చరిత్ర రచనారీతుల వికాసము
సంగ్రహ ఆంధ్ర
లతో గూడిన పుక్కిటి పురాణములే గాని చరిత్ర గ్రంథములు గావనియు చెప్పుట పరిపాటి యైనది.
మహమ్మదీయులు చరిత్రకు ఎక్కువ ప్రాధాన్యము నిచ్చి, మధ్య యుగమునాటి చరిత్ర లెన్నియో వారు రచించిరని పెక్కుమందికి నమ్మకము కలదు. కాని ఇటీవల ఆంగ్లదేశీయ చరిత్ర విమర్శకులు మహమ్మదీయ చరిత్ర గ్రంథములను విమర్శించి, అవి చాలవరకు మత దృష్టితోను, పక్షపాతముతోను వ్రాయబడిన ప్రచార గ్రంథములేకాని, శాస్త్రీయములైన చరిత్ర గ్రంథములు కావనియు, వానిలో సత్యచరిత్ర చాలవరకు మృగ్యమనియు వక్కాణించి యున్నారు.
అసలు, చరిత్ర యననేమి? అని నిర్ధారణ చేయుట యందే పండితులమధ్య ఎన్నియో మతభేదములు కలవు. చరిత్ర శాస్త్రమని కొందరును, శాస్త్రమని ఒప్పుకొన్నను ఇతర శాస్త్రముల పద్ధతికిని, చరిత్ర పద్ధతికిని చాల భేదము కలదని మరికొందరును, వాదించుచున్నారు. ఇతర విజ్ఞాన విభాగములందు వలెనే ఈ విషయమునందు గూడ పాశ్చాత్యులు అధికముగ కృషి సల్పి ఎన్నియో గ్రంథములను రచించి యున్నందున, చరిత్ర రచన ప్రాచీన కాలము నుండియు, పాశ్చాత్య దేశములందు, ఏరీతిగ సాగుచు వచ్చినదో, కాలక్రమముగ పాశ్చాత్య చరిత్రకారుల దృక్పథము నందును, వారి రచనా పద్ధతుల యందును ఎట్టి మార్పులు కలుగుచు వచ్చినవో, పరిశీలించిన యెడల మనకు చరిత్రయొక్క సత్యస్వరూపము కొంతవరకు బోధపడును.
ఇప్పటికి సుమారు మూడువేల సంవత్సరములకు పూర్వము రచింపబడిన పెంటాట్యూక్ (Pentateuch), జోషువ (Joshuva), సామ్యుఅల్ (Samual), అను వారల గ్రంథములలోని జెహోవాభాగములు ప్రపంచ చరిత్రలో ప్రాచీనతమము లని పాశ్చాత్యుల అభిప్రాయము. తరువాత క్రీ. పూ. సుమారు 575 వ సంవత్సర ప్రాంతమున 'ప్రభువుల గ్రంథము' (Book of Kings), రచింపబడెను. అటు పిమ్మట ఇస్రాయిల్, జూడారాజుల కాలమానపట్టికలును(Chronicles), బాబిలోనియాదేశపు బెరోస్సాస్ చరిత్రయు (History of Berossos), ఈజిప్టు దేశపు మనెథో వంశావళియు (Annals of Manetho) - ఈమూడును సుమారు క్రీ. పూ. 3 వ శతాబ్దమున రచింపబడెను. ఈ గ్రంథము లన్నియు విగ్రహ నిర్మూలనమును సాధించుటకును, మానవునికి భగవంతుని లీలలను గూర్చి నచ్చ చెప్పుటకును, ధర్మమును ప్రతిపాదించుటకును, రచింపబడిన గ్రంథములే కాని చరిత్రలు కావు. వీరు చెప్పు విషయములు ఏ ఆధారములనుండి సంగ్రహింపబడినవి ? ఆ యాధారములు ఎంతవరకు నమ్మదగినవై యున్నవి ? ఇత్యాది ప్రశ్నలు చరిత్రరచనకు అత్యవసరమైన ప్రశ్నలు. ఇవి ఆనాడు వారికి స్ఫురించినట్లే తోచదు.
ఆరంభదశకు పిదప చరిత్ర రచన సాగించినవారు గ్రీకులు. వీరు మతదృష్టికి లొంగిపోక హేతువాదమును అధికముగ పెంపొందించిన జిజ్ఞాసువులు. వీరిలో చరిత్ర రచించిన ప్రథముడు, మైలెటస్ నందు క్రీ. పూ. 546 వ సం॥ నందు జన్మించిన హెక్‌టేయస్ (Hecatacus) అను నాతడు. కాని ఇతనితరువాత చరిత్ర రచించిన హాలీ కార్నస్సస్ హెరోడటస్ (Herodatus of Halicarnessus క్రీ. పూ. 484 - 425) అను వానిని తరచుగా చరిత్ర పితామహుడని పాశ్చాత్యలు పేర్కొనుచుందురు. గ్రీకులకును, పర్షియనులకును నడుమ జరిగిన యుద్ధమును గూర్చి హెరోడటస్ వ్రాసినందున, ఉత్తమమైన కథా వస్తువు అతనికి సంప్రాప్తమాయె ననవచ్చును ఇంతకంటె చరిత్రను జాగ్రత్తగా రచించినను థుసిడైడిస్ (Thucydides - క్రీ. పూ. 471 - 401) అను నాతడు కేవలము రెండు గ్రీకురాజ్యముల పరస్పర కలహములనుగూర్చియు యుద్ధములను గూర్చియు వ్రాసినందున అది రక్తి కట్ట లేదు.
రోమనులలో చరిత్రకారులే లేరని చెప్పవచ్చును. కాబట్టి వారి చరిత్రను రచించిన గ్రీకు చరిత్రకారుడు పోలిబియస్ (Polybius - క్రీ పూ. 204 - 122) రోము చరిత్ర రచయితలలో మేటియనవచ్చును. సీజరు చక్రవర్తి వ్రాసిన 'గాలిక్ యుద్ధ' మను గ్రంథమును (కీ. పూ. 51 సం॥ నాటిది) చరిత్రయనుటకంటె సీజరుయొక్క ఆత్మకథ యనుట సమంజసము. సీజరు సమకాలికుడు సాల్లస్టు (Sallust - క్రీ. పూ. 86 - 34) అను నాతడు వ్రాసిన చరిత్ర గ్రంథము కానవచ్చుట లేదు. కాని కాటలైను
624