పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కేరళదేశము (చరిత్ర) సంగ్రహ ఆంధ్ర


మూడు ప్రత్యేక విభాగములు కలిగి, తిరిగి క్రీ. శ. 825 వ సం॥ రమునకు పూర్వపు రూపమును పొందినది. కావున ఈ రాష్ట్ర చరిత్రమును మూడు భాగములుగా విభజించి సంగ్రహముగా పొందుపరచుట యుక్తము. తిరువాన్కూరు రాజ్యము: తిరువాన్కూరు రాజులు ఇతిహాస పురాణాదులందును తమిళసంఘ వాఙ్మయము నందును పేర్కొనబడిన చేరవంశమునకు తాము చెందిన యట్లు భావింతురు. క్రీ. శ. కంటె పూర్వమునుండి యే ఈ వంశపు చరిత్ర ప్రాచీన తమిళ గ్రంథములందు కాన బడుచున్నది, వీర కేరళ వర్మ రాజ్యాభిషిక్తుడై 'వేనాటి' కధిపతియైనపుడు తులాభార పద్మగర్భ సంస్కారముల నాచరించె ననియు, వీరమార్తాండవర్మ కలియుగాది 3831 వ సంవత్సరమున 'కులశేఖర పెరుమాళ్' అను బిరుదమును గ్రహించె ననియు గాథ కలదు. కుల శేఖ రాళ్వార్ అని వైష్ణవులచే పూజింపబడు చేర రాజు ఈ వంశమునకు చెందిన ప్రాచీన పురుషుడు తన తపతీ సంవరణము అను సంస్కృత నాటకమందు 'కేరళ చూడామణి' అను తన బిరుదమును తెలుపుకొన్నాడు. కొన్ని శాసనములవలనను ఈ విషయము రుజువగుచున్నది. శ. 7 వ శతాబ్దములో పాండ్యరాజగు అరి కేసరి మారవర్మ ‘కొట్టార' అను పురముపై దండెత్తెననియు ఆపురము చేరరాజులకు చెందినదనియు 'నక్కి రార్ ' రచనల వలన తెలియుచున్నది. క్రీ.శ. 12 వ శతాబ్ది యందు వెలసిన పరాంతక పాండ్యరాజుయొక్క కన్యా కుమారి శాసనము తిరువాన్కూరు చేరరాజును స్పష్ట ముగా పేర్కొనుచున్నది. శ్రీరంగము, విరుద్ధనీశ్వ రము, తిరువనంతపురము. పొన్నామలే మున్నగు శాసన ములు ఈ రాజులను చేరరాజులనియే వ్యవహరించు చున్నవి. కురు క్షేత్రయుద్ధమున చేరరాజులు పాల్గొనినట్లు మహా భారతము చెప్పుచున్నది. ఈ చేర రాజులు ఉత్తరభారత ముపై దండెత్తినట్లును, తరువాతి కాలమున చేర రాజులు చోళ పాండ్యుల సంయుక్త సేనలను తరిమి వేసినట్లును తమిళ సంఘ సాహిత్యమున చెప్పబడియున్నది. చేరమాన్ పెరుమాళ్ అను బిరుద నామముతో ఈ చేర రాజులు పరిపాలించి కాంగనూరు, తిరువంచికులమ్ మున్నగు


ప్రదేశములందు రాజధానులను కలిగియున్నట్లు తెలియు చున్నది. క్రీ.శ. 825 ప్రాంతములో, వారి రాజ్య వైశా ల్యము తగ్గి, చక్రవర్తిత్వము పోయి, విభజింపబడిన పిదప 'వేనాడు' అను భాగమును పాలించినవారే తిరువానూరు రాజులు. అప్పుడు కొల్లమ్ (Quilon) అను పట్టణము వారికి రాజధానిగా నుండెను. ఈ రాజులలో శ్రీవల్లభ కొత్తా గోవర్ధన మార్తాండ, వీర కేరళ వర్మ, కొత్త కేరళ వర్మ, శ్రీవీర రవివర్మ, రెండవ శ్రీవీర కేరళ వర్మ, అరయమార్తాండ వర్మ, శ్రీదేవాథరన్ కేరళ వర్మ మున్నగు పేరులు వినబడుచున్నవి. శ్రీవీర రామ కేరళ వర్మకును (క్రీ.శ. 1209-1214) శ్రీవీరరవి కేరళ వర్మ కును తరువాత, సుప్రసిద్ధుడగు మార్తాండ వర్మ మిగుల బలవంతుడై అనేక సామంత నాయకులకు ప్రభువై రాజ రాజ స్థాయి నందుకొ నెను. ఇతని తరువాత రవివర్మ కులశేఖరుడు క్రీ. శ. 1299 నుండి 1313 వరకు పరిపాలించెను. విక్రమపాండ్యుని జయించి పాండ్య రాజు కూతురును రాణిగా గై కొనెను. పశ్చిమ సముద్రతీరము నాక్రమించుకొని, సహ్యాద్రిని దాటి నెల్లూరువరకు గల ప్రదేశమును వశపరచుకొని, వేగవతీ నదీతీరమునగల సుప్రసిద్ధ కాంచీపురమున ‘రాజాధి రాజ పర మేశ్వర' బిరుదముతో తన 46 వ యేట దక్షిణా పథ చక్రవ ర్తిగా అభిషిక్తుడయ్యెను. శ్రీరంగమునందును, తిరుపతియందును అభిషేకోత్సవములను జరుపుకొనెను. పరమధార్మికుడై అనేక దేవాలయాది హిందూ సంస్థల నుద్ధరించి, స్వయముగా పండితకవియై అట్టి వారిని పోషించెను, స్వయముగా 'ప్రద్యుమ్నాభ్యుదయ' మను రసవత్తర సంస్కృత నాటకమును రచించెను. కాని ఈ విజయములన్నియు ఆతని ఆకస్మిక మరణమువలన అంత -మొందుటచే కాకతీయ సామంతులును, పాండ్యరాజులును తమ ప్రాంతములను మరల కైవస మొనర్చుకొనిరి. వీర రవివర్మ తరువాత పాలించిన రాజులలో ఆదిత్యవర్మ రామమార్తాండవర్మ, ఆదిత్యవర్మ, సర్వాంగనాథ వీర రవివర్మ, చేర ఉదయమార్తాండ వర్మ, ముఖ్యులు. 6- క్రీ. శ. 6-7 శతాబ్దములలో ఈ రాజ వంశమువారు రాష్ట్రములో వివిధ భాగములందు వసించుట కారంభించిరి. నిడుమంగాడు, కొట్టారకరా, కల్కులమ్, మున్న గున వి

28