, సంస్కృత భాషలలో లిఖితమైయున్నది. పాలీభాషలో రచింపబడిన బౌద్ధ వాఙ్మయములో 'వినయ', 'సుత్త', 'అభిధమ్మ' అనునవి ధర్మశాస్త్రముల వర్గమునకు అను ఉపశాఖలుగా విభజింపబడినది. (Canonical) సంబంధించినవి. ఇట్టి ధర్మశాస్త్ర పరి భాషకు చెందని (non-canonical) వర్గములో ధర్మ శాస్త్రములపై బుద్ధఘోషుడు, ధమ్మపాలుడు రచించిన