పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము = 3 కేరళదేశము (చరిత్ర)


ఇట్టి పురములే. తిరునల్వేలి ప్రాంతమునుండి పలుమారు లాక్రమణ జరుగుచుండుటచేత కల్కులమ్ అనుచోట సేనలను స్థాపించి రక్షణమున కేర్పాట్లు చేయవలసి వచ్చినది. అందుచేత అదే రాజధానిగా మారిపోయినది. ప్రాచీన రాజధాని కొల్లమ్ (Quilon) యొక్క ప్రాముఖ్యము తగ్గిపోయినది. ఈ కాలపు విదేశీయులగు యాత్రికుల వ్రాతలవలన, సంఘటితమైన వ్యవస్థ కలిగి అభ్యుదయ పథములో నడచుచున్నట్లు తెలియుచున్నది. క్రీ. శ. 15-16 శతాబ్దముల కాలము విజయనగర సామ్రాజ్య విస్తరణమునకు చెందినది. విజృంభమాణమగు మహమ్మదీయుల శక్తి నెదుర్కొని వారి నరికట్టు బాధ్య తను వహించి విజయనగర రాజులు ఇతర హిందూ రాజు లకు సాహాయ్యమొసగి వారిని సామంతులనుగా నొనర్చు కొనిరి. తిరువాన్కూరునకు అట్టి సాహాయ్య మనవసరమై నందున విజయనగరమునకు అది తలయొగ్గలేదు. తత్కా రణముగా స్పర్ధ ఏర్పడి క్రీ. శ. 1509 ప్రాంతములో యుద్ధముజరిగి, తిరువాన్కూరు గెలిచినదని బుడతకీచు వైస్రాయి వ్రాసియున్నాడు. ఒక శతాబ్దము వరకు అనేక సారులు విజయనగర తిరువాన్కూర్ల మధ్య యుద్ధ ములు జరిగినవి. అట్లే మధురనాయకులతోను పోరాట ములు జరిగినవి. ఈ కాలములోనే బుడతకీచులు ఉత్తర మలబారుతీరమున వ్యాపారమునకై వచ్చి స్థానముల నాక్రమించుకొనిరి. కొల్లం (Quilon) మున్నగు ప్రదేశ ములందు ఫ్యాక్టరీలను పెట్టిరి. సెంటుఫ్రాన్సిన్స్ ఝెవి యర్ (St. Francis Xavier) దక్షిణ తిరువాన్కూరులో నివసించి క్రైస్తవమత ప్రచారము సాగించెను. ఈ కాలపు రాజులలో ఉదయమార్తాండవర్మ కీర్తిమంతుడయ్యెను. క్రీ. శ. 17వ శతాబ్ది అత్యంతమగు అశాంతికాల మని చారిత్రకు లొప్పుకొ నెదరు. ఈ కాలముననే రవివర్మ యను మైనరు రాజునకు రీజెంటుగా రాణి ఉమాయమ్మ పరిపాలించినది. ఆమె, క్రీ.శ.1684వ సంవత్సరములో బ్రిటిషువారికి ఒక ఫ్యాక్టరీని నిర్మించుటకు అనుజ్ఞ నొసగి, బ్రిటిషువారి స్నేహాదరములకు పాత్రురాలైనది. అంతకు

  • మున్నే ఉన్ని కేరళవర్మ క్రీ. శ. 1644 లో ఒక ఫాక్టరీని

నిర్మించుటకు అనుజ్ఞ నొసగియుండెను. ఈ సంబంధ మే బలవడి తిరువాన్కూరు కూడ, ఈస్టు ఇండియా కంపెనీ

యొక్క అధికార ప్రాబల్యమునకు ఇతర దేశీయరాజ్య ములవలె లొంగిపోయినది. క్రీ. శ. 18వ శతాబ్దమున సుప్రసిద్ధు డగు మార్తాండ వర్మ పరిపాలనలో తిరువాన్కూరు రాజ్యమునకు గొప్ప స్థాయి లభించినది. ఈ మహారాజు చిన్ని చిన్ని సంస్థాన ముల నేలుచు, పరస్పర కలహము లొనర్చుచు, ప్రజల పై దౌర్జన్యములను గావించుచు రాష్ట్రమునందు అశాంతికి సామంతుల నందరిని జయించి, వశులను గావించుకొని, దాడి చేయుచుండు వివిధ సాయుధ నాయర్ ముఠాల మద మడచి, కొచ్చి వరకుగల తిరు వాన్కూరు భూ భాగము నెల్ల సంఘటితపరచి, ఆభ్యు దయపథమున నడచు పరిపాలన మొనర్చెను. చట్టము లనుచేసి, జలాశయములను కట్టించి ప్రఖ్యాతిని గాంచెను. ఈ మహారాజు కావించిన అపూర్వమై, చరిత్రాత్మక మైన ఒక మహాకార్యము తిరువాన్కూరు రాజ్యమును శ్రీ అనంతపద్మనాభస్వామికి సమర్పించి, తాను శ్రీ పద్మనాభ దాస యను పేరుతో పరిపాలించుటయై యున్నది. ఈ పదమే ఇప్పటికిని వాడబడుచు నేటి బాల రామవర్మ చిత్రా తిరునాళ్ మహారాజావారి యొక్క క్క బిరుద మై విరాజిల్లుచున్నది. మార్తాండపర్మచే సంఘటితమైన విస్తృత తిరువా నూరు రాజ్యమును అతని మేనల్లుడగు రామవర్మ కార్తిక తిరునాళ్ మరింతదృఢపరచి కర్ణాటక నవాబులతోను, కాలి కట్టు సాముద్రీ రాజులతోను తిరునల్వేలి పాళెగార్లతోను యుద్ధమొనర్చి, వారి ఆక్రమణము నుండి రాజ్యమును కాపాడుచు పరిపాలనను సంస్కరించి, ఆధునిక పద్ధతులను ప్రవేశ పెట్టి, శాంతిభద్రతల నెలకొల్పి, అభ్యుదయ పథాను వర్తియై పద్యశమును కాంచెను. 'ధర్మరాజు' అను విఖ్యాత నామముతో ప్రజ లతనిని గౌరవించిరి. ఇతని పిదప బాలరామవర్మ పరిపాలనా దక్షత లేనివాడై కుట్రలు పన్ను నీచులగు సలహాదారుల చేతులలో కీలు బొమ్మయై, అవయశస్సును గాంచుటచే, ప్రజలలో సంక్షోభము కలిగినది. వేలుతంపి దళవాయి అని ప్రసిద్ధి గాంచిన ఒక వీరుడు తిరుగుడు పాటు చేసి ప్రధానిగా నేర్పడి, అక్రమపరిపాలనము నంతమొందించెను. ఈస్టు ఇండియా కంపెనీవారికి చెల్లింపబడుచున్న పైకము 29