పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కేరళదేశము - చరిత్ర సంగ్రహ ఆంధ్ర


మన శరీరములో ఇనుము, కాల్షియము, అయోడిన్ మున్నగు అనేక మూలకములు ఉండును. చాల కాలము వరకు శరీరములో ఏ నిర్దిష్ట (particular) భాగము నందు అయోడిను ఉండునో గుర్తించుట కష్టమయ్యెను. నేడు ఒక వ్యక్తికి రేడియో అయోడీనును ప్రయోగించిన యెడల, ఇది తిన్నగా సాధారణపు అయోడీను ఉండు తావునకు సరిగా పోవును. ఎందుచేతనన, ఈ రెండును సస్థానికము (isotopes) లగుటచే రసాయనిక ముగా సర్వవిధముల సదృశములై యుండును. రేడియో అయోడినును, దాని రేడియో ధార్మిక శక్తిని బట్టి G. M. కౌంటరు సహాయమున సులభముగా గు ప వచ్చును. దానిని బట్టి అయోడిను యొక్క స్థానమును కని పెట్టవచ్చును. ఈ విధముగా గళ గ్రంథి (thyroid gland) యొక్క స్వస్థతకు తగుమాత్రపు అయోడీను ఆవశ్యకమని కనుగొనబడెను. అయోడిను, భాస్వరము, గంధకము, కర్బనము, సోడియము అనువాటి యొక్క ఐదు రేడియో సస్థానకములు (isotopes) వైద్యసంబంధ మైనట్టియు, శరీర సంబంధమైనట్టియు, జీవ సంబంధ మైనట్టియు పరీక్షల యందు గుర్తించు సాధనములు (traces) గా విస్తారముగా వాడబడుచున్నవి. శోధక (గుర్తించు) నై పుణ్యము చెట్లలో జరుగు ఈ క్రింది ప్రతి క్రియ లందును, పరిశ్రమలందును విస్తారముగా ఉపయో గింపబడుచున్నది. జాగ్రత్తగా తయారుచేయబడిన జింకు సల్ఫైడుతో గూడిన రేడియో ధోరియము (Lకణము లను బయలు గ్రక్కునది) యొక్క మిశ్రమము శాశ్వత మగు ప్రకాశమును కలిగించును. అది గడియారములో అద్దుటకు ఉపయోగపడుచున్నది. రేడియం నుండి వెడలు 8 (గామా) కిరణములు, ఆరోగ్యముగా నుండు చర్మమునకు అపాయకరములై నప్పటికిని, కాన్సరు వంటి వ్యాధులను కుదుర్చుటకు ఉప యోగపడుచున్నవి. రేడియో కోబాల్టు (cobalt) ఇదే విధమగు కిరణములను వెడలించును కనుక అది ఇప్పటి గ్రాము ఒకటికి రు. 65,000 ల విలువ గల రేడియం యొక్క స్థానములో అమోఘమును, చౌకయు నగు ప్రత్యామ్నాయముగా వాడబడుచున్నది. వి. వి. వ.

కేరళ దేశము - చరిత్ర : ప్రాచీన కేరళము: ఐత రేయారణ్యక మునందు ' చేర 'అను పదము కనిపించుచున్నది. చేరులు కొన్ని ప్రాచీన నియమ ములను ఉల్లంఘించిన మూడు తెగల ప్రజలలో ఒకరుగా పేర్కొనబడి యున్నారు. దక్షిణాపథమునందలి ఇతర జనుల ఆచార వ్యవహారములనుండి కేరళీయులు బహుళ ముగా అతి ప్రాచీన కాలములోనే విడిపోయి యుందురు. రామాయణమునందును, మహాభారతమునందును,' కేరళ' అను పేరు కలదు. సుప్రసిద్ధ వైయాకరణియగు కాశ్యా యనుడు (క్రీ.పూ. 4 వ శతాబ్దము) కేరళమును పేర్కొని యున్నాడు. కాళిదాసు కాలమువరకే 'కేరళ' అను నామము ఈ ప్రదేశమునకు రూఢియై యుండెనని ఆతని రఘువంశమున గల “భయోత్సృష్ట విభూషాణాం" అను శోక మువందలి ' కేరళ యోషితాం' అను సమాస ప్రయో గముచే స్పష్టమగుచున్నది. గ్రీకులు చారిత్రక గ్రంథము లలో 'కేరబోత్రాస్' (Kerabothras) అను భారతీయ పరిపాలకుడు పేర్కొనబడినాడు. అశోకుని రెండవ శాస నము, పదమూడవ శాసనము (Edict) ప్రత్యంత రాజ్య ముల పట్టికలో కేరళ పుత్రులు రాజ్యమును పేర్కొను చున్నవి. గ్రీకుల దూత యగు మెగస్తనీసు చేర రాజ్య మును, ఆ దేశపు నాయర్లను పేర్కొనియున్నాడు. పరశురాముని పరశు ప్రహారమువలన సముద్రము నుండి తేలిన భూభాగము 'కేరళ' అని ఒక గాథ నుడువు చున్నది. దీనికి కేరళ తీరభాగము యొక్క వైసర్గిక స్వరూపమే కారణమైయుండును. 'కేరళ'ను పరశురామ క్షేత్రమని సంకల్పమునందు పేర్కొనుటయు గలదు. చారిత్రకముగా ఇది యెంతవరకు సత్యమో తెలియదు. రఘువంశమున 4 వ సర్గయందు గల 58, 53 శ్లోకముల వలన పరశురాముని అస్త్రముచే అపరాంత దేశము సముద్రమునుండి ఉత్సారిత మయిన దను గాథ కాళి దాసుని కాలమున నే ప్రసిద్ధమైయుండెనని తెలియుచున్నది భూగోళ శాస్త్రజ్ఞులు మాత్ర మొక కాలమున సముద్ర భాగమగు ఈ ప్రదేశము సముద్రము వెనుకంజ వేసినందున తేలిన భూమియని సిద్ధాంతపరచిరి. పూర్వము సముద్రము పశ్చిమ కనుమల పాదములవరకు వ్యాప్తమై యుండెను. తదుపరి అనేక నైసర్గికములయిన మార్పులవలనను,