Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/689

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము = 8 చరిత్రాధారములు


చారిత్రకవాస్తువు చిత్రకళ : ట్రోజన్ భవన స్తంభముల పై తీర్చి చెక్కబడిన శిల్పచిత్రములు, బేయక్స్ (Bayeux) చిత్ర జవనికలు (రంగు తెరలు), వివిధములైన బౌద్ధస్తూప ములు, అజంతా వర్ణచిత్రములు, ఎల్లో రాశిల్ప చిత్రములు మున్నగునవి కూడ ముఖ్యమైన చరిత్రాధారములుగ భావింపబడుచున్నవి.

ప్రాచీన_లిఖిత పత్రములు (Documents) : అట్లే ముఖ్యమైన జాతీయ, సాంఘిక విశేషములనుగూర్చి, ప్రభుత్వ శాసనములను గూర్చి తెలుపు అధికారిక పత్రముల యొక్క మూలములు జాతీయకవిలెభాండారముల (National Archives) యందు భద్రపరుపబడును. ఉదాహరణము నకు 'డూమ్స్ బుక్ ' (Domesday Book), పార్లమెంటు రికార్డులు, కోర్టు రికార్డులు, చార్టర్లు, ఇతర ప్రభుత్వపు రిజిస్టర్లు, పత్రములు, ఫర్మానాలు, రసీదులు, తాళ పత్ర గ్రంథములు, ఆముక్తమాల్యద, పురాణములు మొదలగు నవి గ్రంథ నిలయములందు భద్రముచేయబడుచున్నవి. ఇవన్నియు చరిత్ర 'రచనమునకు అమూల్యములైన ఆధారములే.

బుద్ధుడు మొదలగువారి గతకాలపు విగ్రహములు, చిత్రపటములు సమకాలీన సాక్ష్యాధారములచే ధ్రువపరుప బడినచో, అవి పైన వివరింపబడిన చరిత్రాధారముల శ్రేణిలో చేరదగినవిగా భావింపవలెను. ఏతత్సాధనముల వలన, కీర్తి శేషులయిన మహావ్యక్తులు ధరించిన ఉడుపులు, ఆభరణములు మొదలగు వాటివలన, ఆనాటి సాంఘిక, సంస్కృతీ విశేషములను గ్రహించవచ్చును.

ముద్రితాధారములు : ఇప్పుడు అచ్చుయంత్రములు వచ్చినవి. వీటి సహాయమున వ్రాతప్రతికి సరియైన విధముగా ముద్రిత ప్రతులు కావలసినన్ని సిద్ధమగుచున్నవి. ఈ విధముగా చారిత్రక కధనము యధాతధముగా భద్రత చెందు చున్నది. గ్రంథకర్త పర్యవేక్షణమున ముద్రితమగు చారిత్రక గ్రంథమునకు వ్రాతప్రతి మూలమునకు గల చారిత్రక ప్రామాణికత గలదు. కాబట్టి ఇవియు ప్రామాణిక చరిత్రాధారము.

పురాతత్వ విశేషములు : ప్రాచీన కట్టడములు, భూతలముపై నిర్మాణములైన కుల్యావ శేషములు, వాటి పుట్టు పూర్వోత్తరములను గురించియు, వాటి ఉనికిని గురిం చియు, వర్ణితమైయున్న చారిత్రక దస్తావేజుల కధనముల సత్యమును నిరూపించుచుండును. పార్థినన్, కొలై సియ ముల (Parthenon Coliseum) శిధిలావ శేషములు, మహాబలిపుర, తంజపుర దేవాలయముల వాస్తుశిల్పము, విజయనగర శిధిలావ శేషములు — ఈ కట్టడముల నిర్మాణ గ్రంథములయందలి విశేషములకు అవి ప్రత్యక్షములైన సాక్ష్యాధారములుగా మును గురించి వివరించు సమకాలీన

వ్రాతప్రతులు, నకళ్ళు: అచ్చుయంత్రములను కని పెట్టుటకు పూర్వము చరిత్ర గ్రంథములు, ఇతర వాఙ్మయ గ్రంథములు వ్రాయస కాండ్రు లిఖిత ప్రతుల రూపములలో భద్రపరుపబడియున్నవి. గ్రంథకారుని స్వహస్త లిఖిత మూల ప్రతులు, గ్రంథకారులచే సరియైన నకళ్ళుగా ధృవీకరింపబడిన వ్రాత ప్రతులు, ఆ వ్రాత ప్రతులకు అనతి కాలములో సిద్ధము చేయబడిన నకలు గ్రంథములు ఆదృ శ్యములై నవి. అందుచే ముఖ్యముగా ప్రాచీన రచయితలచే వ్రాయబడిన గ్రంథములకై మూలములతో ఎక్కువగా ఏకీభవింపని వ్రాతప్రతులపై మన మాధార పడవలసి వచ్చినది. కొన్నింటి విషయములో అత్యంత ప్రాచీన ము లైన వ్రాతప్రతులు యాదృచ్ఛికముగా భద్రపరుపబడి యున్నవి. హెర్క్యులెస్నకు సంబంధించిన వ్రాతప్రతులు, 'పలింప్ సెస్ట్ 'నకు చెందిన వ్రాత ప్రతులు, 'నూతవ నిబంధన’ (New Testament) మునకు సంబంధించిన వాటికన్, అలెగ్జాండ్రిన్ వ్రాతప్రతులు, 'డై జెస్ట్' (Digest) యొక్క ఫ్లోరెంటైన్ వ్రాతప్రతులు పై పేర్కొనబడిన కోవలో చేరినవే. ప్రాచీన భారతీయ తామ్రశాసనములుకూడ ఈ తరగతికి చెందిన చరిత్రాధారముల క్రిందికి రాగలవు.

వాఙ్మయము; గేయకవిత: స్పెయిను, ఇంగ్లండు, స్కాట్లెండు, జర్మనీ, అరేబియా, ఇండియా, చైనా మున్నగు దేశములయందలి కవిత తరతరములుగా మనకు సంక్రమించి నిలిచియున్నది. ఈ కవితను మనోహరముగా గానము చేసినవారికి సన్మానములు గూడ చేయబడెడివి. కాళిదాసు మహాకవి, బాణభట్టు మహాకవి మొదలగు వారు ఈ వర్గమందలి వారు. వారి రచనలు, ఆ కాలపు సాంఘిక, సాంస్కృతిక జీవనమునకు ముఖ్యములైన ఆధారములై యున్నవి.