పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము = 3 కేంద్రకిరణ శాస్త్రము


కలిగియుండును. అది వేరు వేరు వలయములందు (orbits) చలించుచుండు విద్యుదణువుల (electrons) చే పరివేష్టి తమై ఉండును. దానియందు పరమాణు భారమంతయు కేంద్రీకరింపబడి యుండును. కేంద్రకము (nucleus) యొక్క వ్యాసార్థము సుమారు 10-13 సెంటిమీటర్లు ఉండును. పరమాణువు యొక్క వ్యాసార్థము 10-8 నెం. మీ. ఉండును. ఇట్లు పరమాణువు సౌర విధానము (solar system) ను పోలియుండును. కణము ఒక పరమాణువుగుండా పోవునపుడు సాధారణముగా అతి క్రమణము (deviation) చెందిగాని చెందక గాని, ఒక విద్యుదణు మేఘము (electronic) గుండా పోవును. కాని సకృత్తుగా (Occasionally) ఒక (హిలియం కేంద్రకము) పరమాణు కేంద్రకము (nucleus) యొక్క దిశలో దూసుకొని పోవచ్చును. కేంద్రకముల మధ్యనుండు వికర్షణము వలన ఆ కణము తక్కువ ద్రవ్యరాశి కలదగుటచే పెద్ద కోణము గుండా అతిక్రమణము నొందును. ఈవిధముగా పెద్దకోణము యొక్క ప్రసారమునుబట్టి కేంద్రకము యొక్క పరి మాణమును గూర్చిన అంచనా మొట్టమొదటగా చేయ a కణము బడును. (b) B కిరణములు : ఇవి అతివేగముగా చలించు చుండు ఋణ విద్యుత్పూరితములగు కణములు. వీటి వేగము కాంతి వేగములో 3వ వంతునుండి దానితో సమముగ నుండువరకు మారుచుండును. ఇవి 4 కణముల a కంటే 100 రెట్లు అధికముగా చొచ్చుకొనిపోవు స్వభా వము కలవి. కాని వాటి అయోనైజింగు శక్తి కణ ములయొక్క ఆశక్తిలో 100 వ వంతు ఉండును. ఒక 3కణముయొక్క అధిక వేగమునుబట్టి దాని ద్రవ్యరాశి ఒక ఋణ విద్యుదణువు (electron) కంటే అధికమని కనుగొనబడెను. ఆ ద్రవ్యరాశి యందలి ఆధిక్యము కచ్చిత ముగా ఐన్స్టీన్ల్చే చెప్పబడిన సూత్రమునకు అనుగుణ ముగా సరిపోవును. (c) 8 (గామా) కిరణములు: ఇవి సుమారు 10-10 నెం.మీ. తరంగ దైర్ఘ్యముగల మిక్కిలి కఠినమగు 'ఎక్సు' కిరణములు ఇవి తాము పడిన (ప్రసరించిన పదార్థము నుండి 3 కిరణములను బహిర్గత మొనర్చును. సాధారణ

ముగా ఒకే విచ్ఛిన్న ప్రక్రియయందు (disintegration) B (బీటా) కిరణములు, 8 (గామా) కిరణములు వెడల గ్రక్కబడుచుండును. ఆ కిరణములు P కిరణముల కంటె 100 రెట్లు అధికముగా చొచ్చుకొని పోగలిగియుండును. కాని అయోనై జింగు శక్తి యందు ఇవి B కిరణములతో పోల్చిన, 100 వ వంతు ఉండును, 8 కిరణములు అయ స్కాంత క్షేత్రముచే గాని, విద్యుత్ క్షేత్రముచే గాని, అతిక్రమణము (deviation) చెందవు. ఇవి 'ఎక్సు’ కిరణ ముల మాదిరిగ నే ఎక్కువగా విశ్లేషణము (diffraction) నొందును. ప్రేరిత లేక కృత్రిమ రేడియోధార్మికశక్తి (Indu- ced or Artificial Radio Activity) : 1934 వ సంవత్సరములో ఐరెని (క్యూరీసతియొక్క కుమార్తె), ఆమెభర్తయగు జోలియట్ అను నాతడు - బోరాన్, మెగ్నేషియము, అల్యూమినియము అనునవి a కణములచే ఆఘాతము నొందినమీదట రేడియో ధార్మిక శక్తి కలవి అయ్యెనని కనుగొనిరి. దీనినిబట్టి విచ్ఛిన్న ప్రక్రియ (disintegration) యందు ఉత్పత్తి యగునది రేడియోధార్మికశక్తిని కలిగియుండుననియు, కేంద్రక పరివర్తనములను (nuclear transformation) సామాన్య పద్ధతిలో నే చెందుననియు రుజువయ్యెను. అట్టి ఉత్పత్తుల యొక్క సగము మనుగడ (Half_Value period అత్యల్పముగా నుండును. అయినప్పటికిని పై జెప్పిన ధర్మములు రుజువయ్యెను. ఈదృగ్విలాసమును కృత్రిమ రేడియో ధార్మిక ప్రసరణమనెదరు. అల్యూ మినియం యొక్క సందర్భమున జరుగు ప్రతిక్రియ ఇట్లుండును. 13 A 1' + 2 He' 15 Prº + on' on' అనునది శూన్యపూరణము (Zero Charge)- ఒక పరిమాణపు ద్రవ్యరాశి (unit mass) గల కణము. అది న్యూట్రాను (Nutron) అనబడును. 15 Poo అనునది రేడియో భాస్వరము. దాని సగము మనుగడ (half value period) 15 సెకండ్లు. ఇది సిలికను అను పదార్థ ములోనికి విచ్ఛిన్నము చెందును. ఇదేవిధమగు పద్ధతుల ననుసరించి నేడు పలురకములగు రేడియో ధార్మిక శక్తిగల పదార్థములు తయారు చేయబడుచున్నవి.

23