Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/688

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

చరిత్రాధారములు సంగ్రహ ఆంధ్ర

“పొలిబియస్ చరిత్ర” (History of Polybius), సీజరు వ్రాసిన “గాలిక్ యుద్ధ చరిత్ర" - వీటియం దెక్కువభాగము ఆ యా చారిత్రకోదంతజ్ఞానము స్వయముగా కలిగి యుండుటవలననే వ్రాయబడియున్నది. లార్డు క్లారెండన్ అను నాతడు తాను రచించిన విప్లవ చరిత్ర గూడ అట్టి ఆధారబద్ధమైనదేయని తెలిపినాడు. అట్లే మెగస్తనీసు, ఫాహియాను, ఇత్సింగ్, హుయాన్ త్సాంగ్, మార్కో పోలో, ఆల్ బిరూనీ మున్నగువారు వ్రాసియున్నారు.

అయితే, ఒక జాతియొక్క చరిత్రయందు ఒకే కాల మున అనుకొనని విధముగా పలు ప్రదేశములందు పెక్కు సంఘటనలు సంభవించును. అట్టి పరిస్థితులలో సమకాలికుడైన చరిత్రకారుడు తన చరిత్ర చిత్రణమునందు ఇతర చరిత్రకారుల కధనములనుండి ఎక్కువ భాగము గ్రహించవలసి యుండును. తాను అభివర్ణించ దలచిన ప్రభుత్వ వ్యవహారములను, న్యాయస్థాన కలాపములను, ప్రజా కల్లోలములను, సైనిక పోరాటములను అతడు ప్రత్యక్షముగా దర్శించియుండక పోవచ్చును. ముఖ్యముగా విదేశములందు జరుగు యుద్ధ ప్రక్రియలు, నావికా యుద్ధములు, సముద్రపుటోడల రాకపోకలు మున్నగు విషయములను చరిత్ర కారుడు స్వయముగా చూడ జాలడుగదా !

థుసిడైడ్స్ అను రచయిత తన చరిత్ర రచనమును, యుద్ధ సంఘటనములను గూర్చి ఎవరో యాదృచ్ఛికముగా తెలియ జేసిన కధనము పైననో, ఆతని ఊహపోహల పైననో ఆధారపడి సాగించియుండలేదు. సాధ్యమైనంత మేరకు స్వీయానుభవములనుండి గాని, స్వీయ పరిశీలనము నుండి గాని, లేక స్వయముగా అట్టి విశేషములలో పాల్గొనిన వారి వద్దనుండి గాని, లేక దర్శించిన వారి వద్ద నుండి గాని సమాచారమును సేకరించెను. ఇట్టి విధానము శ్రమతో కూడిన పని యని కూడ అతడు వ్రాసియుండెను. ప్రతి విషయమును ప్రత్యక్షముగా వీక్షించినవారు కూడ దానిని గూర్చి ఒకే రక మైన కధనమును నివేదింప జాలరు. వారి వారి దృక్పథములనుబట్టి, జ్ఞాపకశక్తిని బట్టి వారి కధనముల యొక్క సత్యాసత్యములు, స్వభావ లక్షణ ములు మారుచుండును. థియోపాంపస్ అను నాతడు గూడ తన చరిత్రరచనకై బహు ప్రయాసతో పలు విష యములను సేకరించినట్లు తెలియుచున్నది. అనేక విషయములను ఆతడు స్వయముగా చూచియుండెను. కాని ఇతరులను గూర్చిన సమాచారమును సమ కాలీన ప్రముఖుల నుండియు, సైనిక నాయకుల నుండియు, ప్రజానాయ కుల నుండియు, తత్వవే తలనుండియు సేకరించెడివాడు. సెయింట్ ల్యూక్, తాను రచించిన “సువార్త" (Gopsel) అను గ్రంథమున ఉపోద్ఘాత భాగమునందు ప్రపంచము లోని ప్రత్యక్షదర్శకులు, ధర్మాధికారులు లభింపజేసిన సాక్ష్యాధారములను అనుసరించి తన గ్రంథమును రచించి నటుల చెప్పుకొని యున్నాడు. బాణరచిత మైన “హర్ష చరిత్రము" గూడ ఒక ప్రముఖ ఆధార గ్రంథముగా ఇట్టి ఉదాహరణము క్రిందికి వచ్చును.

శాసనములు : ఏదైన నొక విషయమును గూర్చిన లిఖితరూప శాసనము యొక్క విశ్వసనీయతకు, కాల ప్రభావమువలన నే నష్టము ఘటిల్లజాలదు. కాలము గడచి పోయినంత మాత్రముననే లిఖితాధారములయొక్క సాక్ష్యబలము క్షీణింపదు. ఆయితే అట్టి లేఖనములుగల పదార్థములను నిర్మూలనముచేయుటపలనమాత్రము సాక్ష్య ప్రాబల్యము క్షీణించును. శిలలపైన, ఇత్తడి రేకులపైన, మన్నిక కూర్చు ఇతర పదార్థములపైన చెక్కబడిన ప్రాచీన శాసనములయందువలె పెక్కు సందర్భములలో స్మరణార్థక వస్తుయధారూపము రక్షింపబడి యుండును. బాబిలోనియా, అప్సిరియా దేశములలోని భవనముల ఇటుకలపై గల బాణలిపి లేఖనములు, ఈజిప్టు వాస్తు శిల్పావ శేషముల పై చెక్కబడిన చిత్రలిపి విన్యాసములు (hieroglyphics), అసంఖ్యాకములైన గ్రీకు, లాటిను శాసనములును, మొహెంజోదారోలోని రాజ ముద్రి కలు, అశోకుని ధర్మ శాసనములు మొదలగు స్మారక చిహ్నములు వేర్వేరు యుగములయందు అవతరించి యున్నవి. అయినను అవి యింకను ఆసియా మైనరు, ఆఫ్రికా, ఐరోపా, భారత భూభాగములయందు కనబడు చునే యున్నవి. 2

నాణెములు : : శాతవాహనులు, గు ప్తరాజులు మొదలగువారు ప్రకటించిన ప్రాచీన నాణెములు, తత్సంబంధ కధనములుగూడ అట్టి తరగతికి చెందిన మరి యొక ప్రామాణికాధారమై యున్నది.